Sunday, 13 June 2021

అన్వేషణ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fourteenth Story in Telugu

Alibaba and Forty Thieves Fourteenth Story in Telugu Language : In this article we are providing "అన్వేషణ ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.

అన్వేషణ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fourteenth Story in Telugu

అన్వేషణ ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Fourteenth Story in Telugu

బాటసారిగా ప్రయాణం అయి వెళ్లిన దొంగ అరణ్యప్రాంతం అంతా వెతికాడు. చుట్టు ప్రక్కల వున్న ఊళ్ళన్నీ గాలించాడు. కంటపడిన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. కాశిం గురించి సమాచారంగాని అతని కుటుంబ పరిస్థితిని గాని ఎవ్వరూ చెప్పడం లేదు. అంటే చెప్పకూడదని కాదు వాళ్ళకు తెలియక చెప్పడంలేదు.

బాటసారిగా ఉన్న దొంగ నిరుత్సాహ పడలేదు. అన్ని ఊళ్ళు తిరిగాడు. చివరిగా ఆలీబాబా కాశీం ఆవుంటున్న ఊరు చివరకు వచ్చాడు. అక్కడ నిలబడి దిక్కులు చూస్తున్నాడు. అనుకోకుండా అతనికి అల్లంత దూరంలో అరుగుమీద కూర్చుని మిషను కుట్టుకుంటున్న దర్జీవాడు కనిపించాడు. అతన్ని అడుగుదామని అక్కడకు వెళ్లాడు.

ఆదర్జీ మారు వేషంలోవున్న దొంగను ఆహ్వానించాడు. ఆధిత్యం ఇచ్చి మర్యాదలు చేసాడు. 'తమరు ఎవరూ' అని అడిగాడు. తీర్థయాత్రలు చేస్తూ మార్గమధ్యంలో వున్న ఆ ఊరు వచ్చినట్లు చెప్పాడు. దర్జీకి అతను చెప్పిన దానిని బట్టి అతను మీద భక్తి, గౌరవం, నమ్మకం ఏర్పడినాయి. .

తను యింకా యాత్రలు తిరిగే పని వుందన్నాడు. మక్కాకు వెళ్ళాలన్న అభిప్రాయం వున్నదని అన్నాడు. అవసరమైన ధనం లేదని నిరుత్సాహ పడ్డాడు.

దర్జీ ఆనందంతో ఉడతాభక్తిగా ఒక బంగారు నాణెం యిచ్చి ఆల్లా పేరున యీ నాణెంను వుంచుకోమని అన్నాడు. ఆ నాణెంను తీసుకొని దొంగ పరిశీలనగా దాన్ని అటూ యిటూ తిప్పిచూశాడు. అతనికి అనుమానం వచ్చింది. తాము దోపిడీ చేసి తెచ్చిన బంగారు నాణేలలో అదీ ఒకటని గుర్తించాడు.

“యేమిటి చూస్తున్నారు.” అడిగాడు దర్జీ. .

“యేమీలేదు! దర్జీ పనిచేసుకొని బ్రతికుతున్న నీకు విలువైన యీ బంగారు నాణెం ఎక్కడి నుండి వచ్చింది ? అన్నాడు. 

దర్జీకళ్ళప్పగించి చూశాడు; మీరు మరోలా అనుకోవద్దు,నాణెం అపురూప మైనదని విలువైనదని అడిగానుఅంతే!”అన్నాడు బాటసారి వేషంలోవున్న దొంగ.

“బాబూ నువ్వన్నట్లు యే పూట డబ్బులు ఆ పూట సంపాదించుకొని గడిపే నేను అతి సామాన్యుడనే. అయితే నేం! అల్లాదయ! ఆయన దయ ఎప్పుడు ఎవరిమీద యేరూపంలో కనిపిస్తుందో మనం చెప్పలేం కదా ! చెప్తాను బాబూ! మీ సందేహం తీరుస్తాను! క్షణం ఆగాడు, యేదో ఆలోచించుకున్నాడు “ఈ ఊరిలోనివాడే ఒక వ్యక్తి రాత్రిపూట వచ్చాడు మా యింటికి, ఆ సమయంలోనే అర్ధరాత్రి సమయాన నా కళ్ళకు గంతలు కట్టాడు. ఒక యింటికి తీసుకొని వెళ్ళాడు తలను మొండెం వేరు చేయబడిన శవాన్ని అతికించి కుట్టమన్నాడు. నేను ఆ పని చేశాను. నాకు ప్రతిఫలంగా అటువంటి బంగారు నాణేలు పది యిచ్చాడు. అని వివరించాడు.

ఆ పని చేయించింది ఆలీబాబా అని తెలియదు దర్జీవాడికి.

“అల్లా మీ అదృష్టాన్ని పండించాడు. మీరు అన్యధా తల్చకుండా నాకు ఆ ఇల్లు చూపించుతారా ? యెందుకంటే, నా యాత్రకు ఆ ధనవంతుని బిక్ష అడుగుతాను. నాకూ కొంత ధనం యిస్తాడన్న ఆశ వుంది అన్నాడు బాటసారిగా వున్న దొంగ.

“అయ్యా చెప్పాను కదా! నా కళ్ళకు గంతలు కట్టారు ? అయితే ఒక విషయం ఎన్నివీధులు తిప్పిందీ యే దిక్కుగా ఎంత దూరం నడిపించిందీ చెప్పగలను” అని చెప్పాడు దర్జీ..

“అలాగే” చూస్తున్నాడు మారువేషంలో వున్న దొంగ. వెంటనే ఆ దర్జీ దొంగను వెంటపెట్టుకొని బయల్దేరాడు. అతను చెప్పినట్లు రెండు వీధి మలుపులు దాటించాడు. దక్షిణంగా రెండు వందల యాభూ గజాలు షుమారు తీసుకు వెళ్ళాడు. ఒక యింటి దగ్గర ఆగిపోయాడు. తనను తీసుకు వెళ్ళిన ఇల్లు అదే అవచ్చునని దొంగకు తెలియపర్చాడు దర్జీ. దొంగ ఆ ఇల్లు గుర్తు పెట్టుకొని దర్జీని ఎంతో మెచ్చుకున్నాడు. “అల్లా నీకు శుభం చేస్తాడు” అని దీవించి అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఆ రాత్రి ఎవరి కంటపడకుండా యెవ్వరికీ అనుమానం రాకుండా దర్జీ చూపిన ఇంటికి వెళ్ళాడు. మూసివున్న తలుపుమీద X మార్కును సుద్ద ముక్కతో పెట్టి వెళ్ళిపోయాడు.

అతను సుద్దముక్కతో గుర్తుపెట్టిన మేడ కాశింది. ఆలీబాబా'కుటుంబం కూడా లోపలే వుంటున్నది. కూపీ తీసిన దొంగ ఆ మర్నాటి ఉదయం అడవిలోని తమ గుహకు వెళ్లి ఈ విషయమంతా దొంగల నాయకుడికి చెప్పాడు నాయకుడు చాలా సంతోషించాడు.

ఆ వెంటనే దొంగలు అంతా యాత్రికుల వేషాల్లోకి మారిపోయారు. ఆచూకీ కనిపెట్టినవాడిని వెంట పెట్టుకొని బయల్దేరి వెళ్ళారు. వారి గుర్రాలు ఆ గ్రామం చేరినాయి. ఊరి బయట నాయకుడు రహస్య స్థలంలో మకాం వేశాడు. రహస్యం తెల్సుకున్న వాడితో సహా కొందరు దొంగల్ని గ్రామంలోనికి పంపించాడు. శత్రువులు మీ ఇంట్లో వున్నారో తెల్సుకొని రమ్మన్నాడు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 comments: