Udara Swabhavam Story in Telugu Language : In this article, "ఉదార స్వభావం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.
Udara Swabhavam Story in Telugu Language : In this article, we are providing "ఉదార స్వభావం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students.
Udara Swabhavam Story Bhatti Vikramarka Kathalu in Telugu
విక్రమార్క మహారాజు ఒకప్పుడు అశ్వమేధ యాగం చేయ నిర్ణయం చాడు దేశ దేశాల మహారాజులకు యీ విషయం తెలియపరిచి అందరికీ ఆహ్వానాలు పంపాడు.
ఆహ్వానితులు అందరూ రకరకాల కానుకలతో ఉజ్జయినీ వచ్చి విక్రమార్కునికి సమర్పించారు. ఈ సందర్భంగా సముద్రుడుకి తన పురోహితుని ద్వారా ప్రత్యేక ఆహ్వానంను అందచేశారు.
“బ్రాహ్మణోత్తమా ! ఆ మహానుభావుని ఆహ్వానంను మన్నించి నేను తప్పకరావలసిందే ! కానీ, నేను ప్రతి క్షణమూ తీరిక లేకుండావున్నాను. అందు వలన నేను యాగమునకు వచ్చినట్లే భావించమని నా వంతుగా తెలియపర చుటకు యీ నాలుగు రత్నాలనూ నా కానుకగా సమర్పించు" అని అన్నాడు సముద్రుడు. పురోహితుడు అంగీకరించినట్లు తలూపాడు. ఆయన యిచ్చిన నాలుగు రత్నాలను అందుకున్నారు
“చిత్తం ఏమని చెప్పమంటారూ ? పురోహితుడు అడిగాడు.
“ఈ రత్నాలలో ఒకటి సేనను యేర్పాటు చేస్తుంది. రెండవది ధనము వస్త్రాలు యేర్పర్చుతుంది. మూడోరత్నం ఎంత మంది వచ్చినా మంచిభోజనం అందించి భుజించేవార్ని తృప్తిపరుస్తుంది. నాల్గవరత్నం కోరిన బంగారాన్ని కలిగించుతుంది అని చెప్పాడు సముద్రుడు. పురోహితుడు తృప్తిగా ఊపిరిపీల్చు కొని సముద్రుని వద్ద శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు.
పురోహితుడు ఉజ్జయినీ వచ్చాడు. మహారాజు విక్రమాధిత్యునకు సముద్రుడు చెప్పమన్నది చెప్పి రత్నాలు యివ్వబోయాడు. విక్రమాధిత్యుడు ఆనందభరితుడు అయ్యాడు. పురోహితునితో “ఆ నాలుగు రత్నాలలో నీవు కోరుకునే రత్నం ఒకటి తీసుకొని మిగతా మూడు రత్నాలునీయి” అన్నాడు.
పురోహితుడు ఆలోచించుకున్నాడు, “తనకు యే రత్నం అవసరమో తేల్చుకోలేకపోయాడు. అంతలో” యేమిటి సందేహం అని అడిగాడు రాజు.
"అయ్యా! నేను ఇంటికి వెళ్ళి నాభార్యను అడిగి మీరు చెప్పినట్లు ఒకరత్నం తీసుకుంటాను యే రత్నం తీసుకోవాలంటుందో దాన్నే తీసుకొంటాం అని చెప్పాను పురోహితుడు.
విక్రమాధిత్యుడు అంగీకరించగా పురోహితుడు ఇంటికిపోయాడు, భార్యకు, కొడుక్కి కోడలుకీ రత్నాలు గురించిన వివరంను విశదీకరించాడు మనం వీటిలో యే రత్నం తీసుకోవాలి”ని అడిగెను.
కొడుకు మొదటి రత్నాన్ని తీసుకోమని చెప్పాడు, కోడలు రెండో రత్నాన్ని తీసుకోమని అన్నది! భార్యను అడిగితే మూడోరత్నాని తీసుకోమని చెప్పింది.
ఈ విషయంను మర్నాడు పురోహితుడు వెళ్ళి రాజుతో చెప్పాడు. తమ ఇంట్లోని వారు అడిగినరత్నాలగురించి. అయితే మీరు ఏరత్నం కోరుకుంటారు అని అడిగాడు రాజు విక్రమార్కుడు.
నేను నాల్గవ రత్నాన్ని అని చిన్నగా చెప్పాడు పురోహితుడు. .
"సరే ! అయితే నాల్గురత్నాలను మీ ఆలుబిడ్డలు మీరు కోరుతున్నారు. ఈ రత్నములు మీరే తీసుకుపోయి మీ కుటుంబ సభ్యులు నలుగురు నాలుగు రత్నాలు తీసుకోండి” అని అన్నాడు రాజు విక్రమార్కుడు. .
పురోహితుడు ఆశ్చర్య చకితుడైయ్యాడు నాల్గు రత్నాలు తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో విక్రమాధిత్యుని ఉదార స్వభావమునకు మిక్కిలి ఆనందించారు పురోహితుడు ఆతని కుటుంబ సభ్యులు.
COMMENTS