Adadanni Adade Vruttantham Kasi Majili Story in Telugu : In this article ఆడదాన్ని ఆడదే (ప్రేమించిన) వృత్తాంతము కాశీ మజిలీ కథలు for kids and Students.
Adadanni Adade Vruttantham Kasi Majili Story in Telugu Language : In this article read "ఆడదాన్ని ఆడదే (ప్రేమించిన) వృత్తాంతము కాశీ మజిలీ కథలు", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
Adadanni Adade Vruttantham Kasi Majili Story in Telugu Language
చిలుకపంపిన సందేశమును పురుషరూపంలోనున్న విశాలాక్షి చదవ సాగింది. ఓ వీరాధివీరా ! మన్మధరూపంతో నున్న నిన్ను చూడగానే నా మనస్సు చలించింది. నీ రూపలావణ్యములు నన్ను మత్తెక్కిస్తున్నాయి. నీ మగతనము నన్ను పరవశురాల్ని చేస్తోంది. అద్భుత ఫల, పుష్పాలను నీ వీరత్వమును చూసి వరించకుండా నేనెట్లుండగలను? నీపై మరులుగొని ఉన్నానుమగరేడా !” అంటూ శృంగార కవిత్వాన్ని వ్రాసి ఊరుకొనక, ఉండబట్టలేక ఒకనాటి అర్ధరాత్రి సంగీతసాధన అనే నెపంతో చెలికత్తెనొకదానిని వెంటబెట్టుకొని మగవేషంలోనున్న విశాలాక్షి భవనానికి వచ్చింది.
ఆమె రాకుమార్తె వసంతతిలక నొకవనిత. అపురూపలావణ్యవతి. అందమైన రూపలావణ్యములతో చూపరులనిట్టే ఆకర్షించే అద్భుతసౌందర్యరాశి ఆమెను చూడగానే పురుషవిశాలాక్షి "కన్యకామణీ” నీవు రాకుమార్తెను పెద్దల అనుమతి లేనిదే నీవిట్లు సాహసించతగునా ! ఇంత ' అర్ధ రాత్రివేళ వరపురుషుని శయనమందిరమునకు నీవిట్లు స్వతంత్రించి రారాదు. అది ఉభయులకు శ్రేయస్కరం కాదు. కావున రాచమర్యాదలకు తలవొగ్గి వెనుతిరిగి పొమ్ము ! అనిసున్నితంగా ఆమెను తిరస్కరించింది.
వెనుదిరిగిన వసంతతిలక తన మనస్సులోని కోరకను తల్లిదండ్రుల ముందు తెలియజేసింది. అంతట రాజుగారే స్వయంగా వచ్చి “ఓ మగధీరా ! నాకు పుత్రులు లేరు. ఒక్కతే పుత్రిక. ఆమెయే వసంత తిలక. అంద చందాలలోను, విద్యావినయ సంపత్తిలోను ఆరితేరిన దిట్టవారసుడులేని నా రాజ్యంపై వైరు లందరూ దండెత్తాలని చూస్తున్నారు. నేనా పెద్దవాడినైపోయాను. కనుక నాపుత్రికను పరిణయమాడి నా రాజ్యభారం వహించి, వైరులపన్నాగాలను వమ్ముచేయి. నా రాజ్యాన్ని శతృరాజుల నుండికాపాడు.” అని తన కోరికను వెళ్ళబుచ్చాడు. రాజంతటి వాడే అర్ధిస్తుంటే కాదనలేక, ఔననలేక, నిజంచెప్పలేక మిన్నకుండి పోయింది విశాలాక్షి. విశాలాక్షి మౌనాన్ని అంగీకారంగా తీసుకున్న రాజు మరికొద్దిరోజులలోనే వసంతతిలకకు విశాలాక్షికి వివాహం జరిపించాడు.
విధి వారిని వెక్కిరించినట్లుయ్యింది. విశాలాక్షికి ఏం చేయాలో తోచటం లేదు. పాపమా అభాగ్యురాలు వసంతతిలకకు నిజంతెలిస్తే ఏమౌతుందో ! ఆమె నన్ను పెండ్లాడటమేమిటి? విధివైపరీత్యంగాక ! దీనికంతకూ కాలమే బదులి వ్వగలదనుకొని విశాలాక్షి సరిపెట్టుకొంది. ఒకనాటి సాయంత్రం పురుష విశాలాక్షి, వసంత తిలకతో “దేవీ ! నీతో ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచాను. నాకొక మునిశాపం ఉన్నది. ఇంతకు పూర్వం నేనొక పొరబాటు చేయటంవలన ముని శాపానికి గురయ్యాను. పెళ్ళయిన సంవత్సరంలోగా భార్యను తాకితే మరణం సంభ విస్తుందని మునిశాపం పెట్టాడు. కావున ఏడాదివరకు మనిద్దరమూ ఒకర్నొకరు తాకరాదు. నిత్యమూ గుర్తుంచుకొని మసలుకొనుము. సంవత్సరం దాటిన తర్వాత మనిద్దరం హాయిగా ఉండవచ్చు” అని వసంతతిలకతో చెప్పగా ఆమె “సరే” అని అంగీకరించింది . తప్పదుకదా ! మరికొన్నాళ్ళకు మహారాజు ముసలితనంతో మరణించాడు. పురుషరూపంలోనున్న విశాలాక్షినే రాజుగా చేసి పట్టంకట్టారు.
సంవత్సరం గడిచింది. ఎప్పుడెప్పడాయని ఎదురుచూస్తున్న వసంతతిలక ఆనందానికి హద్దులేకుండాపోయింది. ఒకనాటి శుభరాత్రి తన భర్త గదిలోనికి వెళ్ళింది. వసంతతిలకను చూడగానే విశాలాక్షి "ఓ రాకుమారీ ! నీ కింతవరకు తెలియని నిజం చెబుతున్నాను విను ! నేనుకూడా నీవలే ఆడదాన్నే పరిస్థితుల ప్రాభల్యంవలన నిజంచెప్పలేకపోయాను. నాకింతకు పూర్వమే వివాహం జరిగింది. నా భర్త పేరు కింశుకశాస్త్రీ. పరిస్థితులు మమ్మల్ని విడదీశాయి. అన్ని రోజులు ఒకలా ఉండవుగదా ! మంచివెనుక చెడు, చెడువెనుక మంచి తప్పకఉంటుం దంటారు. అట్లే నా భర్త తప్పక నన్ను కలుసుకొనగలడు. ఆతడే నీకు మొగుడు కూడా కాగలడు." అంటూ ఓదార్చింది.
అనుకున్నట్లుగానే మదనుడనే పేరుతో కింశుకశాస్త్రి దేశదేశాలలో తన పాండిత్యాన్ని మెరుగుపర్చుకొన్నాడు. మరికొన్నిదినములకు విశాలాక్షిఉన్న రాజ్యం చేరుకొని. తన భాషా పాండిత్యానికి మెరుగులు దిద్దుకుంటుండగా విశాలాక్షి గుర్తించింది. ఆతనినే వారిద్దరూ తమ భర్తగా అంగీకరించారు.
COMMENTS