అసలు పథకం ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Seventeenth Story in Telugu

Admin
0

Alibaba and Forty Thieves Seventeenth Story in Telugu Language : In this article we are providing "అసలు పథకం ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.

అసలు పథకం ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Seventeenth Story in Telugu

అసలు పథకం ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Seventeenth Story in Telugu

తను సమయం కనిపెట్టి నూనె డబ్బా దగ్గరకు వచ్చి సైగ చేస్తానని తన సైగతో అందరూ బయటపడి ఆలీబాబాను హతమార్చాలని చెప్పాడు నాయకుడు దొంగలుకి.

వాళ్ళు 'సరే' నన్నారు.

అప్పటివరకూ ఎవ్వరికీ యే విధమైన అనుమానం కలగకుండా డబ్బాల్లోనే నక్కి వుండమనీ చెప్పాడు నాయకుడు.

వేసుకున్న పథకం ప్రకారం దొంగల నాయకుడు చెప్పినట్లే డబ్బాల్లో కదలకుండా కూర్చున్నారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు తమ దొంగలు.

ఆలీబాబా దొంగల నాయకునికి భారీగా విందు చేశాడు. నాయకుడు బాగా తిన్నాడు. వళ్ళు మరిచేట్లు త్రాగాడు. కుషీగా కాలం గడుపుతున్నాడు.

మార్జియానా నాయకుడుని అనుమానించింది. అతను తెచ్చి దింపించిన నూనె డబ్బాలనూ అనుమానించింది. ఆలీబాబా కుటుంబ సభ్యులను కాపాడాలని మొదటినుండీ ఆలోచిస్తూనే వుంది. దొంగలుని కని పెట్టి తిరుగుతూనే వుంది. 

గాడిదలకు మేత వేసే పనిని కల్పించుకుంది. ఆమె గాడిదలకు మేత వేసింది. తెలివిగా డబ్బాలను పరిశీలనగా చూస్తున్నది.

దొంగల నాయకుని పథకం పసికట్టలేకపోయాడు ఆలీబాబా. యీ సంగతి ముందే గ్రహించింది. నూనె డబ్బాలను పరీక్షగా చూస్తున్నది. ఒక డబ్బా దానికదే కొద్దిగా కదిలింది. దాంతో మార్జియానా అర్థం చేసుకుంది. తన అనుమానం నిజమనుకుంది మార్జియానా.

అన్ని డబ్బాల్లోనూ దొంగలు రహస్యంగా దాక్కున్నారని తలచింది. వాళ్ళు తమ యజమానికి అపకారం తలపెట్టి వచ్చారని తెలుసుకొంది.

తప్పతాగి వళ్ళు తెలియకుండా అటూ ఇటూ తూలుతున్న నాయకుని, అతనికి తప్పతాగిస్తున్న ఆలీబాబాను చూసింది. అమాయకత్వంతో దొంగల నాయకుడిని నిజమైన వ్యాపారిగా ఎంచి గౌరవించుతున్న ఆలీబాబాను చూసింది. రహస్యంగా తను వంటశాలలో ప్రవేశించింది. ఇంటిలో పెద్ద పీపా నిండా ఉన్న నూనెను గంగాళంలో పోసింది. దాన్ని పొయ్యికి ఎక్కించి సలసలా కాచింది. ఆ విధంగా కాచిన నూనెను రహస్యంగా పట్టుకెళ్ళింది. గిన్నెలతో అక్కడున్న డబ్బాలన్నింటిలోనూ పోసింది. డబ్బాల్లో వున్న దొంగలు మార్జియానా చేసిన పనికి ' కిక్కురుమనకుండా 'డబ్బాల్లోనే మరణించారు.

నిశిరాత్రి అయింది. అందరూ నిద్రపోతున్నారు. అప్పుడు దొంగల నాయకుడు లేచి డబ్బాల దగ్గరకు వచ్చాడు. వాటిని తట్టాడు.

“అందరూ ఒక్కసారిగా బయటపడండి” నిద్రిసున్న ఆలీబాబా కుటుంబంను కత్తులతో పొడిచి చంపేయండి అన్నాడు. యే ఒక్కడూ బయటకు రాలేదు. నాయకుడికి అనుమానం వచ్చి మూతలు తీసి చూశాడు. అందులో దొంగ చచ్చిపడివున్నాడు. ఆశ్చర్యం కలిగింది అందరూ డబ్బాల్లోనే చచ్చి పడివుండటం చూశాడు. మొత్తం డబ్బాలలోని దొంగలు అందరూ చనిపోయి వుండడంతో నాయకుడికి ఆశ్చర్యం కలిగింది. కంగారు కలిగింది తమ గుట్టు తెల్సిపోయింద యిక తను వంటరివాడు అని గ్రహించి దొడ్డిత్రోవన బయటికి పరుగెత్తి తన గుర్రం మీద యెటో వెళ్ళిపోయాడు నాయకుడు.

ఈ విషయం బయటికి పొక్కనివ్వలేదు మార్జియానా.

తెల్లారగానే ఆలీబాబా మార్జియానాను పిలిచాడు 'నూనెవర్తకుడు నిద్రలేచారా ? ఆయనకు యేం కావాల్నో చూడు' అని ఆజ్ఞాపించాడు.

మార్జియానా నవ్వింది. ఇంకెక్కడి నూనెవర్తకుడు ఆలీబాబా! చెప్పకుండా రాత్రికి రాత్రే పెరటిదార్ని వుడాయించాడు అంది 'అదేమిటి' అని అడిగాడు ఆలీబాబా.

పరిస్థితి బోధపడలేదు ఆలీబాబాకు.

మార్జియానా జరిగిందంతా వివరించింది. దొంగలు ప్రవేశించి తలుపులు మీద X గుర్తు వేయడం నుండి నూనె డబ్బాల్లో వాళ్ళు చనిపోయే వరకూ వివరించింది.

ఆలీబాబాను వెంట తీసుకువెళ్ళి డబ్బాల్లో పడివున్న దొంగల్ని చూపించింది.

“మార్జియానా! మా కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడిన దేవతవు నీవు నీ ఋణం తీర్చుకోలేము.” అన్నాడు “ఆలీబాబా యిందులో ఋణం యేమీ లేదు. అది నాధర్మం, చిన్నప్పటినుండి మీ ఉప్పు పులుసు తినినేను యింతటి దాన్నయినాను. యిప్పుడు నాకు యుక్త వయస్సు వచ్చింది” మీరు ఎంతో అభిమానంగా చూస్తున్నారు. మీ కుటుంబంలోని వార్ని కనిపెట్టి వుండటం నా ధర్మం. 'యెవరు ఎన్ని ఎత్తులు వేసినా మోసాలు చేయచూసినా, అవి యీ మార్జియానా దగ్గర చెల్లవు' అని చెప్పింది మార్జియానా వినయ పూర్వకంగా.

ఆ తదుపరి అల్లాను స్మరించుకున్నాను తమర్ని కాపాడమని - “అయితే, యా శవాలుని యేం చేద్దాం” సందేహాస్పదంగా అడిగాడు ఆలీబాబా. 

మన దొడ్లోనే గొయ్యి తీసి అందులో పడేసి పూడ్చివేద్దాం” అని సలహా యిచ్చింది మార్జియానా. ఆ తక్షణం మార్జియానా సలహాను పాటించి శవాల్ని పూడ్చి పెట్టారు.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !