Alibaba and Forty Thieves Sixteenth Story in Telugu : Read here "దొంగల నాయకుడు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Sixteenth Story in Telugu Language : In this article we are providing "దొంగల నాయకుడు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
దొంగల నాయకుడు ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Sixteenth Story in Telugu
ఆలీబాబా భగవంతుని భక్తులు, బాటసారులు వస్తే అధికంగా గౌరవం చూపించుతాడు. అందువలన బాటసారిగా వెళ్ళిన దొంగలనాయకుడిని సాదరంగా ఆహ్వానించాడు. సుష్టిగా భోజనం పెట్టించాడు. విశ్రాంతి తీసుకోమని మంచం వేయించి, పక్క వేయించాడు. నాయకుడు పిచ్చాపాటి కబుర్లు చెప్తుంటే ఆలీబాబా ఆసక్తిగా వింటూ ఆయన ఎదురుగా ఒక పీట మీద కూర్చున్నాడు.
మార్జియానా చాటునుండి ఆ యిద్దరి సంభాషణనీ వింటూనే వుంది. వాళ్ళ ఇంటికి ఎవరువచ్చినా వార్నిఅనుమానించి కనిపెట్టి పంపబడటం ఆమె నైజం అయింది.
దొంగల నాయకుడు కబుర్లు చెప్తున్నా అతని కళ్ళు ఆ గదిని పరిశీలిస్తూనే వున్నాయి. అనుకోకుండా నాయకుడి దృష్టి గోడకు వ్రేలాడుతున్న పటం మీద పడింది.
“ఆ చిత్రపటం ఎవరిది ?" అడిగాడు ఆలీబాబాను.
“మా అన్నగారిది” అన్నాడు ఆలీబాబా. కాశిందే ఆ తాముచంపిన పటం అన్న అనుమానం వచ్చి అడిగాడు నాయకుడు.
"ఆయన పేరు యేమిటీ ?" మళ్ళీ అడిగాడు నాయకుడు. “కాశిం” అన్నాడు ఆలీబాబా.
తన అనుమానంనిజమైంది. ఆ వెంటనే తను మాటల దోరణిలో బయట పడకుండా “అచ్చా ఆయన వ్యాపారస్తుడు అనుకుంటాను ఆలీబాబా అన్నాడు! అవును. వ్యాపారాలు చేస్తూ బాగా సంపాదించారు” అని ఆలీబాబా చెప్పాడు.
“ఇప్పుడు ఆయన యే ఊళ్ళో వున్నాడు.” ప్రశ్నించాడు నాయకుడు.
ఆలీబాబా ఆయన లేరు. ఇటీవలననే చనిపోయారు.” అని చెప్పాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్.
“జనన మరణాలు మన చేతుల్లో లేవు. మీరు బాధపడకండి. అవునూ ఇంతకీ ఆయన యేం జబ్బు వచ్చిపోయాడు.” అడిగాడు నాయకుడు.
“యేం చెప్పేది అల్లాకు దయలేదు అన్నాడు బాధతో ఆలీబాబా యేదో అంతు చిక్కని రోగం వచ్చింది చనిపోయారు”
“ఎన్ని మందులో వాడాము. ఉపయోగం లేకపోయింది.” తిరిగి అన్నాడు ఆలీబాబా.
“విచారించకండి ! అల్లా మిమ్మల్ని కాపాడుతాడు” అని ఆశీర్వదించాడు దొంగల నాయకుడు.
నాయకుడు కొద్దిసేపు ఆలోచించాడు. గుహలో ప్రవేశించి సొమ్ము అపహరించినవాడు ఆలీబాబాయే! ఆ రహస్యం అంటే తమ సాంకేతిక పదాలుని అన్నకు చెప్పి వుంటాడు. అన్న తనూ ధనం అపహరించాలని గుహలో ప్రవేశించి చిక్కిపోయాడు. వాడిని చంపి గుహలో వ్రేలాడదీశాం. గుహలోకి రావడం తిరిగి వెళ్ళడం ఆలీబాబాకు తెల్సును కనుక ఆలీబాబాయే గుహకు వచ్చి అన్న శవాన్ని మరికొంతడబ్బునీ తీసుకుపోడు. అదే ఖచ్చితంగా జరిగివుంటుంది. అనుకున్నాడు, కానీ తొందరపడలేదు. ఆగ్రహాన్ని అణచుకున్నాడు. తదుపరి తను వెడతానని చెప్పి ఆలీబాబాను అతని భార్యనూ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నాయకుడు.
ఇప్పుడు తనశత్రువు యెవరో తెల్సుకున్నాడు. అసలు శత్రువు ఆలీబాబా అని నిర్ధారణ చేసుకున్నాడు. ఆలీబాబాను హతమార్చాలని అదియేమంత కష్టమైన పనికాదని. తెలివిని ఉపయోగించి శత్రుత్వమును కత్తులు దూయకుండా తెలివిగా చంపడం మంచిది అనిపించింది.
నాయకుడు గుహకు చేరాడు. తమ ముఠా వారినందర్నీ కూర్చోబెట్టి అసలు విషయం వివరించి చెప్పాడు. అందుకు అందరూ ఆలోచించి ఆలీబాబాను చంపే విధానం గురించి సలహాలు యిచ్చారు. అవేమీ నాయకునికి నచ్చలేదు తను ఒక ఉపాయం చెప్పాడు.
నాయకుడు చెప్పిన ఉపాయం మిగతా వారికి నచ్చింది. అలాచేస్తే 'కుక్కకాటుకి చెప్పుదెబ్బ' అన్నట్లు బాగుంటుందని నాయకునికి తెలియపర్చారు.
ఆ వెంటనే దొంగలనాయకుడు ముప్పయి ఎనిమిది డబ్బాలు తెప్పించాడు. అవి చాలా పెద్ద సైజులో వున్నాయి. దొంగలందర్నీ వ్యాపారస్తుల వేషాల్లోకి మారి ఒకొక్కరు ఒక్కో డబ్బాలో కూర్చోమన్నాడు. కత్తులు మాత్రం భద్రం చేసుకోమన్నాడు. అనంతరం తనూ నూనె వ్యాపారి వేషం వేసుకున్నాడు. తనూ అసలు వ్యాపారిగా నూనె డబ్బాలన్నీ గాడిదలమీదకు ఎక్కించాడు. వాళ్ళు ఆ మర్నాటి ఉదయానికే ఆలీబాబా యింటికి వెళ్ళి అతన్ని హతమార్చాలని చెప్పాడు తనవారికి.
దొంగలు ఆ పద్దతి బాగుందని మెచ్చుకున్నారు. ఆ రహస్యం బయటికి పొక్కనీయకూడదని అనుకున్నారు. నాయకుడు నూనె డబ్బాలతో ఆలీబాబా యింటికి వెళ్ళేసరికి రాత్రి అయింది.
తాము నూనె వర్తకులమని ఆ రాత్రికి తనకూ తన నూనె డబ్బాలకు ఆశ్రయం యిస్తే మర్నాడు వెళ్ళిపోతామనీ చెప్పాడు నాయకుడు.
అమాయకుడు ఆలీబాబా ఆనందించాడు. పరదేశ ప్రయాణం చేస్తూ వర్తకులు వచ్చారన్న ఆనందంతో అందుకు అంగీకరించాడు తమ ఇంటిలోనే వసతిని యేర్పాటు చేశాడు.
నూనె డబ్బాలన్నీ తమ పెరట్లోనే వరుసగా దింపించాడు ఆలీబాబా. డబ్బాలు మోసుకుని వచ్చిన గాడిదలకు దాణా వేయించాడు.
COMMENTS