విక్రమార్కునకు భేతాళుని హితోపదేశం కథ : Read Vikram and Betal Last Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids
విక్రమార్కునకు భేతాళుని హితోపదేశం కథ : In this article, read Vikram and Betal Last Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్కునకు భేతాళుని హితోపదేశం కథ Vikram and Betal Last Story in Telugu Language
“విక్రమార్కా”అని యింకేదో అనబోయాడు భేతాళుడు.
నీకు ఒక రహస్యం చెప్పబోయి ఆ పేరేం?చెప్పు!” అన్నాడు విక్రమార్కుడు నేను చెప్పిన పది కథలకు చక్కని సమాధానాలు ఇచ్చావు. నీవు దేశక్షేమం కోసం బ్రతకవలసినవాడివి. నేనుచెప్పబోయే రహస్యంజాగ్రత్తగా విను! మహా రాజా! నీవు నా శవాన్ని పట్టుకువెళ్ళి అప్పగించాల్సిన సన్యాసి మహా కౄరుడు. కాళికాదేవి అనుగ్రహాన్ని పొందాలనుకున్నాడు. వాడు ఇప్పటికి తొంభైతొమ్మిది మంది రాకుమారులను కాళీ దేవికి బలిచ్చాడు. నూరోవాడు సద్గుణ సంపన్నుడు, ధైర్యశాలి! నిష్కళంక పరిపాలకుడు, మహావీరుడు, అబద్దము అడనివాడు అయి వుండాలి. ఆ లక్షణాలన్నీ నీలో వున్నాయి కనుక నిన్ను కాళికి వందోవాడిగా బలివ్వాలని దలచాడు. అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై సన్యాసి గొంతెమ్మ కోరికలు తీరుస్తుంది. కనుక నీవే ఆ ద్రోహిని కాళికాదేవికి బలిచ్చి ఆమె అనుగ్రహాన్ని పొందు. నీవు సాహసుడివి ప్రజలను పాలించే దయామయుడివి, కావున నీవంటి మేధావి బ్రతకవలెను కాని బలికాకుడదు. నేను కూడా నీకు సాయపడతాను.” అని హితోప దేశం చేశాడు బేతాళుడు.
అతని హితబోధకు విక్రమార్కుడు మిక్కిలి ఆనందించాడు.
ఆ తదుపరి భేతాళునితో సన్యాసి వద్దకు వెళ్ళాడు. అప్పటికే సన్యాసి దేవీ విగ్రహం ముందు బలికి ముగ్గులు పెట్టి సిద్ధంగా వున్నాడు. అతను విక్రమార్కుడు భుజానున్న భేతాళ శవాన్ని దించగానే ఆనందభరితుడు అయినాడు.
“మహారాజా! నీవు సాహసివి! నీ చర్యలు ఎంతో కొనియాడతగినవి నాకు ఎంతో మేలు చేసావు. దేశానికి ఎంతో క్షేమాన్ని కలిగించావు. వెంటనే నీవు స్నానం చేసి వచ్చి దేవిని పూజించుము” అని చెప్పాడు.
విక్రమార్కుడు చుట్టూ పరికించి చూశాడు. దేవి విగ్రహం ప్రక్కన మెరుస్తున్న ఖడ్గం కనిపించింది. సన్యాసి చెప్పినట్లు వెళ్ళి స్నానం చేసి వచ్చాడు.
“నేను అన్నీ సిద్ధం చేశాను. ఇక నువ్వు నమస్కారం చెయ్యి. అది మామూలు నమస్కారం కాదు సాష్టాంగ నమస్కారం” అని చెప్పాడు.
“మహాత్మా! నేను మహారాజును! ఒకరివలన నమస్కారం పొందటమే గాని నమస్కారం చేసి ఎరుగను. అది ఎలాగుంటుందో కూడా తెలియదు! అందువలన ముందుగా ఆ నమస్కారం యెట్లా చేయవలెనో తెలుసుకోవాలి కదా! తమరు ఆ నమస్కారం చేసి నాకు చూపించండి” అని వినయంగా మాట్లాడాడు.
సన్యాసికి ఏ విధమైన అనుమానం కలుగలేదు. ఆ వెంటనే తను దేవి ముందు సాష్టాంగపడి “ఈ విధముగా చేతులు” అవి యింకేదో అనబోతుండగా విక్రమార్కుడు అక్కడున్న ఖడ్గం అందుకొని వక్క వేటున సన్యాసి తలను నరికాడు.
ఆ మరుక్షణం అక్కడ వేలాడుతున్న గంటలు మ్రోగినాయి. ఆ మరుక్షణం భేతాళుడు కాళిమాతా అతని ఎదుట ప్రత్యక్షమైనారు.
“విక్రమార్కా! నీ సాహసం అమోహం! నీకు గతంలోనే వరాలు ఇచ్చాను. ఇప్పుడు భేతాళుడు నీ వశమైనాడు. భట్టి, భేతాళుల సహాయ సహకారాలతో నీవు రెండువేల సంవత్సరాలు రాజ్యపాలన చెయ్యి అని కాళీమాత ఆశీర్వదించి అంతర్ధానం అయింది. కాళీమాతా సందేశానుసారం భట్టి భేతాళుల సహాయ సహకారాలతో రెండువేల సంవత్సరాలు రాజ్య పాలన సాగించాడు. అనేకములైన సాహస కార్యాలు చేసి తమ ప్రజల్ని ఎంతగానో మెప్పించాడు.
ఆ తదుపరి, అతని పాలనను గమనించి ఇంద్రుడు విక్రమార్కుని స్వర్గానికి ఆహ్వానించడం జరిగింది.
ఆ సమయంలో ముప్పది రెండు సాలభంజికలు కల సింహాసనాన్ని బహూకరించాడు. రెండువేల సంవత్సరాలు పాలన సాగించాడు. ఆ తదుపరి శాతవాహనుడు అనబడే రాజు కారణంగా స్వర్గస్తుడైనాడు.
విక్రమారుడు మరణించిన తదుపరి ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అలంకరించే అర్హులు లేనందున అది భూస్థాపితం అయ్యింది.
ఆ తదుపరి విక్రమార్క సింహాసనం ధారా నగరం పాలించు భోజ మహారాజుకు దక్కింది.
COMMENTS