Sunday, 23 May 2021

Curse King Vikramaditya Story in Telugu Language

Curse King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "శాప తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students

Curse King Vikramaditya Story in Telugu Language

“నేను అనుభవిస్తున్న శాపం ఒక గర్విష్టి అయిన బ్రాహ్మణుని శాపం” అన్నాడు బ్రాహ్మణుడుగా బ్రహ్మరాక్షసి.

“ఎవరా బ్రాహ్మణుడు ఎందకు శపించాడు” అడిగాడు చంద్రశర్మ,

కృష్ణాతీరంలో వున్న సరస్వతీ తీర వాసిని నేను! నేను బ్రాహ్మణుడినే సకల విద్యాపారంగతుడను నేను. ఒక రోజు నన్ను శపించిన బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చాడు నేనును కొన్నివిద్యలను అభ్యసించాను నేర్చుకోవలసిన విద్యలు న్నాయి. ఆ విద్యలు నన్నింటిని తమరు దానం చేయాలి అందుకే వచ్చానుఅని నా వెంటపడి నన్ను వేదించసాగాడు. ఆ బ్రాహ్మణుడు యే కారణం వలననో కానీ గర్వాంధకారి అనిపించింది నాకు నేర్చుకున్న విద్యల్లో తనను మించినవాడు

లేడన్నభావంకనిపించింది. అతనిలో అందువలననే అతనికి విద్యాదానం చేయ డానికి నిరాకరించాను. దాంతో అతడు కోపావేశపరుడై నాకీ శాపంను దక్కించాడు.

“మూర్ఖుడా! నువ్వు సకల విద్యాపారంగతుడవు అయినా నాకు విద్య బోధన చేయడానికి అంగీకరించలేదు. కనుక నువ్వు బ్రహ్మరాక్షసిగా బ్రతుకు” అనిశపించాడు. ఆ శాపానికి నేను మిక్కిలి భయపడ్డాను. " అయ్యా నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. అది నానేరమే అంటాను. నేను రాక్షసుడుగా, భూతంగా, బ్రతకలేను దయవుంచి నాకు శాపవిమోచనకు అవకాశం కల్గించండి” అని ప్రార్థించాను. అతని మనస్సు కరగలేదు. నేను చాలాసేపు బ్రతిమాలాడాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంతలో కొంత కనికరించినట్లున్నాడు. “కొంతకాలానికి చంద్రశర్మ అనబడే బ్రాహ్మణ శుంఠ విద్యాబోధనకు నీ వద్దకు వస్తాడు. నీవు అతనికి సమస్త విద్యలూ బోధించు, అనంతరం గంగాస్నానం చెయ్యి, అప్పుడు నీవు యదారూపంను పొందగలుగుతావు అనిచెప్పాడు.

“ఆశ్చర్యంగా వుందే” చంద్రశర్మ అన్నాడు.

“నేను నీరాక కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్నాను. నా కోరిక తీరింది. నువ్వు వచ్చావు నిన్ను చూసి నా శరీరం తేలిక అయింది. నీకు సమస్త విద్యలూ బోధించాను. నువ్వు నన్ను ధన్యుడను చేశావు. ఇంక నేను గంగాస్నానానికి వెడతాను. నువ్వు తిరిగి వెళ్ళు” అని చెప్పాడు. చంద్రశర్మ జవాబునకు నిరీక్షించ కుండా తన దారిన తను ఎటో వెళ్ళిపోయాడు రాక్షసుడు.

చంద్రశర్మ తృప్తిగా ఊపిరిపీల్చుకున్నాడు. సంతోషంతో అక్కడినుండి వెనుతిరిగిబయల్దేరాడు. కానీ తను వచ్చిన దారి మర్చిపోయాడు అయ్య. నడక ఆపలేదు. నడుస్తూనే వున్నాడు.

అతనికొక ఊరు కనిపించింది. ఆ ఊళ్ళో అడుగుపెట్టాడు. బాగా అలసి వున్నాడేమో ఒక వేశ్యాగృహం ముందు ఆగాడు అది యెవరో బ్రాహ్మణులది అయివుంటుందన్న నమ్మకంతో వీధిగడపప్రక్కనున్న అరుగు మీద కూర్చున్నాడు. అతని కళ్ళుదిక్కులుచూశాయి. బాగా అలసివుండడంతో నిద్దరకమ్ముకు వచ్చింది. ఆ అరుగుమీదనే నడుం వాల్చాడు. ఆ వెంటనే నిద్రపట్టేసింది. కొంతసేపటికి ఆ ఇంటిలోనుండి అపురూప సౌందర్యవతి వచ్చి బయట అరుగుమీద పడి నిద్రపోతున్న అతన్ని చూసింది. అతని అందచందాలకు మురిసిపోయింది. అతను తనకుతగిన పురుషుడు అని తలచి వెంటనే ఇంటిలోపలికి వెళ్ళి అదంతా తల్లికి చెప్పింది. అతనే తనకు కావాలని గట్టిగా చెప్పింది.

ఆమె తల్లి బయటికి వచ్చి చంద్రశర్మను చూపిం’ ఆమె అతన్ని చూసి మూతి ముక్కు విరిచింది. ఎంతటి ధనవంతుడోననుకొంది కానీ బ్రాహ్మణుడు ప్రక్కనే నిలబడిన కూతుర్ని కఠినంగా చూపించి,

“వీడా! ధనవంతుడు అనుకున్నాను పేదబాపడు”అనిఅతనిమొహమే చెప్తు న్నది నోరుమూసుకొని లోపలికినడు అంటూనే విసురుగాలోపలికి నడిచింది తల్లి.

కూతురు మారు పలకకుండా తల్లివెనకే లోపలకు వెళ్ళింది.

కూతురు ఎదురు చెప్పలేక లోపలకు వెళ్ళింది కానీ ఆమె మనస్సంతా చంద్రశర్మమీదనే వుంది.

మరో రెండు రోజులు గడిచాయి. అలసి నిద్రపోయిన చంద్రశర్మనిద్ర నుండి లేవలేదు. అది చూసి వేశ్యతల్లి యేం చేయాలని ఆలోచిస్తున్నది.

ఆ నగరాన్ని పాలిస్తున్నాడు ధ్వజకీర్తి అనేవాడు ,

వేశ్యమాత తక్షణం ఆ రాజుని కల్సుకొని చంద్రశర్మను గురించి విశదీక రించింది. అతను రెండు రోజులుగా తమ వీధి అరుగుమీదనే ఒళ్ళు తెలియని స్థితిలో నిద్రపోతున్నాడని చెప్పింది. ఆ పేదవాడిని నా కూతురు వరించిందని చెప్పింది.

రాజు ద్వజకీర్తి క్షణం ఆలోచించాడు. రాజవైద్యులను పిలిపించి ఆ వృత్తాతం చెప్పి చూసి రమ్మన్నాడు వెంటనే రాజవైద్యుడు వెళ్ళి చంద్రశర్మను పరీక్షించాడు. తిరిగి రాజు వద్దకు వచ్చాడు..

“మహారాజా అతడు ఆరుమాసాలుగా నిద్రలేక బాగా అలసి ఆ అరుగు మీద పడుకొని నిద్రపోతున్నాడు. యెంత కాలానికి నిద్రలేస్తాడో ఊహకు అందడం లేదు. అందువలన అన్నం పంపించి, అ వేడి అన్నాన్ని మెత్తగా పిసికి అతని డొక్కకు పూయించాలి. కొంతకాలానికి అతను వత్తిగిలి అవతలివేపుకి తిరిగి పడుకుంటాడు. అదేవిధంగా అన్నంను పిసికి అడొక్కకూ పూయించాలి. యీ విధంగా ఆరుమాసాలు చేయవలసి వుంటుంది. ఆ విధంగా చేస్తే అతను నిద్ర నుండి లేస్తాడు. అప్పుడు రాత్రి పడుకొని ఉదయం లేచినట్లుగానే భావిస్తాడు ఇది జరగాలి అని చెప్పాడు రాజవైద్యుడు.

“అతను పడుకొన్న ఇల్లు ఎవరిది?" రాజు అడిగాడు నాకు ఫిర్యాదు చేసిన ఆమెఎవరు ? అడిగాడు వాళ్ళుజవాబు చెప్పేలోపుగానే అదితనకుఅనవసర మైన విషయం అని ఆ రాజు తన దారిన తను సభవిడిచి వెళ్ళి వేశ్యమాత ఆమె కుమార్తె మంజరి ఇంటికి వెళ్లాడు.

ఆమర్నాడు ఉదయం చంద్రశర్మనిద్రలేచి తనదారినతానువెళ్ళ బోయాడు. అతను ఎప్పుడు నిద్రలేస్తాడో అని ఎదురుచూస్తున్న వేశ్య కూతురు మంజరి అతను బుజాన వున్న కండువాను పట్టుకొని “ఆగండి” అంది చంద్రశర్మ ఆగాడు.

మీరు ఇక్కడు పడుకొని ఆరుమాసాలు అయింది. ఈ ఆరుమాసాలూ మీరు నిద్ర ఎప్పుడు లేస్తారాని ఎదురుచూస్తూ యిక్కడే వున్నాను. మీరిప్పుడు లేచివెళుతున్నారు. అది అన్యాయం. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ మనస్సులోనే వివాహం చేసుకున్నాను. నేను మీ భార్యను. నన్ను అన్యాయం చేయద్దు. నన్ను భార్యగా స్వీకరించి నన్ను ధన్యురాలిని చేయండి లేకుంటే నేను బ్రతుకలేను. అంటూ చంద్రశర్మ పాదాల మీదపడి ప్రార్థించింది.

చంద్రశర్మ అర్థం అవనట్లు ఆమెను చూశాడు. క్షణం సేపు కళ్ళుమూసు కునిఆలోచించాడు.నువ్వువేశ్యవు. నేను బ్రాహ్మణుడనుమనఇద్దరికీ పొత్తుకుదరదు. నేనునిన్ను పెళ్ళాడను.పో” అనిఆమెనుతప్పించుకొని విసురుగా వెళ్ళిపోయాడు.

మంజరి వెంటపడి అతని దారికి అడ్డునిలచింది. అయ్యా! నన్ను మోసం చెయ్యవద్దు కనికరించండి మిమ్మల్ని తప్ప వేరొకర్ని కోరను. అని మరింత ప్రార్థిం చింది మంజరి. చంద్రశర్మ మంజరిల పెనుగులాట ప్రారంభమైది.

ఈ విషయం మహారాజు ధ్వజకీర్తి వరకూ వెళ్ళింది. ఆ ఇద్దర్నీ తనవద్దకు తీసుకుని రమ్మని చెప్పగా భటులు ఆమరుక్షణం ఆ ఇద్దర్నీ రాజు ఎదుటకి తీసుకెళ్ళి నిలబెట్టారు. రాజు పూర్వాపరాలు విచారణ జరిపాడు. తక్షణం బ్రాహ్మణుడు అయిన చంద్రశర్మను వదలమని వేశ్యకకూతురు మంజరికి సలహా యివ్వగా, ఆమె నిరాకరించింది. తన జీవితం అతనితో ముడిపడి వుండాలన్న పట్టుదలతో వుంది. ఆమె వెంటబడి అంతగా అడుగుతున్నప్పుడు నువ్వు ఆమెనే వివాహం చేసుకొని ఆమెతో కాపురం చేయమని చంద్రశర్మకు సలహా యిచ్చాడు “మహా రాజా నేను బ్రాహ్మణుడను ఆమె వేశ్య! మా యిద్దరికీ పొంతన కుదరటం చాలా కష్టం. ఆమెనాకు అవసరం లేదు నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అన్నాడు చంద్రశర్మ.

రాజు వారి మధ్యనున్న సమస్యను పరిష్కరించలేకపోయాడు. వారి ఊరిలోని కొందరు బ్రాహ్మణులను పిలిపించాడు వారలకు యీ సమస్యను చెప్పి పరిష్కరించమని కోరాడు.

బ్రాహ్మణులు ఆలోచించారు. యెన్నో గ్రంథాలను పరిశీలించారు. అనంతరం యీ విధంగా చెప్పారు. “మహారాజా! విప్రునకు బ్రాహ్మణ,

క్షత్రియ వైశ్య శూద్ర స్త్రీలలో యెవ్వరినైనా పెళ్ళాడే అర్హత వుంది. అది శాస్త్ర విరుద్ధం మాత్రం కాదు. అయితే మరోధర్మసూక్ష్మం కూడా యిందులో వుంది. అదేమిటంటే ముందు బ్రాహ్మణుడు బ్రాహ్మణకన్యనే వివాహమాడాలి. తదుపరి మేము చెప్పి యితర జాతి స్త్రీలను వివాహమాడవచ్చును.” అని చెప్పారు బ్రాహ్మణులు.

అప్పుడు రాజు క్షణం ఆలోచించాడు. తమ ఆస్థాన పురోహితుని పిలిపించి అతని కుమార్తెను చంద్రశర్మకు యిచ్చి వివాహం చేయించాడు. అటుతర్వాత తనకుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అటుమీద తమ ఆస్థానంలో వున్న వైశ్యుని కుమార్తెను ఇచ్చి పరిణయం చేయించాడు. యీ కన్యలను వివాహం చేసుకున్న తదుపరి వేశ్యకుమార్తె మంజరిని పెళ్ళాడేందుకు అభ్యంతరం లేదుకనుక చంద్రశర్మ వేశ్యకుమార్తె అయిన మంజరిని పెళ్ళి చేసుకున్నాడు.

ధ్వజకీర్తి రాజునకు మగసంతతి లేదు. అల్లుడే వారసుడు రాజ్యం పాలనచేసేందుకని తనరాజ్యంలోసగభాగం అతనికి కట్టబెట్టాడు.

దానికి అవసర మైన చతురంగబలాలనూయిచ్చాడు. చంద్రర్మనుతమఇంటిలోనేవుంచు కున్నాడు. స్థితిపరుడు మహారాజు అయిన చంద్రశర్మ తను పెళ్ళాడిన నలుగురు భార్యలకు నాలుగు ఇండ్లను నిర్మింపచేశాడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క భార్యను వుంచాడు.

బ్రాహ్మణ భార్యయింట తను నిత్య సంధ్యావందనం చేసుకునేందుకు యేర్పాటు చేసుకున్నాడు యే భార్యనీ తక్కువగా చూసేవాడుకాదు. నలుగురు భార్యల్నీ సమానమైన దృష్టితో చూసుకొనేవాడు. యెంతగా ధనవంతుడు అయినా మహారాజు అయినా గర్వంయేమాత్రం వుండేది కాదు. రాజ్యపాలనలో దిట్టనిపించుకున్నాడు.

కాలగమనంలో నలుగురు భార్యలూ గర్భవతులు అయినారు. నలుగురు కొడుకులు కలిగారు. వారిలో బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన కొడుకు పేరు పరరుచి అని క్షత్రియకాంతకు పుట్టినకొడుకు పేరు విక్రమార్కుడు అనీ, వైశ్యజాతి స్త్రీకి పుట్టినవాడి పేరు భట్టి అని, వేశ్యజాతి ఆమెకు పుట్టినవాడు భర్తృహరి అని పేర్లు పెట్టి సమాన దృష్టితో చూసుకుంటూండేవాడు. తగిన పండితులను నియమించి కుమారులు నలుగురును విద్యాధికుల్ని చేశాడు. అన్నిటికన్నా అవసరమైనదే, విలువైనదీ విద్యని వేరే తెలుపనవసరం లేదు కదా ! చంద్రశర్మకు విద్యవలనే వికాసం మేర్పడింది. .

క్రమేపీ నలుగురు కొడుకులు యవ్వనంలోనికి వచ్చారు. విద్యావంతులు అయినారు. విక్రమార్కుడు రాజ్యపరిపాలనార్హత కలిగినవాడు. అందుకు కారణం క్షత్రియ కన్యకుమారుడు కావడం అందులోను రాజునకు కుమారుడు కావడం వలన (కొడుకులు లేనప్పుడు బిడ్డయేదహోత్రుడు గదా అతని ఆ అర్హత వుంది) పాలించే శక్తి వుంది. అతన్ని సింహాసనం అలంకరింపచేశాడు మహారాజు.

విక్రమార్కుడికి మంత్రిగా వుండమన్నారు భట్టిని. అతను అన్ని విధాలా సోదరుడుకి అండదండలు సమకూర్చగలడనే నమ్మకం వుండుట వలన పరరుచి, భర్తృహరి ప్రాపంచిక విషయములలో నిమిత్తం లేదు కనుక విరాగలు 'గానే వుండిపోయారు. వీరిరువురు తమ ప్రతాపాలు భక్తిమార్గాన్ని సాగించడం మొద లైంది. భర్తృహరి కవిత్వం చెప్పేవాడు. అతను సువర్ణాక్షరాలలో లిఖించబడిన గ్రంథాలు తాళపత్రాలలో ఇప్పటికీ ప్రకాశిస్తున్నాయి.

అన్నదమ్ములలో ఒకరిమీద ఒకరికి ద్వేషం లేదు. అన్యోన్యంగా, కలుపు గోరుగావుంటూ వారివారి బాధ్యతలను తు.చ. తప్పకుండా సాగించు తుండేవారు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: