Tolichupu Vikram and Betal Story in Telugu : In this article, తొలిచూపు భేతాళ విక్రమార్క కథలు, బేతాళ కథలు, Vikramarka Bethala Kathalu Telugu for Kids.
Tolichupu Vikram and Betal Story in Telugu Language : In this article, read తొలిచూపు భేతాళ విక్రమార్క కథలు, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
తొలిచూపు భేతాళ విక్రమార్క కథలు Tolichupu Vikram and Betal Story in Telugu
చిత్రరేఖ ఆమె తల్లి మదనరేఖలు ఆ బ్రాహ్మణుని నిద్రలేపాలని ప్రయత్నించారు. అతను లేవలేదు. చిత్రరేఖ ఆ బ్రాహ్మణుని చూసి ముగ్ధురాలు అయింది. అతను నవమన్మథాకారంలో పడుకుని నిద్రపోతున్నాడు. ఎంతలేపినా లేవటంలేదంటే ఆయన ప్రయాణంలో ఎంత బడలికచెందాడోననుకున్నారు. తల్లి మదనరేఖ అతన్ని నిద్రలేపి పంపేయత్న ప్రయత్నంలో వుంది. చిత్రరేఖ తల్లిని వారించింది. తొలిచూపులోనే ఆమె మనస్సు ఆ బ్రాహ్మణుని మీదలగ్న మైంది. అతన్ని మనస్సులో 'యెంత అందగాడో” అనుకుంది. అతన్ని మనసారా ప్రేమించింది లోలోన -
బ్రాహ్మణుడుని ఎంత నిద్రలేపాలని ప్రయత్నించినా లేవనందుకు, అప్పటికి తెల్లవారిపోవడంతో చిత్రలేఖ దాసీల సహాయంతో నిద్రపోతున్నవాడిని లోపలకు తీసుకువెళ్ళి పడుకోబెట్టింది.
వీరు పదేపదే పిలవడంతో ఆ బ్రాహ్మణుడు నిద్రలేచాడు. ఎదురుగావున్న వాళ్ళను మార్చిచూస్తున్నాడు. పెదవి కదిల్చి యేదీ చెప్పడంలేదు.
"అయ్యా! తమరు ఎవరు! యే ఊరునుండి యేఊరు వెడుతూ వచ్చారు! యీ మా అరుగుమీద ఎందుకు పడుకున్నారు" అంది చిత్రరేఖ.
బ్రాహ్మణుడు కళ్ళప్పగించి అభవంతిని ఆమందిరంను చూస్తున్నాడు!
అది చూసిన చిత్రరేఖ "అయ్యా! తమరు యెన్నో రోజులుగా నిద్రపోనట్లు బాగా అలసివున్నట్టు, గ్రహించాను. మిమ్మల్ని ఎంత నిద్రలేపినా లేవనందుకు నేనే తమర్ని లోపలకు తీసుకువచ్చి పాన్పుమీద పడుకోబెట్టాను” అంది చిత్రరేఖ.
“నేను” అని గొణిగాడు బ్రాహ్మణుడు.
“మా ఇంట్లోనే నాశయ్యా మందిరంలో వున్నారు. నా పేరు చిత్రరేఖ. నేను వేశ్యాకులంలో పుట్టి పెరిగిన పడతిని. మీ వివరం చెప్పండి. మీకు యే విధమైన ఆటంకం కలుగకుండా నేను చూసుకుంటాను" అన్నది చిత్రరేఖ. .
“చిత్రరేఖా” నేను బ్రాహ్మణ వంశంలో జన్మించాను. నా పేరు విద్యా సాగరుడు. నేతిబీరకాయలో నెయ్యియెంత వుంటుందో నాలో విద్యా అంతేవుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నాకు యే విద్యాసరిగా రాదు. కానీ అన్ని విద్యల్లోనూ ప్రవేశంవుంది. నేను విద్యావిహీనుడను అగుటవలన, నా తల్లిదండ్రులు, స్నేహి తులు,సోదరులు, బంధువులూ ప్రతి విషయంలోనూ నన్నుచులకన చేస్తుండేవారు. నన్నొక నల్లపూసను చూసినట్లు చూసి అగౌరపరిచేవారు. అని ఆగాడు.
“అలాగునా ?" అంది చిత్రరేఖ నొచ్చుకుంటూ -
“నా కథ అటువంటిది" అన్నాడు చిన్నగా విద్యాసాగరుడు
“మీరు భయపడకండి నా గురించి సంకోచించకండి ! మిమ్మల్ని ప్రాణంగా, ఎటువంటి ఇబ్బందీ వుండకుండా చూసుకుంటాను. చెప్పండి మీగురించి” అని అన్నది చిత్రరేఖ.
చిత్రరేఖ తల్లి మదనరేఖమూతివిరుపులతో అక్కడినుండి వెళ్ళిపోయింది. విద్యాసాగరుడు దిక్కులు చూస్తున్నారు.
"అయ్యా! సందేహించకండి! నేను తొలిచూపులోనే మిమ్మల్ని అభిమానించాను సందేహించకుండా నాకు అన్ని విషయాలూ చెప్పండి” అని పాన్పుప్రక్కన వున్న పీఠం మీద కూర్చున్నది చిత్రరేఖ.
COMMENTS