విక్రమార్క భేతాళుని నాగ సంతతి కథ : Read Vikram Betal Naga Santati Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids
విక్రమార్క భేతాళుని నాగ సంతతి కథ : In this article, read Vikram Betal Naga Santati Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుని నాగ సంతతి కథ Vikram Betal Naga Santati Story in Telugu
కద్రున, వినతి అనేవారులు ఇద్దరూ కశ్యపుని భార్యలు. వినతికి గరుత్మం తుడు, అనూరుడు అనబడే ఇద్దరుకుమారులు వినతికి పుట్టినవారంతా నాగ రాజులు. వీరు యెంతమందో లెక్కకు తెలియనివారు. కశ్యపునకు వినతిమీద కోపంవుంది. అందువలన ఆమెను దాసీగానే చూసుకుంటున్నాడు. గరుత్మతుడు కూడా నాగులకు సేవకుడు అయినాడు.
ఇలాగున జరుగుతూనే పెరిగి పెద్దవాడు అయినాడు గరుత్మంతుడు. అప్పుడు కద్రున అతనితో “నీవు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చియిస్తే నీ తల్లి దాస్యవిముక్తిని చెందుతుంది” అని చెప్పింది.
తన తల్లికి దాస్యవిముక్తి కలిగించాలన్నది గరుత్మంతుని కోరిక ! ఆ వెంటనే స్వర్గానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ మహేంద్రుని జయించాడు. అమృతంను తెచ్చి కద్రునకు యిచ్చాడు. ఆ సందర్భంగా తల్లికి దాస్య విముక్తి కల్గింది. కానీ గరుత్మంతునకు నాగులపై కోపం పోకపోగా అధికమైంది. అందు వలన ప్రతిరోజూ కంటపడిన నాగులను చంపితినేస్తున్నాడు గరుత్మంతుడు చేస్తున్న దురాగతానికి ఆదిశేషువు సహించలేకపోయాడు ! దినదినానికి తన జాతి క్షీణించుతోంది ! ఈ విషయాన్ని మహావిష్ణువునకు మొరబెట్టుకున్నాడు.
అప్పుడు విష్ణుదేవుడు, గరుత్మంతుడ్ని పిల్చిమందలించాడు. ఆ సమ యంలో “రోజుకొకపాము చొప్పున నీవు తిని ఆకలి తీర్చుకో! అంతేకాక కనపడిన పామునెల్లా తినకు యిదినా. ఆజ్ఞ” అని చెప్పాడు. .
అక్కడినుండి గరుత్మంతుడు రోజునకు ఒకపాము చొప్పున పట్టి మల యగిరి కొండల మీదకు తీసుకువెళ్ళి భక్షిస్తున్నాడు. అతనికి శ్రమలేకుండా ప్రతి రోజూ ఒకసర్పం ఆకొండల మీదకు వెళుతుండడం, దాన్ని గరుత్మంతుడు తినడం జరుగుతోంది. “ఆ కొండమీద 'గరుత్మంతునిచేత చంపిన పాముల ఎముకలే అవి”అనిమిత్రావసువు జీమూతవాహనునకు తెలియపర్చాడు. అదే సమయంలో శంఖచూడుడనబడే నాగబాలుడు అక్కడికి వెళ్ళాడు. అతని తల్లి అతని వెంటే దుఃఖిస్తూ వెళ్ళినది. అది చూసి జీమూత వాహనుడు జాలిపడ్డాడు. అతన్ని రక్షించి తల్లి దుఖ్యాన్ని తుడిచేయాలనుకున్నాడు.
ఆ మరుక్షణము మిత్రావశుని ఇంటి కిపొమ్మనిచెప్పాడు. అతను వెళ్ళి పోయాడు. తనుమాత్రం అక్కడ వున్నాడు. శంకచూడుడు అనబడే నాగబాలుడు స్నానం చేసిరావాలనుకుని నదికి వెళ్ళాడు. ఆ తక్షణం జీమూతవాహనుడు శంఖు చూడుడు మాదిరి అక్కడే పడుకున్నాడు. గరుత్మంతుడు రానే వచ్చాడు. జీమూత వాహనుడుని చూసి తనకు ఆహారంగా వచ్చాడని తలచి, అతన్ని ఎత్తుకుపోయి కొండ శిఖరం చేరాడు. అక్కడ పెట్టుకుని భుజిస్తున్నాడు. అంతలో స్నానం చేసి వచ్చిన శంఖచూడుడు అక్కడజరుగుతున్న సంఘటనను చూశాడు.
“ఆగు గరుత్మంతా ! అతను నాగుకాదు ! అతను నన్ను రక్షింపవచ్చిన మానవుడు. అతను విద్యాధరపురరాజు పుత్రుడు జీమూతవాహనుడు. అతన్ని చంపవద్దు!” అని ప్రార్థించాడు. తనపొరబాటును తెల్సుకున్న గరుత్మంతుడు ఆమరుఘడియలో స్వర్గానికి వెళ్ళి అమృతంను తెచ్చి జీమూతవాహనుని బ్రతకిం చాడు. అప్పటినుంచీ గురుత్మంతుడుకూడా తన పద్ధతిని మార్చుకున్నాడు.
“నేను చెప్పిన కథను వింటి వికదా! యీ కథలో యెవరు గొప్పవారో చెప్పగలవా? తెలిసీ చెప్పకపోయావనుకో అప్పుడు నీతలపగిలిపోతుంది” అన్నాడు భేతాళుడు.
“భేతాళా ! నీకు జీమూతవాహనుడు గొప్పవాడు అనిపించవచ్చును. నన్ను అడిగితే శంఖుచూడుడే గొప్పవాడు. ఎందుకంటే శంఖచూడుడు ప్రాణం దక్కినందుకు ఆనందించలేదు. జీమూతవాహనుడికై ప్రాకులాడాడు. నిజం చెప్పాడు. జీమూతవాహనుని ప్రాణంను నిలిపాడు” అని చెప్పాడు.
ఈవిధంగా మౌనభంగం కలగడంతో భేతాళుడు తుర్రున ఎగిరి ఎప్పటి మాదిరే మర్రివృక్షం పైకి చేరాడు.
విక్రమార్కుడు ఆ భేతాళుని బంధించేటందుకు తిరిగి మర్రి వృక్షం వద్దకు వెళ్ళాడు.
అ మరుక్షణం భేతాళుని చేజిక్కించుకుని యెప్పటి మాదిరే బుజానవేసు కొని బయల్దేరి వెడుతున్నాడు. అతని నుండి తప్పించుకొనే మార్గం తెలిసిన భేతాళుడు మరో కథను చెప్పడం మొదలు పెట్టాడు.
COMMENTS