Dana Gunam Story in Telugu Language : In this article we are providing దానగుణం తెలుగు కథ. "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.
Dana Gunam Story in Telugu Language : In this article, we are providing "దానగుణం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.
Dana Gunam Story Bhatti Vikramarka Kathalu in Telugu
అది ఒక అగ్రహారం ఆ అగ్రహారం విక్రమార్కుని రాజ్యంలో వున్నది.
అక్కడ ఒక బ్రాహ్మణుడు వున్నాడు. అతనికి శివుని అనుగ్రహం వలన చాలాకాలానికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెను ప్రేమతో పెంచి పెద్దచేశాడు. విద్యా బుద్ధులునేర్పించాడు. ఆమె విద్యావంతురాలుఅయింది. యుక్తవయస్సు రావడంలో వివాహం చేయసంకల్పించాడు. వరుడుని అట్టే ప్రయాసపడకుండానే కుదుర్చుకున్నాడు. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా బీదవాడు. సంబంధం అయితే కుదుర్చుకున్నాడు కానీ పెళ్ళి చేయడానికి ఎవర్ని ఎర్రని అరకాని అయినా అడగలేదు. కర్తవ్యం కోసం ఆలోచించాడు రాజు విక్రమాధిత్యుని కలసి యాచించా లన్న తీర్మానంతో కూతురిని అల్లుడిని వెంట పెట్టుకొని విక్రమాధిత్యుని కొలువుకు వెళ్ళాడు.
ఈ బ్రాహ్మణుడు రాజుగార్ని స్తోత్రం చేశాడు.
అనంతరం విక్రమాధిత్యుడు వాళ్ళను చూస్తూ “నానుండి మీరు కోరుకునేది యేమిటి” అని అడిగాడు. అప్పుడు వధువు యీ విధంగా చెప్పింది.
చేతులు జోడించి నమస్కరించింది. "అయ్యా!” ఈర్ష్యాసూయల కతతీంగా వదాన్యుడవై, రుద్రపూజలు నిత్యాన్నదానాలు చేస్తూ, తోడుగా మంచి మంత్రులను కలిగి విపులుడై భక్తిని కలిగి, వాజసేయాది క్రతువులు చేస్తూ, హరిసేవాపారాయణుల ముదముకు కూర్చుతూ, కామధేనువు మాదిరిగా వజ్ర వైఢూర్యాలు లెక్కపెట్టికుండా యివ్వవలసిందిగా కోరుతున్నాను" అని అంది వధువు.
ఆమె చెప్పింది యేమిటో బోధపడలేదు ఆలోచించి తదుపరి చెప్పిన మాటల్లోని మొదట అక్షరాలు వరుసచేసిచూసిన తమతో వున్న వరునితో పెళ్ళికావాల్సివున్నదని భావించవచ్చును. ఆమె అభిప్రాయం బోధపడింది. ఆమె తన వివాహానికి ద్రవ్యము కావలసి వచ్చినది గ్రహించాడు మాటల్లోని ప్రతిమాట వాటి అక్షరాలు లెక్కపెట్టి ప్రతి అక్షరానికి వెయ్యి రూపాయలు చొప్పున యిచ్చాడు. వధూవరులు, తండ్రి మిక్కిలి ఆనందించారు. విక్రమార్కునిలోని దాన గుణానికి ఎంతో మెచ్చుకున్నారు మహారాజు యిచ్చిన ధనంను తీసుకొని వారివద్ద శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
COMMENTS