Thursday, 20 May 2021

Prana Rakshane Story in Telugu ప్రాణ రక్షణే తెలుగు కథ

Prana Rakshane Story in Telugu Language: In this article, we are providing "ప్రాణ రక్షణే తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.

Prana Rakshane Story in Telugu ప్రాణ రక్షణే తెలుగు కథ

విక్రమార్కుడు దేశ పర్యటన చేస్తున్నాడు. సంధ్యాసమయము అయ్యే సరికి ఒక అగ్రహారం చేరాడు. చీకటి పడటంతోను తను బాగా అలసి ఉండటం తోను ఆ అగ్రహారంలో విశ్రాంతి తీసుకోదలచాడు. అది గోదావరి నదీ తీర అగ్రహారం పేరు ధర్మపురం.

ఆయన గోదావరి నదీ స్నానం చేశాడు. దైవప్రార్ధనను ముగించు కున్నాడు. అనంతరం ఆ ప్రాంతంలోనే వున్న వినాయకుని గుడి యందుపురాణ . కాలక్షేపం జరుగుతోందని తెలుసుకున్నాడు. తను అక్కడికి వెళ్లి పురాణాన్ని " వింటూ కూర్చున్నాడు. .

ఆ సమయంలో అంటే పురాణ కాలక్షేపం మంచిరసపట్టుగా జరుగుతున్న సమయంలో ఒక మధ్యవయస్కురాలైన ఆడది గొల్లున ఏడుస్తూ ఆలయంలోకి ప్రవేశించింది. అందరి దృష్టిని ఆకట్టుకుంది. అందరూ ఆమె వంక ఒక్కసారిగా చూసారు. "అయ్యా! నా భర్త నదీ స్నానం చేస్తుండగా పెద్ద మొసలి వచ్చి ఆయనని లోపలికి ఈడ్చుకుపోతున్నది. ఆపదలో ఉన్న నా భర్తను రక్షించండి. నా పసుపు, కుంకుమను కాపాడండి.” అని భావురమని ఏడ్చింది.

అందరూ మొహాలు చూసుకుంటున్నారు. అది తమవల్ల అయ్యేపని కాదని. అంతలో విక్రమాధిత్యుడు ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమె భర్తను రక్షించ డానికి అంగీకరించాడు. ఆమెను వెంటరమ్మన్నాడు. ఆమె అతని వెనుకే నడిచింది.

విక్రమార్కుడు ఒక్కసారిగా నదిలో ఆ ఇల్లాలు చూపించిన చోటున ఉరికాడు. ఆమె ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించి చూస్తున్నది. నదిలోపల మొసలి పట్టుకున్న తనభర్త మొసలితో పోరాడుతున్నాడు. అది చూసి విక్రమార్కుడు అటు వెళ్ళి మొసలితో పోరు సాగించి. దానిని చిటికెల మీద సంహరించాడు. ఆమె భర్త బాగా అలసట పడడంతో అతనిని భుజాన వేసుకొని వడ్డునకు చేర్చి ఆమెకు అప్పగించాడు.

ప్రాణరక్షణ పొందిన ఆమె భర్తకు విక్రమార్కుడు చేసిన సహాయం ఘనం మనిపించింది. ప్రాణం కాపాడేందుకు అతను తన ప్రాణాలని లెక్క చేయకుండా నదిలోకి ఉరికి తనను రక్షించాడు. అది సామాన్యమైనదికాదు. తను ఏమి ఇచ్చినా ఋణం తీరదు. తను బీదవాడు ఏమి ఇవ్వగలడు ? తను గురించి అతనికి చెప్పాడు. "అయ్యా! నేను పేదవాడిని తమకు ఏమీ ఇచ్చుకోలేని వాడను నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డువేయతలచి నదిలోకి దూకారు నన్ను ఏమి ఇవ్వమంటారు” అని అడిగాడు.

“మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. ఆపదలో వున్నవారిని రక్షించడం మానవుడిగా నాధర్మం! నా గురించి చింతింపవద్దు” అని చెప్పి ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు విక్రమాధిత్యుడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశాడు. అతినికి ఏదో గుర్తుకు వచ్చి ఆగాడు. "అయ్యా!నాకు స్ఫురణకు వచ్చింది. నా వద్ద ఒక మంత్రం వుంది. దానిని ఎవరైతే జపించుతారో వారికి పాపాలన్ని పోతాయి. అంతేకాదు దానిని జపించినట్లయితే కోరినప్పుడు స్వర్గం నుండి విమానం వచ్చి తీసుకు వెళ్తుంది. ఆ మంత్ర వేరొకరికి ఉపదేశిం చాక తిరిగి నా పట్ల పనిచేయదు. వద్దనకుండా ఆ మంత్రానైనా స్వీకరించి నన్ను ధన్యుడను చేయండి.” అని అన్నాడు అతను.

“చేసిన మేలుకి ప్రత్యుపకారం చేయకుండా తిరిగి వెళ్ళేందుకు నాకు మనస్కరించడం లేదు. అంగీకరించండి” అని అన్నాడు. . ,

అతని మాటలు విని నవ్వుకున్నాడు. కాదనకుండ “సరే” అన్నాడు. విక్రమార్కుడు.

ఆ వెంటనే అతను ఆ మంత్రమును విక్రమాధిత్యునకు ఉపదేశించాడు. అనంతరం “అడగడం పరిచాను. తమ పేరు” అని అడిగాడు.

“విక్రమాధిత్యుడు అంటారు. ఉజ్జయినీ రాజ్యాధిపతిని” అని చెప్పాడు.

ఆ వెంటనే దంపతులు ఇద్దరు ఆయనకు పాదాభివందనములు చేసి వెళ్ళిపోయారు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: