Alibaba and Forty Thieves Fifteenth Story in Telugu Language : In this article we are providing "ఎత్తుకు పై ఎత్తు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
ఎత్తుకు పై ఎత్తు ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fifteenth Story in Telugu
యాత్రికులుగా రూపు మార్చుకొని వెళుతుండగా X యీ గుర్తు అందరిండ్ల తలుపుల మీదా వున్నది. వాళ్ళకు వింతగా తోచింది. ఆ గుర్తులే ఎవరు పెట్టారు ? అని ప్రశ్నించుకున్నారు. జవాబు చిక్కలేదు. అది యే యిల్లో తెల్సుకోలేక దొంగలు వెనుతిరిగి వెళ్ళిపోయారు. యీ విషయంను నాయకునికీ చెప్పారు. నాయకుడుతుళ్ళిపడ్డాడు. మనంవాళ్ళకోసంతిరుగుతున్నామని గ్రహించి తెల్లారేసరికి ఆ గుర్తులు పెట్టారు.
రెండోరోజు మళ్ళీ వెళ్ళి ఆలీబాబాయింటిముందు ముగ్గుతో గుర్తుపెట్టారు. తెలవారేసరికి అందరియిళ్ళముందూ అదేగురు వుంది. నాయకుడు అదిరిపడాడు.
ఇలాచేసింది మార్జియానా ఆమెకు దొంగలముఠాను గురించే ఆలోచించ సాగించుతోంది. ఆ నాడు తెల్లారుతుండగా వాకిట ముగ్గు వేయటానికి వెళ్లింది మార్జియానా. తలుపుమీదXగుర్తువుంది. ఆమెకు ఆశ్చర్యంకలిగింది. అన్ని తలుపుల - ' మీదనూ ఆదే గుర్తు పెట్టింది. దాంతో అది తెల్సుకోలేకపోయారు దొంగలు.
ఆ గుర్తు ఎవరు పెట్టిందీ ? నాయకుడికీ తోచలేదు. ఇల్లు తెలియకుండా వుండేటందుకు ఎవరో గుర్తు పెట్టారని తలచాడు.
ఆ సాయంత్రం దొంగల నాయకుడు బాటసారి వేషంలో వీధులు పట్టి తిరుగుతూ ఆలీబాబా వున్న వీధిలో అడుగుపెట్టాడు. అందరిళ్ళమీద అదే గుర్తుండడంతో ఆగుర్తు పెట్టిన వాడెవరని నిగ్గదీశాడు. వాడు ఒకేయింటి తలుపుల మీద ఆ గుర్తు పెట్టినట్లు ప్రమాణం చేసి చెప్పాడు. తనను నమ్మించి వెళ్ళినవాడే ఆగుర్తుపెట్టాడని తలచి అతన్నిఅడగ్గా అతను'లేద'ని ప్రమాణం చేశాడు. నాయకుడు నమ్మలేదు. వీడే కావాలని మోసగించాడని వాణ్ణి చంపమని ఆజ్ఞ యిచ్చాడు. .
దొంగలు అతన్ని కత్తులతో పొడిచిచంపేశారు. ఆ రాత్రి గుహకు వెళ్ళి పోయారు. అతను దర్జీవాడిని కల్సుకున్నాడు మట్టికుండ నిండా నీరు సున్నం కలిపోశాడు అది సున్నపునీరు. ఆ కుండకు అడుగున చిలిపెట్టాడు. దాన్ని తీసుకుని ఆలీబాబా ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఆ సున్నపునీరు ఆలీబాబా యింటి వరకూ కారేటట్లు చేసి వెళ్ళిపోతాడు అతను. -
'ఆ తెల్లవారుఝామున మార్జియానా అదిచూసింది. అదేదో కుట్ర జరుగు తోందని అనుమానించింది. దొంగల ఎత్తుగడే అన్న నిర్ణయానికి వచ్చింది. ఆ మరుక్షణం ఆ వీధిలోని ఇళ్ళన్నీ సున్నపునీరు వుండేటట్లు పోసింది మార్జియానా.
ఆ దొంగల నాయకుడు దగ్గరకు వెళ్ళి తను చేసిన పనిని వివరించాడు. ఆరోజు యధావిధిగా దొంగలువచ్చిచూస్తే ఆ సున్నపు నీరు గుర్తు అన్ని ఇండ్లకూ వుంది. అది చూసి వాడూ మోసం చేశారని తలచి మొదటివాడిని చంపించినట్లే వీడినీ చంపించేశారు. దొంగలవల్ల పనిఅవదనితనే బయల్దేరాడు. అసలు దొంగను పసికట్టాలని.
అంతక్రితం చెప్పిన దారిలో వెళ్ళాడు వివరంగురించి యోచిస్తూ ఆలీబాబా వుంటున్న వీధిలో అడుగుపెట్టాడు. యాత్రికుని వేషంలో ఆ వీధిలోని జనాన్ని కల్సుకొని మాటల సందర్భంలో ఆలీబాబా గురించి అడిగాడు.
నాయకుడు “ఆ వీధిలో ధనవంతులున్నారా ?” అని అడిగాడు జనాన్ని.
వున్నారు ఆలీబాబా గత చరిత్ర చెప్తూ అతని పేదరికాన్ని తెలుపుతూ అనుకోకుండా భాగ్యవంతుడు అయ్యాడని అన్నారు. 'వివరం చెప్పండి' అని ముసలివాడిని అడిగాడు నాయకుడు.
'చెప్పేటందుకు యేముంది ? ఆలీబాబాకు హఠాత్తుగా సిరి' వరించింది. అతని అన్న కాశిం యేదో మాయదారి రోగం వచ్చి మరణించాడు. అతని ఆస్తి కూడా కలిసింది. యీ ఊరిలోకల్లా ధనవంతుడు అయినాడు ఆలీబాబా. అన్న మొదటి నుండీ భాగ్యవంతుడే! అతని ఆస్తికూడా కలిసింది” అని వివరించాడు.
ఇది విని మరెన్నో వివరాలు అడిగి తెల్సుకున్నాడు. అనంతరం తమ ఆస్థానమయిన గుహలోనికి వెళ్ళాడు. తమ వద్ద దోపిడి చేసింది ఆలీబాబాయే నని నిర్ణయించుకున్నాడు. తను ఒక్కడే యాత్రికుడులాగా ఆలీబాబా యింటికి వెళ్ళాడు. యాత్రికులకు సత్కారం చేయడంలో ఆలీబాబా ఖ్యాతిని గడించాడు. అతిధులు యెవరువచ్చినా వారిని మర్యాద చేసి ఆతిథ్యం యివ్వడం ఆలీబాబాకు అలవాటు.