Pannagatavi King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "పన్నగాటవి తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Pannagatavi King Vikramaditya Story in Telugu Language
అనంతరం విక్రమాధిత్యుడు గుర్రం మీద వెడుతూండగా నలుగురు సిద్దులు పెడుతూ కనిపించారు. వాళ్లను చూసి గుర్రం దిగి వాళ్ళకు నమస్కరించాడు. “అయ్యా! తమరు ఎక్కడికి వెళుతున్నారు.” అని అడిగాడు.
“దేశాలు తిరిగివస్తున్నాం. సింధూ దేశం వెడుతున్నాము” అన్నాడు ఒక సిద్ధుడు. అన్ని దేశాలు తిరిగారా! ఏమేమి అద్భుతాలు చూశారు. అని అడిగాడు విక్రమార్కుడు.
"ఉత్తర దేశాన ఉన్న అన్ని ప్రదేశాలు, అన్ని దేశాలు, అన్ని క్షేత్రాలు చూసి వచ్చాము. కాని అమూల్యమైన హిమాలయ ప్రాంతం మాత్రం వెళ్ళలేక పోతున్నాం.” అన్నాడు మరో సిద్ధుడు.
“అయ్యో! అది చాలా ముఖ్యమైన ప్రదేశమే! ఎందుకు వెళ్ళలేదు అనిఅడిగాడు” రాజు.
“అది చాలా చిత్రమైనది. ఆ ప్రదేశంలో రకరకాల సర్పాలున్నాయ్. అడుగడుగునా పాములే! అందువలన మేము అక్కడికి వెళ్ళలేదు” అన్నాడు మరో సిద్ధుడు.
"ప్రాణభీతితో .వెళ్ళలేకపోయారు.” అని చిన్నగా నవ్వుకున్నాడు విక్రమాధిత్యుడు.
సిద్ధులు 'అవున'ని తలూపారు. ఆతక్షణం ఆయన వద్ద శెలవు తీసుకొని వెళ్ళిపోయారు.
విక్రమాధిత్యుడు క్షణం ఆలోచించాడు వెంటనే గుర్రం ఎక్కేడు. గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. అనుకొన్న విధంగా పన్నగాటవి చేరుకొన్నాడు. అదే పాముల అడవి. వాటిని గురించి ఆలోచించకుండా ముందుకు వెడుతున్నాడు.
అడుగడుగునా పాములు తిరుగుతున్నాయి. అవి ఒకేరకమైన పాములు కావు. రకరకాల పాములు ఆ పాములు. విడవకుండా విక్రమాధిత్యుని శరీరమంతా చుట్టుకున్నాయి. వాటిని లెక్కచేయక అందిన పాముని అందినట్టు పట్టుకొని విసిరివేస్తున్నాడు. అయినా పాములు అతనిని విడువలేదు. విక్రమాధిత్యుడు లోనికి వెళ్ళడం మానలేదు. అనుకున్న ప్రకారం అనుకున్నట్లు సిద్ధయోగిని యోగిని దర్శించాడు.
సిద్ధయోగిమఠాన్ని దర్శించాడు. ఆ సమయంలో అతని శరీరంను చుట్టుకొని వున్న పాములన్నీ అతనిని విడిచి ఎటో వెళ్ళిపోయాయి.
విక్రమాధిత్యుడు గుర్రం దిగి సిద్ధయోగికి చేతులు జోడి నమస్కరించాడు.
అతని ధైర్యసాహసాలకి మెచ్చిన సిద్ధయోగి లేచి వెళ్ళి రాజుని కౌగిలించు కున్నాడు. 'రాజా నీవు సామాన్యుడవు కాదు. ఏ ప్రాంతం వాడివి ? ఎవరివి? నీ పేరేమిటి?” అని అడిగాడు.
“నేను ఉజ్జయిని రాజుని నన్ను విక్రమాధిత్యుడు అంటారు.” అని చెప్పాడు. తమ దర్శన భాగ్యం కలిగించుకునేందుకు వచ్చాను అన్నాడు రాజు.
ఆ తక్షణం సిద్ధయోగి మిక్కిలి సంతోషించాడు. అతనిని మెచ్చుకున్నాడు.
ఒక బొంత, ఒక బలపము, ఒక కొరడాను బహూకరించాడు.
“వీటిని ఎందుకుప్రసాదించారుస్వామి అని అడిగాడు విక్రమాధిత్యుడు”
“చెప్తున్నానువిను. నీకు ఏదైనా చనిపోయిన జంతువు అవసరమనిపిస్తే బలపంతో రాసి కొరడాను ఎడమ చేతితో పట్టి ఆ జంతువుకు తాకిస్తే అది
ప్రాణంతో లేస్తుంది. బొంతను విధిలించినట్లైతే ధనం గుమ్మరిస్తుంది.” అని చెప్పాడు. యోగి
తిరిగి బయలుదేరి గుర్రం మీద వెళుతున్నాడు విక్రమాధిత్యుడు.
దారిలో అతనికి ఒకడు కట్టెలుకొడుతూ కనిపించాడు. రాజు గుర్రం ఆపాడు. అతనిని చూస్తు “నువ్వు కట్టెలు కొట్టుకునేందుకు ఇంత దూరం రావాల్నా అని అడిగాడు.
“రాక తప్పలేదు. ఎందుకంటే నేను ఒక రాకుమారుడి మిత్రుడను అతని తండ్రి యుద్ధములో చనిపోయాడు. రాజ్యం శత్రువుల స్వాధీనం అయింది. తప్పనిసరై రాకుమారుడు వన్నీ అడవిలోనికి తీసుకువచ్చాడు. అడుక్కుని తిని బ్రతకడం కన్నా చావడం మంచిదని తలచాము. అగ్ని రగల్చడానికి మంట మండించడానికి కట్టెలు అవసరం కదా. అందుకని కట్టెలు కొట్టుకుంటున్నాను.” అన్నాడు అతను.
“మీ రాకుమారుడు ఎక్కడున్నాడు” అని ప్రశ్నించాడు. .
“అదిగో ఆ చెట్టుకింద కూర్చొని ఉన్నాడు.” అని రాకుమారుని, చెట్టునీ చూపించాడు.
“మీ రాకుమారుడి దగ్గరకు వెడదాం పద” అన్నాడు విక్రమార్కుడు.
అతనుకాదనలేదు విక్రమాధిత్యుని తమరాకుమారిని వద్దకు తీసుకు వెళ్ళాడు. అతను విక్రమార్కుని రాకుమారునకు పరిచయం చేశాడు. రాకు మారుడు లేచి నిలబడి నమస్కరించెను. -
“అబ్బాయీ ! రాజులకు యుద్ధం చేయడం సహజం. యేదో విధంగా శత్రువులను జయించాలి కానీ, పిరికివాళ్ళుగా ప్రాణాలు తీసుకుంటారా నేను నీకు సహాయపడేందుకే వచ్చాను. యీ మూడు వస్తువులు తీసుకోముందు” అని బలపమూ కొరడా, బొంతనీ యిచ్చాడు.
రాజు అవి ఎందుకు యిచ్చాడో బోధపడక చేతిలోని వస్తువుల్ని రాజుని మార్చి మార్చి చూశాడు.
“ఆ బలపంతో చనిపోయిన చతురంగ బలాలను వ్రాయండి. కొరడా కోలంతో ఆ రాసినవాటిని తాకించండి అందరూ సజీవులై మీ ముందు వుంటారు తదుపరి బొంతను గట్టిగా దులపండి. ధనరాశులు పడతాయి” అన్నాడు.
రాకుమారుడు వింతగా చూస్తున్నాడు.
“ఆపని నా ఎదుటనే చేయండి” అన్నాడు విక్రమార్కుడు.
రాకుమారుడు అతను చెప్పిన విధంగా చేశాడు. ఆ వెంటనే విక్రమాధి త్యుడు చెప్పినట్లే జరిగింది. రాకుమారుడు అతని స్నేహితుదు ఆనందంతో పొంగిపోయారు. విక్రమార్కునికి పాదాభివందనం చేశారు.
“రాకుమారా ! నీకు సైన్యం వుంది. ధనం సమకూరింది. ఇంక నువ్వు శత్రువులను మట్టుపెట్టడంనకు యే యిబ్బందీ లేదు. శత్రువులను జయించు, నీ రాజ్యమును తిరిగి చేజిక్కుంచుకో !” అని ఆశీర్వంచాడు విక్రమార్కుడు ఆ వెంటనే బయల్దేరి వెళ్ళిపోయాడు విక్రమాధిత్యుడు.
రాకుమారుడు, అతని మిత్రుడు విక్రమార్కుని ఉదార స్వభావానికి మిక్కిలి ఆనందించి తమ రాజ్యాలను తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం మీద అప్పటికప్పుడే తరలి వెళ్ళారు స్నేహితులు యిద్దరూ.
0 comments: