Monday, 24 May 2021

Bhatti Vikramarka Story in Telugu భట్టి విక్రమార్క కథలు తెలుగు కథ

Bhatti Vikramarka Story in Telugu Language: In this article, we are providing "భట్టి విక్రమార్క కథలు తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students

Bhatti Vikramarka Story in Telugu భట్టి విక్రమార్క కథలు తెలుగు కథ

వేద, యజ్ఞ, చంద్రశర్మ వీరనారాయణ అనబడే నలుగురూ ఇంద్రశర్మ అనే ఆయన కుమారులు. వీరు బ్రాహ్మణులు, వేద నారాయణపురం అనే అగ్రహారంలో వీరి నివాసం. అది వారి స్వంత ఊరే !

నలుగురు సంతతిలోనూ చంద్రశర్మ అనేవానికి చదువు సంధ్యలు అబ్బలేదు. ఎప్పుడూ ఇంటిపట్టున వుండకుండా జులాయిగా వుండేవాడు. అతనికి జులాయిల స్నేహం అధికం. మంచివాళ్ళు వాళ్ళ స్నేహాలు గురించి పట్టించుకునేవాడు కాదు అవి మంచి పద్దతికాదు అని అన్నలు మందలించిన తరువాత తిరుగుడు మానేశాడు. ఇంటి పట్టునే వుండేవాడు. ఇంటిదగ్గరనే వుంటే అలవాటు లేకపోయినా అన్నలు మీద అభిమానంతో తప్పనిసరై వుంటున్నాడు. వదినలు అన్నలూ అంటే గౌరవం ! వదినలు అన్నలు చెప్పిన ఇంటిపనులు అన్నీ చేస్తుండేవాడు. 

మిగతా ముగ్గురూ అంటే వేద, యజ్ఞ వీరనారాయణ చదువుకొన్నవారు. నాలుగు వేదాలు, పురాణాలు, సకల శాస్త్రములూ చదివారు విద్యలో ఉత్తీర్ణులు అయినారు. యీ ముగ్గురికీ వెలకట్టలేని విలువవుంది. . వీరిని యెవరైనా యెక్కడైనా అభిమానించేవారు. పండిత శ్రేష్ఠులలో వారికి వారేసాటి అని అనిపించుకున్నారు. ఎన్నో సన్మానాలు జరిగాయి. రాజ్యాధిపతులు ఆహ్వానించి వారి విశిష్టతను గుర్తించి వారలకు ఘనమైన సన్మాలు చేసేవారు.

ఎవరిని చూసినా పై ముగ్గురిని గౌరవించేవారు కానీ నాల్గవవాడిని గురించి అసలు పట్టించుకునేవారుకారు.

అన్నలకు అంత గౌరవం వుంది. తనంటే సమాజంలో విలువలేదు. తనను గౌరవించే వాళ్ళేలేరు ఇందుకు గల కారణాలేమిటని ఆలోచించసాగాడు. విలువ గురించి అన్నలను అడుగుతే వాళ్ళకు తీరిక లేనందున పట్టించు కునేవాళ్ళుకాదు.

తనకు యెవరూ సహాయం చేయడం లేదు. తన స్వశక్తి మీద ఆధారపడి అభివృద్ధిలోనికి రావాలి. యేం చేయాలి ? అదే ఆలోచన; అదే తపన.

మనిషి మనుగడకు, వారు అభివృద్ధి లోనికి రావడానికి అవసరమైంది విద్యని అనిపించింది. యీ విధంగా అనిపించేటందుకు గల కారణం అన్నలకు వచ్చిన గౌరవ ప్రతిష్ఠలు. అందువలన తనూ మారాలి తనకూ వెలకట్టలేని విలువ రావాలి. అందుకు ముందు చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. 'చదువులేనివాడు చాకిరేవు బండకన్నా హీనం' అనిపించింది.

అందుకు తను యేంచేయాలి ? యేం చేయాలా అని ఒంటరిగా కూర్చుండి ఆలోచించేవాడు. అతని మెదడులోతన సందేహాలకు సమాధానం దొరికింది. అగ్రహారంలో వుంటే ఇంటి చాకిరేగాని తనకు చదువు చెప్పేవారు లేరు. చదువు నేర్పమని అడిగితే చులకన అవ్వాలన్న సందేహం బయల్దేరింది.

చంద్రశర్మ ఇంటనుండి బయల్దేరి పరాయి ప్రదేశం అంటే మరోదేశం వెళ్ళి అక్కడుండి తన ఆశయంను తీర్చుకోవాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఎవ్వరికి తన అభిప్రాయం చెప్పకుండా రాత్రికి

రాత్రే కాలినడకన బయల్దేరాడు. తను యే ఊరు వెళ్ళాలి ? యెవర్ని ఆశ్రయించి ప్రయోజకుడు అవ్వాలి అన్న ఆలోచన విడనకుండా వుంది. గమ్యం తెలియని అతని నడకముందుకు సాగుతుంది. చాలా దూరం నడిచాడు. యెవ్వరూ కనిపించలేదు. బాటసారులు వెడుతున్నారు వస్తున్నారు అతన్ని గురించి మాత్రం యెవ్వరూ పట్టించుగోడం లేదు నడిచీ నడిచి అతను ఒక నదీ తీరానికి చేరాడు. కాళ్ళు స్వాధీనంలోలేవు. బరువెక్కి తప్పటడులు పడుతున్నాయి. అలసట క్షణక్షణానికి అధికమవుతోంది. సూర్యుడు నడినెత్తిన నిలిచి తన తాకిడితో అతన్ని నిలిచేలా చేస్తున్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోత్నుది. నాలుకతో ఎండిన పెదాలను తుడుపుకుంటూ కాకతాళీయంగా నది ఒడ్డున తన ఆకలి యెవరు తీరుస్తారు? ఓపికను కూడ దీసుకొని అక్కడనే వున్న ఇసుక దిబ్బమీద కూర్చున్నాడు. అతని కళ్ళు పరిసరాల్ని చూస్తున్నాయి కర్తవ్యశూన్యంగా చూస్తున్నాడు చంద్రశర్మ.

అక్కడికి అల్లంత దూరంలో ఇళ్ళు వున్నట్లు కనిపించాయి. అదేదో ఊరు అనుకున్నాడు పోతున్న ప్రాణం వచ్చినంతపనయింది. లేచి నిలబడి చుట్టూ చూశాడు ఎవరో వృద్ధుడు నదీ తీరానికి వచ్చాడు ఆయన్ని అడిగాడు ఆ ఊరు గురించి అది అగ్రహారం అని సందేహాన్పదంగా చూశాడు.

“అగ్రహారం అంటే యేమిటో తెలుసునా ! అదీ ఒక ఊరే ! దానికి అగ్రహారం అని ఎందుకు పేరు వచ్చింది ? బ్రాహ్మణుల ప్రతిభని, పాండిత్యాన్ని పాలించే ప్రభుత్వం గుర్తించి వారలకు ఊళ్ళను కానుకగా యిచ్చేవారు. ఆ ఊళ్ళనే అగ్రహారాలు అంటారు” అని చెప్పాడు. .

ఆ ఊరిలో వుండేవారంతా బ్రాహ్మణులే. వారిలో నూటికి తొంభై తొమ్మిది మంది ఏదో ఒక శాస్త్రాన్ని పట్టకొని పాండిత్యం సంపాదించినవారే విషయం మేమిటని అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు చంద్రశర్మ తన గురించి చెప్పాడు. స్నానానికి సంధ్యావందనానికి బ్రాహ్మణులు సాయం సమయానికి నదికి వస్తారు. వాళ్ళను ఆశ్రయించు అని చెప్పి వెళ్ళబయలుదేరాడు. .

చంద్రశర్మకు శరీరం తేలికయింది. ఎండను సహించలేకపోతున్నాడు. భరించేశక్తి లేదు. చూట్టూ చూశాడు అవతలగా నదీతీరాన పెద్దమర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టుక్రిందచేరి సేద తీర్చుకుంటున్నాడు. ఆ మట్టిచెట్టు అప్పట * వరకూ తను చూసిన చెట్లకన్నా అతి పెద్దదిగా కనిపించింది. చుట్టూ ఊడలుదిగి వున్నాయ్.

చంద్రశర్మ చెట్టు క్రింద కూర్చుని భయంతో తనను కాపాడమని భగవంతుని ధ్యానించుతున్నాడు.

ఆ మర్రిచెట్టుమీద ఒక బ్రాహ్మణ బ్రహ్మరాక్షసి నివసిస్తున్నది. అది చంద్రశర్మను చూసించి తన రూపం మార్చుకుని బ్రాహ్మణుని రూపంలోకి మార్చుకొని చంద్రశర్మ ఎదుటకు నిలబడింది.

చంద్రశర్మను ఎవరివని అడిగాడు బ్రాహ్మణుడు.

తనగురించి చెప్పుకున్నాడు “అయ్యా చదువులోవున్నవిలువ తెలుసుకొని ఆ చదువు నేర్చుకోవాలని బయలుల్దేరి వచ్చాను. అని గతంగురించి చెప్పాడు.

రాక్షస బ్రాహ్మణుడు చిన్నగా నవ్వాడు. “అయితే అబ్బాయ్ నా దగ్గర చదువుకుంటావా ?” అని అడిగాడు.

చంద్రశర్మకు ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ రాక్షసి అని తెలియదు. గుర్తించ లేదు. తనకు అవసరం అయింది విద్య ఆ విద్య నేర్పుతానని అనడంతో ఆనంద భరితుడయ్యాడు. తన అంగీకారాన్ని తెలియపర్చాడు. ఆ భగవంతుడే దయతల్చి తమర్ని పంపాడని భావించుతాను. మనస్పూర్తిగా అంగీకరించుచున్నాను అని అన్నాడు చంద్రశర్మ.

అయితే అందుకు నేను అంగీకరిస్తున్నాను. యిందుకు నేను ఒక పని చేశాను అది తప్పనిపించింది. నేను ఎవరో తెలియపరుస్తాను. భయపడకుండా చూడుఅంటూ బ్రాహ్మణుడు చంద్రశర్మనుచూశాడు. చంద్రశర్మకర్తవ్యంశూన్యంగా చూస్తున్నాడు అప్పటికప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసిగా మారిపోయింది.

చంద్రశర్మ రాక్షస ఆకారం చూడగానే భయంతో క్రిందపడ్డాడు. అతనికి స్పృహలేదు.

చంద్రశర్మ పరిస్థితికి బ్రహ్మరాక్షసినివ్వెరపడింది. వెంటనే మళ్ళీ బ్రాహ్మణ రూపం దాల్చింది. నవ్వుతూ చంద్రశర్మను సమీపించి అతని వైపు చేతిని ఆడించింది. చంద్రశర్మకు స్పృహ వచ్చింది. కళ్ళెదురుగా బ్రాహ్మణుడు చూస్తున్నాడు తనవలన చంద్రశర్మకు మేలు కలుగుతుంది కాని కీడు జరగదని నచ్చచెప్పాడు. దాంతో ధైర్యం కూడదీసుకున్నాడు భారం భగవంతుని మీద వుంచి అంగీకరించాడు చంద్రశర్మ.

ఆ మరుక్షణం చంద్రశర్మను తనతోబాటు మర్రిచెట్టుమీదకు తీసు కెళ్ళాడు. రాక్షస బ్రాహ్మణుడు అనుకున్నట్లుగా చంద్రశర్మకు విద్యాదానం చేశాడు. అతడు విద్యావంతుడు అయ్యాడు.

“గురువుగారూ ముందు తమర్ని అనుమానించాను మిమ్మల్ని చూసి భయపడ్డాను తదుపరి మీ అంతటి గొప్పవారులేరని తలచాను. నా జీవితం అంతా మీకు ఋణపడివున్నాను. నాబ్రతుక్కి వెలుగు చూపించారు అని నమస్కరించి“నా దొక అనుమానం, సకలశాస్త్రాలుకూలంకషంగావంటికి పట్టించుకున్న పండితులు తమరు బ్రహ్మరాక్షసిగాయెందుకుంటున్నారు. తిరిగి ప్రశ్నించాడు చంద్రశర్మ.

“కారణం లేనిదే యే పనీ జరగదు చిరంజీవీ! అడిగావుగనుక చెప్పక తప్పదు. చెప్తున్నాను. సావధానుడివై విను” అన్నాడు బ్రాహ్మణుడు. చంద్రశర్మ తలూపాడు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: