Sunday, 23 May 2021

Vagdanam King Vikramaditya Story in Telugu Language

Vagdanam King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "వాగ్దానం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students

Vagdanam King Vikramaditya Story in Telugu

విక్రమాధిత్యుడు దేశ పర్యటన సమయంలో హిమషన్నగర ప్రాంతం లోని భద్రావతినగరం చేరడం జరిగింది. అక్కడ వున్న శివాలయంలోనికి వెళ్ళి శివునికి స్తోత్రం చేసాడు. కొంత సేపు అక్కడ కూర్చోవడం అవసరం అని తలచి ఒకపక్కగా కూర్చున్నాడు.

ఆ సమయంలో ఆలయానికి నలుగురు మనుషులు వచ్చారు. ఆ నలుగురు పురుషులే! వారు ధరించిన దుస్తులు, ఆభరణాలు ఆకర్షణీయంగా కనిపించాయి. వాళ్ళ వెనుకే కొంత మంది తీర్ధయాత్రీకులు వచ్చారు. అందరూ కలసి పాడుతూ. కొందరు నృత్యం చేశారు. అందరూ కలసి ఆనందతరంగాలలో తన్మయులయ్యారు.

ముందు వచ్చిన నలుగురు యాత్రీకులకు కొంత ధనం పంచిపెట్టారు. వాళ్ళు వెళ్ళారు. ఆ తదుపరి ఆ నలుగురు స్వామిని సేవించి వెళ్ళిపోయారు.

ఆ మరుసటి రోజున ముందు వచ్చిన నలుగురులోను ఒక్కడు వచ్చాడు. అతనిని చూస్తే చాలా బీదవాడనిపించింది. అతని దుస్తులు బాగా మాసి చిరుగు పట్టి ఉన్నాయి.

అంత క్రితం ముందు వచ్చిన నలుగురిలోను ఒకరు ఈరోజు ఇంత బీదవారిగా వచ్చాడేమిటి. అనుకుంటూ కళ్ళార్పకుండా అతనినే చూస్తున్నాడు. ఎందుకని ఆ విధంగా వచ్చాడో బోధపడలేదు. ఏమైనా అతనిని అడిగి తెలుసు కోవాలనుకున్నాడు విక్రమాధిత్యుడు.

నెమ్మదిగా లేచి అతన్ని సమీపించి తనకు ఉన్న సందేహం అతనికి చెప్పాడు. అప్పుడు అతను “అయ్యా ! జూదముల వ్యవహారం ఈ విధంగానే ఉంటుంది. నేను జూదరిని రాబడిలేని వ్యయానికి లెక్క ఉండదు కదా.”

“నువ్వెందుకు జూదమునకు అలవాటు పడ్డావు. జూదము ఆడడం తప్పని తెలియదా మన పురాణ కధల్లో నీవంటి మహారాజు జూదానికి అలవాటు పడికదా సర్వం కోల్పోయింది.”

“ఇక మీద జూదం ఆడి బ్రతుకు పాడుచేసుకోకు” తిరిగి అన్నాడు. విక్రమాధిత్యుడు.

అయ్యా ! అలా అనకండి జూదం ఆడినవాడు సర్వం కోల్పోతాడు. నిజమే ఆటలో నేర్పు వహించినవాడు. కాలం కర్మం కలిసిపోవడంతో ఓడి పోతాడు. అదృష్టవంతులైతే బాగుపడతాడు కూడా మన పురాణాల్లో చూడలేదా” అన్నాడు. “ఆ పురాణాల్లోనే ధర్మరాజు వంటి మేధావులు మొదట ఓడిపోయినా మరలా జయించలేదా ? ఐశ్వర్యాలను అనుభవించలేదా ? జయపజయాలు ఎవరికి ఎప్పుడు వస్తాయో అప్పడు వరిస్తాయి. దైవానుగ్రహం ఉండాలి. అది లేకుంటే క్రింద పడివున్న త్రాడు విషసర్పమై కాటువేస్తుంది. దైవం అనుగ్రహిస్తే విషసర్పం ఎదురుపడ్డా అది దానికదే తప్పుకుపోతుంది కాని పగపట్టదు, కాటువేయదు” అని అన్నాడు ఆ వ్యక్తి.

విక్రమార్కుడు అతనిని వింతగా చూస్తున్నాడు. 

“మీరు అలా చూడకండి నా మాట నగ్నసత్యాలు” అని అన్నాడు. 

విక్రమార్కుడు పెదవికదిల్చిమాట్లాడకుండా,కళ్ళార్పకుండా చూస్తున్నాడు. 

“నేను చెప్పిన దాని వెనుక కధ ఒకటి వుంది.” తిరిగి అన్నాడు అతను. 

అదేమిటో చెప్పు అనుకోకుండా అడిగాడు విక్రమార్కుడు.

తీర్ధయాత్రలు సేవిస్తూ ఇద్దరు స్నేహితులు వెళ్ళుతున్నారు. అందులో ఒకడు “మనము ఎన్నో పుణ్యస్థలాలు తిరిగాము కాని ఇంద్రనీల పర్వతం మీదవున్న కాళికా దేవి ఆలయమునకు పోలేదు కదా” అన్నాడు మొదటి వాడు.

“అవును” ఒక శాసనం ఉందిట.

“ఎవరైతే తన అష్టాంగములలోని రక్తంమును పిండి ఆ కాళికా దేవికి అభిషేకం చేస్తారో వారు సమస్త కోరికలను తీరుస్తుంది ఆ మహాకాళి అని ఉందట ఆశాసనంలో” అన్నాడు మరొకడు.

విక్రమాధిత్యుడు అతను చెప్తున్నది చెవిన పట్టించుకోలేదు. “అయ్యా ! అదేదో చూడాలని ఉన్నది. నువ్వు నాతో వచ్చి చూపించగలవా” అని అన్నాడు.

జూదరి అంగీకరించాడు. అప్పటికప్పుడే బయలుదేరి విక్రమాధిత్యుని ఆలయమునకు తీసుకుని వెళ్ళాడు. ఆలయములోని శాసనమును చదివాడు. విక్రమాధిత్యుడు.

అతను జూదరిని గురించి పట్టించుకోలేదు. ఆ మరుక్షణం ఆలయం వెనుక వున్న కోనేటిలో స్నానం చేసాడు. ఆలయంలో ప్రవేశించి కాళీ విగ్రహం ఎదుట నిలబడ్డాడు. శాసనంలో వున్న విధంగా తన ఒంట్లో రక్తాన్ని తీసి కాళికి అభిషేకం చేశాడు.

ఇదంతా వింతగా చూస్తుండి పోయాడు జూదరి. 

తన రక్తంతో కాళి అభిషేకం చేశాడు విక్రమాధిత్యుడు.

ఆ మరుగడియలో కాళి ప్రత్యక్షమై తన కుడిచేత్తో అతని శరీరమంతా రాసింది. అతని అవయవాలు ఎప్పటిమాదిరి మారిపోయాయి.

విక్రమార్కుడు తల వంచి నమస్కరించాడు.

“రాజా నీభక్తికి నీకున్న ధైర్యానికి, నీ సాహసానికి మెచ్చితిని. నీకు కావలసిన వరం కోరుకో” అని అన్నది. కాళి

అమ్మా! నాదొక మనవి. నాకు ఇస్తానన్న వరం ఇతనికి ఇమ్ము అని తనతో వెళ్ళిన జూదరిని చూపించాడు.

ఆ మాట విక్రమార్కుడు అనడంతో జూదరి శరీరం పులకించింది. ఆ సమయంతో కాళీదేవి జూదరిని చూసింది.

జూదరి తనకు అవసరమైన వరమును కోరుకున్నాడు. కాళి అను గ్రహించి అంతర్ధానం అయ్యింది.

అప్పుడు జూదరి “రాజా! నీవంటి నిస్వార్ధపరుడు, సాహసపరుడు మరెవ్వరు ఉండరు” అంటూఆయనపాదాలకు నమస్కరించి మరెన్నో విధాలుగా ప్రశంసించాడు.

“మీరు నాకు చేసిన మేలు. జన్మలో మరువరానిది” తృప్తిగా అన్నాడు జూదరి ఈసందర్భంగా “నువ్వు నాకు ఒక మాట నివ్వాలి.” అన్నాడు విక్రమాధిత్యుడు.

“శెలవివ్వండి” అన్నాడు జూదరి

“ఇంకనువ్వు ఈ క్షణం నుండి జూదం ఆడకూడదు. ఇది నా ఆజ్ఞకాదు సుమా సలహా మాత్రమేనని స్వీకరించు” అన్నాడు.

“రాజా ! సందేహం లేదు ఇంకనేను జూదం ఆడను కష్టపడి పనిజేసి బ్రతుకుతాను” అని అన్నాడు జూదరి.

ఉజ్జయినిలో అనేకములైన వింతలు జరుగుతున్నాయి. ఎన్నో వింతలు ప్రారంభమైనాయి. వర్షాలు లేక పంటలు లేవు. కరువు, కాటకాలు వచ్చాయి. అప్పుడు విక్రమాధిత్యుడు మహాకాళి ప్రసాదించిన వయస్సు ముగింపునకు వస్తున్నదని తలచాడు. అతనికి కుమ్మరి పడుచుకు పుట్టినవానిచేతిలో మరణం వుందన్న సత్యాన్ని గుర్తుచేసుకున్నాడు. తక్షణం భేతాళుడు గుర్తుకు వచ్చాడు. అతన్ని ప్రశన్నం చేసుకున్నాడు. ఆ వెంటనే భేతాళుడు ప్రత్యక్షమైనాడు. “ఏమిటి . ఆజ్ఞ” అని అడిగాడు.

“భేతాళా నగర పరిస్థితిని చూస్తే నాకు మరణం ఆశన్నమైనదని తోస్తున్నది పదమూడు మాసాల వయస్సుగల కుమ్మరి బాలికకు వాడి చేతిలోనే నాకు మరణం ఉన్నదని దేవి నాకు చెప్పినది. ఇప్పుడు నిన్ను ప్రశన్నం చేసుకున్న కారణమేమంటే. వాడు ఎక్కడ జన్మించాడో మొదలగు వివరాలు చెప్పు అని అన్నాడు విక్రమాధిత్యుడు.

అలానే కొద్ది ఘడియలలో నీ సందేహానికి సమాధానం ఇస్తాను అని అన్నాడు. ఆ వెంటనే అదృశ్యమైనాడు.

భేతాళుడు అతని కోసం గాలిస్తూ వివిధ ప్రాంతాలు వెళ్ళాడు. ఎక్కడా దొరకలేదు. చివరికి ప్రతిష్ఠాన పురం చేరుకున్నాడు. ఆ ఊరిలో తిరుగుతుండగా ఒక వీధివాకిట మట్టి పిసికి బొమ్మలు తయారుచేస్తున్నాడు ఒక బాలుడు. ఆ బొమ్మలు, రధాలు, సైనికులు, గుర్రాలు, ఏనుగులు వాటిని, ఆబాలుని చూసాడు. అంతేకాకుండా ఆ బాలుడు మట్టితో చేసిన మనుషుల బొమ్మలు మంత్రాలతో సంభాషించుతున్నాడు.

భేతాళునికి అనుమానంవచ్చింది. ఎవ్వరిబాలుడూఅనిఅడిగాడు. ఇరుగు పొరుగువారు ఎవరూ చెప్పకపోయినా. అతని తాలూకా వారిని చూపించారు.

“అయ్యా ! వాడే నా మనవడు నా కూతురుకు పదమూడు మాసముల వయస్సులో నాగేంద్రుడు ఆమెతో సంభోగించాడు. అప్పుడు ఆ బాలుడు జన్మించాడు. వీడి పేరు శాలివాహనుడు” అని చెప్పాడు ఆయన.

ఆవార్త విని భేతాళుడు ఉజ్జయిని వెళ్ళి తానుతెలుసుకువచ్చిన వివర మును విక్రమాధిత్యునకు తెలియజేసాడు. అప్పుడు విక్రమాధిత్యుడు యుద్ధం చేయాలని తీర్మానించుకున్నాడు. చతురంగా బలాలతో యుద్ధానికి వెళ్ళ నిశ్చయించుకున్నాడు. సైన్య సమేతంగా బయలుదేరి ప్రతిష్టానపురం వెలుపల విడిది చేశాడు. తను యుద్ధానికి వచ్చినట్లు ఆ బాలునికి కబురు పెట్టాడు.

ఆ సమయంలో శాలివాహనుడి తండ్రి అయిన నాగేంద్రుడు ప్రత్యక్ష మయ్యాడు. “నువ్వు ఈ మంత్రమును పటించిన నీవు తలచిన కోరికలు తీరగలవు” అని మంత్రోపదేశం చేసాడు. ఆ వెంటనే అంతర్ధానం అయినాడు నాగేంద్రుడు.

అంతకు క్రితమే శాలివాహనుడు తమ ఊరిలోని కుమ్మరి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళవద్దవున్న మట్టితో సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ ఇంటి వద్దనే ఉంచాడు.

శాలివాహనుడు సామాన్యుడు కాదని, మానవుడు కాదని, అతని పుట్టుకే విచిత్రం. అతనిని కాదనిన ఏ ప్రమాదం ముంచుకు వస్తున్నదన్న భయంతో కుమ్మరులు నోరు మెదపకుండా ఉండిపోయారు.

విక్రమార్కుడు పంపిన వార్త విని తండ్రి ఉపదేశించిన మంత్రం పటించి నీళ్ళను తాను తయారు చేసిన బొమ్మలన్నిటి మీద చల్లాడు.

ఆతక్షణం మట్టి బొమ్మలన్నిటికి ప్రాణం వచ్చింది. ఏనుగులూ, గుర్రాలూ అన్నీసిద్ధమయ్యాయి. వాటినివెంట తీసుకొని వెళ్ళి విక్రమాధిత్యుని ఎదురించాడు.

ఇరుపక్షాల మధ్య పోరు ప్రారంభమైంది. విక్రమార్కుడి సైన్యంనాశనమైంది. అప్పుడు విక్రమార్కుడు ఒంటరివాడైనాడు. శాలివాహనుడి చేతికి చిక్కినాడు.

శాలివాహనుడు ఆవేశపూరితుడైనాడు. ఒక్కవేటిన విక్రమార్కుని తల నరికాడు. అతని కత్తి విసురికి విక్రమార్కుని తల ఎగిరి ఉజ్జయిని రాచబాటన బడింది. అక్కడ ప్రజలు ఎంతగానో విలపించారు. రాజు పరలోకం చేరేందుకు అంత్యక్రియలు జరిపించాడు.

విక్రమార్కుడు మరణానికి ముందే గర్భవతి అయిన అతని భార్య కాలక్రమేణా మగ శిశువును కన్నది. మంత్రులు, సామంతులు ఆ బాణం క్రమ పద్ధతిలో పెంచి పెద్దచేశాడు. మహా వీరునిగా రూపొందించారు. నగర ప్రజలు మంత్రి తదితర బాధ్యతలు కలిగినవారు. అతని తీర్చిదిద్ది ఉజ్జయిని రాజును చేసారు. తండ్రి విక్రమాధిత్యుని పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా ఆ బాలుడు పరిపాలన సాగించాడు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: