Shapam King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "శాపం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids.
Shapam King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "శాపం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Shapam King Vikramaditya Story in Telugu Language
విక్రమాధిత్యుడు దేశాటన చేసి వెళ్తున్నాడు. అతనికి కొంత దూరం వెళ్ళాక పాడుపడిన ఆలయం కనిపించింది. అది వింధ్యపర్వత ప్రాంతం ఆ ఆలయం ముందు పెద్ద వృక్షం వుంది. ఆవృక్షం మీద ఒక రాక్షసుడు కనిపించి నాడు. అదిచూసి విక్రమార్కుడుతనకెందుకులే అని వెళ్లిపోలేదు. అక్కడికి వెళ్ళాడు.
చెట్టుమీద వున్న రాక్షసుడు అమాతంగా చెట్టుమీదనుంచి క్రిందకు దూకాడు. అక్కడే వున్న విక్రమార్కుడిని కళ్ళార్పకుండా చూస్తున్నాడు.
విక్రమార్కుడు ఎవరు నువ్వు ? స్వతహాగా రాక్షసుడవేనా కాక వేరెవరి వైనాన అని అడిగాడు. “నేను రాక్షసుడను కాను నాది రాక్షస జన్మ కాదు అన్నాడు” రాక్షసుడు. -
“మరి అయితే ఎవరు నువ్వు?” అని అడిగాడు విక్రమార్కుడు. “అయ్యా! చెప్తావినండి” అడిగినప్పుడు చెప్పకపోవటం నా తప్పుఅవుతుంది. నేను వింధ్య రాజువద్ద ఆస్థాన పురోహితుడను. మా మహారాజునకు పండిత సత్కారమంటే మహాఇష్టం. అందువలన నన్ను పరిక్షకుడుగా దలచినియమించాడు. నేను చెప్పిన పండితులనే సత్కరించి బహుమతులు ఇచ్చేవాడు.నాలో నాకే కదా పరీక్షకుడను అన్న గర్వం అధికమయింది. ఎటువంటి మహత్తర శక్తివంతుడు వచ్చినా పట్టించుకునే వాడిని కాను. తక్కువ చేసి మాట్లాడేవాడిని. కాలం ఈ విధంగా సాగుతోంది. ఒకప్పుడు వేదశాస్త్రములే కాక అన్ని విధ్యలు తెలిసిన పండితుడు ఒకడు వచ్చాడు. తను పరీక్షకోసం వచ్చినట్టు చెప్పాడు. పరీక్షలో తనునెగ్గుతాననినమ్మకంతో అన్నాడు. కనుకతనను పరీక్షించి బహుమతిని అందజే యాలని కోరాడు. అందుకు నేను నిరాకరించాడు. పరీక్షకు అర్హతలేదని చెప్పాను.
దాంతో వచ్చిన పండితుడుఆగ్రహించి, “దుర్మధాందా! నీ గర్వమే నిన్ను అణిచివేస్తుంది. నీవు నన్ను అవమానపరచిన కారణంగా నీవు బ్రహ్మరాక్షసుడివై బ్రతుకు” అని శపించి పంపించాడు.
“ఆ తక్షణం నేను రాక్షసుడైనాను” అయితే నన్ను మన్నించి అను గ్రహించి నాయధారూపమును నాకు ఇమ్మని ప్రార్ధించాను. అప్పుడు ఆ బ్రాహ్మణ పండితుడు ఇచ్చిన శాపం ఉపసంహరించుకోవడం జరగదని అయితే దానికి ఒక మార్గం ఉందని అన్నాడు.
ఆ మార్గం ఏమిటో తెలవివ్వమని ప్రార్ధించాను.
అప్పుడు బ్రాహ్మణ పండితుడు 'ఉజ్జయిని పాలించే విక్రమార్కుడు దైవశక్తిని పొంది వస్తాడు. ఆ దైవశక్తితో నిన్ను రక్షించగలడు.' అని చెప్పాడు.
అప్పడి నుండి నేను తమ రాకకై నిరీక్షిస్తున్నాను. నన్ను ఈ ఆలయం దగ్గర చెట్టు నివాసంగా చేసుకొని ఉండమన్నాడు. అప్పటి నుండి ఈ చెట్టుమీదనే ఉంటూ తమ రాకకై నిరీక్షిస్తున్నాను. తమరు గోదావరి నదిలో మొసలిని చంపి బ్రాహ్మణుడుని రక్షించారు ఆ బ్రాహ్మణుడు మీకు మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రం వల్ల నాకు శాప విమోచనం కలుగుతుందని అన్నాడు ఆ బ్రాహ్మణుడు.
ఇదీ జరిగినకధ. “దయచేసి ఆమంత్రంసహాయంతో నన్ను అను గ్రహిం చండి స్వామీ” అని వేడుకున్నాడు.
విక్రమాధిత్యుడు ఆలోచించలేదు. తక్షణం అతని కోరికను మన్నించి ఆ మంత్రంతో అతనికి యధారూపంలోనికి మార్చాడు.
ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించాడు. స్వర్గం నుంచి పుష్పక విమానం వచ్చింది అందులో స్వర్గానికి వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు తృప్తిగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి ఉజ్జయినికి తరలి వెళ్ళాడు.
COMMENTS