Alibaba and Forty Thieves Nineteenth Story in Telugu : Read here దొంగల నాయకుడు అంతం ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story for Kids.
Alibaba and Forty Thieves Nineteenth Story in Telugu Language : In this article we are providing "దొంగల నాయకుడు అంతం ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
దొంగల నాయకుడు అంతం ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Nineteenth Story in Telugu
దొంగల నాయకుడు అయిన బహదూర్‌షాను ఆహ్వానించి విందులూ వినోదాలు. యేర్పాటు చేశాడు చోటేబాయి. అతన్ని తండ్రి అయిన ఆలీబాబాకు పరిచయం చేశాడు. దొంగల నాయకుడు పేరు మార్చుకొని వ్యవహరిస్తున్న సంగతి అలిబాబా తెలుసుకోలేకపోయినా మార్జియానా పసికట్టింది. తనకేం తెలియనట్లు వూరుకొంది.
ఆలీబాబా తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నాడు. దానికి బహదూర్‌షాను ఆహ్వానించాడు. ఆ అవకాశం కోసమే యెదురుచూస్తున్నాడు బహదూర్‌షా! ఎలాగైనా ఆ రాత్రి ఆలీబాబాను హతమార్చాలనేది అతని ఆలోచన.
ఇదంతా తెల్సుకొని మార్జియానా, ఈరోజునృత్య ప్రదర్శన కూడా వుందని చెప్పమంది. ఆ నృత్యం ఎన్నడూ కనీవినీ ఎరుగని కత్తుల నృత్యం అన్నది.
ఆనాటి పుట్టినరోజునాడు వూరిలోని పెద్దలు, ధనవంతులూ, బంధు వులూ అందరినీ ఆహ్వానించబడ్డారు. ఆలీబాబా అతిధులకు చేస్తున్న మర్యాదలకు దొంగల నాయకుడు కడుపు మండిపోయింది. తమ వద్ద దోచుకున్న డబ్బుతోనే జల్సా చేస్తున్నాడనిపించింది. ఆలీబాబాను ఎప్పుడు చంపుతానా అని తాపత్రయ పడుతున్నాడు. రత్నములు పొందుపరిచిన బాకు ఒకటి సిద్ధంగా బొడ్డు దగ్గర దోపుకున్నాడు.
వచ్చిన వారంతా ఇళ్ళకు వెళ్ళిపోతున్నారు. మార్జియానా కోరిక మీద ప్రత్యేకమైన నృత్యం చూసేటందుకు రమ్మనమని నాయకుని లోపలకు ఆహ్వానించాడు ఆలీబాబా.
ఆలిబాబా, బహదూర్‌షా, చోటే బాబు అందరూ అలంకరించి ఉంచ బడిన తీవాచీ మీదున్న పరుపుల మీద వెనక్కిచేరగిలపడి కూర్చున్నారు. ఆ వెంటనే మార్జియానా ఆలీబాబా విందునిమిత్తం తెప్పించి వుంచిన ఖరీదైన మధ్యమును ఆడూతూ,పాడుతూ, హొయలువలికిస్తూ వాళ్ళకు పోస్తున్నది. వాళ్ళు త్రాగుతున్నారు. మైకం కమ్మింది. మరొకసారి ఆడుతూ పాడుతూ అది కత్తుల నాట్యం కాబట్టి మార్జియానా ఆలీబాబా చోటే బాబుకుకత్తులుచూపిస్తున్నది. అదే విధంగా బహదూర్‌షా వద్దకు కత్తిని అతని గుండెలకు సూటిగా చూపిస్తూ ఆడుతోంది.
కత్తులు ముగ్గురికీ చూపడంతో దొంగల నాయకుడికి అనుమానం రాలేదు. ఆమె దగ్గరకు వచ్చి అతని కళ్ళల్లోకి చూస్తూ కత్తి చూపించినప్పుడు మాత్రం గుండెలు ఝల్లుమనేవి నాయకుడుకి.
ఆ విధంగా ఆడుతూనే పాడుతూనే మార్జియానా సమయం కనిపెట్టి ఒక్క విసురున దొంగల నాయకుని గుండెల్లో దిగేసింది. అంతే ఆ దొంగ' అరె అల్లా! యెంతపని చేశావు' అంటూ వెనక్కి వాలిపోయాడు. అలా గుండెల్లో నుండి రక్తం చిమ్మింది. ఆ ప్రదేశం అంతా రక్తమయమైంది.
నాయకుడు మరణించాడు
ఆలీబాబాకు చోటాబాబాకు అదేమిటో అర్థం కాలేదు. తమఆహ్వానం మీద వచ్చిన అతిధిని అమర్యాదచేసి చంపినందుకు మార్జియానా మీదకోపం వచ్చింది.
“మార్జియానా యేమిటి నువ్వు చేసిన పని ? అని అరిచాడు చోటేబాబు.
“దయచేసి శాంతించండి. మీరు నాతోరండి” నేను మీకు మేలు చేసే దాన్నో కీడు చేసేదాన్నో. మీ గౌరవానికి భంగం కలిగించేదాన్ని మాత్రం కాదు. అతను నగల వర్తకుడు కాదు. దొంగల నాయకుడు. ఆ సంగతి నేను ముందే పసిగట్టాను. అంతం చేయాలనే తలచాను అందుకే ఈనాట్య ప్రదర్శన యేర్పాటు చేశాను.” అంటూ వాళ్ళను వెంటపెట్టుకొని అవతలగా పడివున్న దొంగల నాయకుని వద్దకు వెళ్ళింది. అతని మారువేషంను తొలగించింది. అతని నిజరూపాన్ని ఆ అవతారంను చూపించింది.
“ఈ దొంగల నాయకుడు మిమ్మల్ని చంపాలని కుట్ర పన్ని సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. అది గ్రహించి నేను అతన్ని పధకం వేసి చంపేశాను. శతృశేషం యిప్పుడు మిగలకుండా పోయింది” అన్నది.
“ఆదుర్మార్గులు నలభైమంది దొంగల నీ వాళ్ళనాయకుడు నీ యెప్పటి కప్పుడు నేను కనిపెడుతూనే వున్నాను. మీరు నిర్భయంగా బ్రతికేటందుకు శత్రుశేషంను తుడిచివేశాను. యిది నా అపరాధమైతే మీరు విధించిన శిక్షకు పాత్రురాలను” తిరిగి అంది మార్జియానా అసలు విషయం అందరూ తెలుసు కున్నారు. దొంగలనాయకుని శవాన్ని పెరట్లో నలభైమందినీ పాతిపెట్టిన స్థలానికి ప్రక్కగా గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టారు.
" ఇంక మనకేం భయంలేదు. మన నిశ్చింతగా వుండవచ్చును” అన్నది అలిబాబాతో మార్జియానా..
“నీవు చేసిన యీ మహోపకారానికి మా కుటుంబం తరపున నీకేం సహాయం చేయాలన్నా తక్కువే అవుతుంది.”
“మీరు నాకు యేమీ చేయాల్సిన పనిలేదు. మీ అభిమానం దయ వుంటేచాలు.” అని అందరికీ నమస్కరించింది మార్జినియా.
'ఆలీబాబా ఆమె సహాయానికి యేం చేయాలి' అని తీవ్రంగా ఆలోచించాను.
బంధువులను సలహా అడిగాడు.
మార్జియానాను కోడలుగా చేసుకోమని బంధువులు సలహా యిచ్చారు.
నిజానికి బయటపడకపోయినా చోటేబాబుకి చాలాకాలంగా మార్జియా నాను పెండ్లాడాలని వుంది. అని కొందరు బంధువులు చెప్పారు.
అదే సమయంగా తలచి మార్జీయానాను అడిగాడు ఆలీబాబా.
చోటేబాబు మార్జియానాలు అంగీకారం తెలియపరచారు.
ఒకానొక శుభముహూర్తాన చోటే బాబుకీ మార్జియానాకు అతి వైభవంగా వివాహం చేశారు.
ఆ తదనంతరం దొంగల రహస్య గుహకు గాడిదలను తీసుకువెళ్ళాడు. వాళ్ళు గుహలో గుట్టలుగా పోసిన బంగారం రత్నాలు, అంతటనీ నిరభ్యంతరంగా నిరాటంకంగా, మూటలు కట్టి గాడిదలమీదకు ఎక్కించాడు. అంతా తమ ఇంకికి తీసుకు వచ్చాడు ఆలీబాబా.
ఆ డబ్బు అతని స్వంతానికి వుపయోగించుకోలేదు.
లేనివాళ్ళకు, బిక్షకులకు ధర్మం చేశాడు.
సంతర్పణలు చేశాడు.
మహాత్ముడుగా, పుణ్మాత్ముడుగా, పేరు ప్రతిష్టలు ఆర్జించుకున్నాడు ఆలీబాబా.
అలీబాబా పేరువింటేనే, తలిస్తేనే చేతులు జోడించి నమస్కరించనివారు వుండరు.
చోటేబాబు మార్జియానాతో సుఖంగా కాపురం చేస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నాడు.
ఆలీబాబా పైనుండి పెత్తనం చేస్తూ, కొంతకాలానికి అంటే వయస్సు మళ్ళి వృద్ధుడు అయినాక, తనతోబాటు ముసలమ్మలు అయిన తన భార్య, అన్న భార్యలనూ వెంట తీసుకొని మక్కా యాత్రకు వెళ్ళాడు.
అక్కడనే తమ శేష జీవితాన్ని సాఫీగా సాగించుతున్నారు అందరూ.
COMMENTS