Alibaba and Forty Thieves Twelfth Story in Telugu : Read దోపిడి దొంగల ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story for Kids.
Alibaba and Forty Thieves Twelfth Story in Telugu Language : In this article we are providing "దోపిడి దొంగల ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
దోపిడి దొంగల ఆందోళన ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Twelfth Story in Telugu
దోపిడి దొంగలు ఊళ్ళ మీదపడి దోపిడీలు సాగించి చాలా సంపా దించారు. కొంతకాలం వరకు వాళ్ళు గుహకు రాలేదు. వాళ్ళు గుహకు రావడం లేదు. ఒకనాడు నలభై మంది దొంగలూ గుహకు వచ్చారు. వాళ్ళు సంపా దించినవెండి, బంగార నాణాలు గుహలో ఉంచారు. కాశిం మొండెంను వేలాడి తీసిన తల ఆ రెండూలేవు. అది చూసి వాళ్ళు గుండెలు గుభేలుమన్నాయి. గుహంతా వెతికారు. ఎక్కడా లేవు.
అది చూసి దొంగల నాయకుడు అదిరిపడ్డాడు. ఒళ్ళు మండుకొచ్చింది. ఒళ్ళు తెలియని ఆవేశపరుడైనాడు. వాళ్ళ సాంకేతిక పదాలు ఎవరు తెలుసు కున్నారు? తమ రహస్యంను ఎవరు పసికట్టారు? బోధపడలేదు. నాయకునికి మతిపోయినంత పనయ్యింది. దొంగల్నందరినీ వరుసగా నిలబెట్టి మనరహస్యం ఎవ్వరు ఎవరికి అందచేసారు ? అని అరిచాడు.
నాయకుడు అభిప్రాయమును బట్టి దొంగల్లో ఎవరైనా మోసం చేస్తు న్నారేమోనని సందేహం కలిగింది. దొంగలు మొహాలు చూసుకున్నారు. అందరూ తెల్లమొహాలు వేసారు. తామెవ్వరికి తెలియదని అన్నారు.
నాయకుడు ఆవేశపరుడై ఊగిపోతున్నాడు. “ఏందిరా ఇన్నేళ్ళుగా నరమానవుడి కంటపడని మన గుహలో ఎవ్వరా అడుగు పెట్టింది. మీలోనే మనగుట్టు ఎవ్వరో భయట పెట్టి ఉంటారు. ఎవడా గుట్టు బయటపెట్టింది ? నోరు మెదపరేం? ఎవరు బయటపెట్టారో చెప్పండి.” గర్జించి గుహ ప్రతిధ్వనిం చేట్లు అడిగాడు నాయకుడు.
ఎవరూ మాట్లాడలేదు. మొహాలు చూసుకుంటున్నారు.
నోరు మెదిపి చెప్పకపోయారా మీ అందరి తలలు నరికేస్తాను. చెప్పండి” అని అరిచాడు.
అతని రుద్రరూపానికి దొంగలు హడలిపోయారు. 'సత్యప్రమాణకంగా మాకేం తెలియదు దొర'అన్నాడు ఒకడు. సందేహం లేదు దొరా ఎవరో పరాయి వాడే మన గుట్టు తెలుసుకుని ఉంటాడు! అన్నాడు.
“మనం అంటున్నప్పుడు మన సాంకేతిక పదాలు విని ఉంటారు. వాటి ఆధారంతోనే గుహలో అడుగుపెట్టి మనం దోచుకువచ్చింది వాళ్ళు దోచుకు పోతున్నారు” అన్నాడు మొదటి వాడు.
మళ్ళీ నాయకుడు “నిజంగా మీకు తెలియదా!” అని అరిచాడు.
లేదు దొరా మీ పాదాల సాక్షి. అన్నారు. అందరూ ఏక కంఠంతో
COMMENTS