Alibaba and Forty Thieves Third Story in Telugu : In this article "కుంచం కోసం ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Third Story in Telugu Language : In this article we are providing "కుంచం కోసం ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కుంచం కోసం ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Third Story in Telugu
ఆలీబాబా చెప్పిన విధంగా అప్పటికప్పుడే బయల్దేరి కాశిం ఇంటికి వెళ్ళింది తల్లి - ఆ సమయంలో కోడలు మాత్రం వుంది. ఇంట్లో కొడుకు లేడు. ఆమె వెళ్ళి కూర్చుని కోడలుతో కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడింది. అనంతరం కోడలుని ఉద్దేశించి “మీ ఇంటిలో, కుంచం ఉంది కదా! అది ఒకసారి కావాలి ఇస్తావా?” అని అడిగింది. .
కాశిం భార్యకు ఆశ్చర్యం కలిగింది. కుంచంతో ఆ ముసలమ్మకు పనేమొచ్చిందన్న సందేహం కలిగింది. .
"కుంచంతో అవసరం వచ్చిందా! ఎందుకు ? ఎవరె తెమ్మన్నారు ? అని అడిగింది కాశింభార్య.
“ఎవరికో అయితే నేనెందుకు వస్తాను ? ఆలీబాబాకు” అంది తల్లి.
ఆ మాటకు మరీ ఆశ్చర్యం కలిగింది. పూటగడవడమే కష్టంగా వుంది. పేదరికంను అనుభవించుతున్న మరిదికి కుంచం ఎందుకు అవసరం అయిందనుకుంది. చిన్నగా నవ్వుతూ “అత్తమ్మ నువ్వు వచ్చావు ఆనందమే. కానీ కుంచంతో వాళ్ళకు పనేమొచ్చింది” అని అడిగింది.
“అదేమో నాకు తెలియదమ్మా! నన్ను వెళ్ళి పట్టుకురమ్మన్నారు ? ఎందుకు యేమిటి అని అడకుండా వచ్చేశాను” అంది ముసలమ్మ.
“మీ అబ్బాయి బయటికి వెళ్ళాడు అయినా కుంచం కోసం మీ అబ్బాయిని అడిగేదేముందియిస్తాను. అది సరే పెద్దదానవు నిన్ను పంపించారేమిటి ? కుంచం అంత అవసరమైనవాళ్ళు వచ్చి అడగచ్చుకదా అన్నది.
" మీ మధ్య ఆ సయోధ్య లేదుకదా!” అన్నది ముసలమ్మ.
“లేకపోవచ్చును, అవసరం వాళ్ళది ఆయనో, భార్యోవచ్చి అడిగితే బాగుండేది. అయినవాళ్ళు కాబట్టి కుంచంతో వచ్చిన అవసరం తెల్చుకొని యిచ్చేదాన్ని, అయినా వారికి ఎందుకుకావాలో నాకు అనవసరం అనుకో" పెద్దదానివి కాళ్ళీడ్చుకుంటూ వచ్చావు కాబట్టి యిస్తాను. ఆయినవాళ్ళం. అవసరానికి యివ్వక తప్పదు కదా. కుంచం వారిపని అయినాక వెంటనే పట్టుకొచ్చి యివ్వు. యివ్వాళ వడ్లుకొలవాలి పనివాళ్ళకు” అంది కాశిం భార్య.
“అయ్యో పని అయినాక వుంచుకొంటారా ? నేను పట్టుకొచ్చి యిస్తాను అన్నది ముసలమ్మ. ఎక్కడ పెట్టారో ఏమో మీరు కూర్చోండి. వెతికి తీసుకొచ్చి యిస్తాను అన్నది.
ఆలీబాబా తల్లి అవతలగా వున్న బల్లమీద కూర్చుంది.
కాశిం భార్య లోపలకు వెళ్ళింది. ఆమెకు అదే ఆలోచన, యేదో పెద్ద బేరం తగిలి తేనే కుంచంతో పని. అదేదో రహస్యంగా వుంచారు. అది మాకుకూడా తెలియకూడదనుకున్నారు. వాళ్ళు అంత తెలివిని ఉపయోగించితే అంతకు పదిరెట్ల తెలివిని నేనూ ఉపయోగించుతాను, వాళ్ళు యేం కొలిచే టందుకు కుంచం ఆడిగారో వాళ్ళు చెప్పకుండా కుంచమే చెప్తుంది. అనుకుంది. “కాశిం భార్యంటే యేమన్నుకునరోయేమో ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగల శక్తి వంతురాలని తెలియదు పాపం” అని చిన్నగా నవ్వింది. వెంటనే కుంచంను తీసింది. కుంచం లోపలి భాగంలో మట్టుకి చిన్న మైనపు వుండను అతికించింది.
తను ఆపని చేసిందని యెవ్వరికీ తెలియదు. కనీసం ఊహించలేరు. అనుమానం అసలేరాదు అనుకుంటూ మరోసారి తను అంటించిన మైనంను చూసింది. అది యితరులు పసికట్టలేనేంతగా అణిచింది. ఆ కుంచంను పట్టు కొచ్చింది. “అత్తమ్మా ఇదిగో కుంచం వాళ్ళు వచ్చి అడగటం నామోషి అయి నిన్ను పంపారు. ఇదే మరొకరు వస్తే ఇచ్చేదాన్ని కాదు. పెద్దదానివి కావలసిన దానివి కాబట్టి యిస్తున్నాను.” అంటూ ఆలీబాబా తల్లికి అందించింది.
పని అవగానే పట్టుకొచ్చి యివ్వు. యిన్నిసార్లు చెప్తున్నాను అనుకోకు” అంది మళ్ళీ కాశిం భార్య.
“అయ్యో నేను పట్టుకొచ్చి యిస్తాను” అంటూ “లేచి నేను వెళ్లోస్తాను” అంటూ బయటికి నడిచింది ఆలీబాబా తల్లి.
ఆమె వెళ్ళాక పేదరికంలో తినీ తినక గడుపుతున్న మరిదికి కుంచతో పనేమొచ్చిందన్న ఆలోచనతో సతమతమవుతోంది. యెంతగా ఆలోచించినా అంతుచిక్కని సమస్యగా వుంది. అంతలోనే సమాధానపర్చుకుంది. 'తనకు తాను నాతో చెప్పకపోయినా పట్టుకువెళ్లిన కుంచమే చెప్తుంది' అనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంది కాశిం భార్య.
COMMENTS