King Vikramaditya and Saint Story in Telugu : Read విక్రమార్కుడు సన్యాసి తెలుగు కథ, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids.
King Vikramaditya and Saint Story in Telugu Language : In this article, read విక్రమార్కుడు సన్యాసి తెలుగు కథ, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్కుడు సన్యాసి తెలుగు కథ King Vikramaditya and Saint Story in Telugu
ఉజ్జయినీ నగరంకు కొద్ది దూరంలోనే కాళికాలయం వేరొకటుంది. అందులో ఒకసన్యాసి ఎన్నోయేండ్ల నుండి కాళికాదేవిని ఆరాధిస్తున్నాడు.
కొంతకాలానికి దేవి అతనిభక్తికి మెచ్చి వరం కోరుకోమంది. ప్రత్యక్షమై నప్పుడు ఆ సన్యాసి తనకు మోక్షం ప్రసాదించమని అడగలేదు. అమ్మా! నాకు ఈ భూలోకంలోనే సమస్త భోగభాగ్యలూ కలుగునట్లు రాజాధిరాజులు అందరూ తనకు సామంతులు అయ్యేటట్లు, నేను ప్రార్థించినప్పుడల్లా మీరు ప్రత్యక్షమగు నట్లు, నాకుచావులేనట్లు, నేను యేది తలిస్తే అది మరుక్షణంలో అయ్యేటట్లు వరం ప్రసాదించమని కోరాడు.
కాళీమాత అతనిదురాశకు ఆగ్రహించింది. అతను తపస్సుచేసి తనను ప్రత్యక్షం అయ్యేటట్లు చేసుకున్నాడుకనుక కోపమును తగ్గించుకుని యిలా అంది
“భక్తా ! నీవు కోరినవరాన్ని నేను ప్రసాదించేటందుకు ముందుగా నీవు చేయవల్సిన పని వుంది ఇందుకుముందు నీవు భేతాళుని వశం చేసు కోవాలి. ఇక్కడకు ఆమడదూరంలో దక్షిణంగా పెద్ద మర్రిచెట్టువుంది ! ఆ చెట్టు
మీద భేతాళుడు నివసిస్తున్నాడు. నువ్వాభేతాళుడుని స్వాధీనం చేసుకోవాలి. అనేక రాక్షసగణాలు భూతప్రేతపిశాచాలు, నివసిస్తున్నాయి. వాటికి అధిపతిగా భేతాళుడు వుంటున్నాడు. అతను శవాకారంగా మర్రిచెట్టు కొమ్మకు వేళాడు తూంటాడు. ముందు నీవు అతన్ని వశపర్చుకోవాలి. అంతేకాదు ! ఆ ప్రయత్నా నికి ముందుగా నాకు తృప్తి కలిగించాలి ! భద్రకాళీ హోమంను చేయాలి. నరబలిచేయాలి. అంటే నూరుమంది రాజకుమారులను నాకు బలివ్వాలి. వారిలో చివరివాడు అంటే నూరవవాడు మహావీరుడు, సాహసి, అయివుండాలి. అతన్ని బలివ్వడంతో నీ యజ్ఞం పూర్తి అవుతుంది. అయితే యీ సమయంలోనే నీవు భేతాళుని పశపర్చుకోవాలి. ఆమరుఘడియలోనే నీవు కోరిన కోరికలు అన్నీ నెరవేరగలవు.” అని చెప్పి అంతర్థానమైంది కాళీమాత.
భద్రకాళి సందేశానుసారం దురాశా పీడితుడు అయిన సన్యాసి హోమం , ప్రారంభించాడు. ఆ సందర్భంగా రాకుమారులను బలివ్వడం అవసరం కదా! " అందుకోసం దేశంలోని అన్ని ప్రదేశాలకూ అంటే,దేశదేశాలూతిరిగి రాకుమా రులను మాయమాటలతో నమ్మించి తీసుకువచ్చేవాడు. వారు కాళికి మొక్కుతు న్నట్లు వుండమనేవాడు. ఆ వెంటనే వారి శిరస్సును ఖండించేవాడు. ఈ విధంగా సన్యాసి తొంభై తొమ్మిది మంది రాకుమారులను బలిచ్చాడు. మరో రాకుమారుని బలివ్వడంతో అతని కోరిక తీరుతుందని కాళీమాత అతనుకోరినవరాలు యిచ్చేస్తుంది. వందోరాకుమారునికోసం గాలించడం మొదలు పెట్టాడు.
నూరవ రాకుమారుని కోసం వెదుకుతున్న సమయంలో రాజు విక్రమా ర్కుని గురించీ, ఆయన గుణగణాలు గురించీ ధైర్యసాహసాలు గురించి విని యున్నాడు. ఉజ్జయినీ రాజ్యంలో వున్నాడని విన్నాడు. తక్షణం అతను ఉజ్జయినీ చేరి అతనికోసం మకాంవేశారు. విక్రమార్కుడు దేశపర్యటన ముగించుకొని రాజ్యానికి వచ్చాడు. అంతవరకూ అతని రాకకోసం నిరీక్షిస్తున్న సన్యాసికి అతను నగరం చేరగానే కల్సుకొన్నాడు.
“మహారాజా ! దేశసౌభాగ్యానికి, సంపదకీ, దేశంలో సుఖశాంతులు విరజిమ్మడానికి నేనొక మహాయజ్ఞంను తలపెట్టి చేస్తున్నాను. అందుకు అవసర
మైనవి సమకూర్చుకున్నాను. ఇక్కడికి దగ్గరలోనే హోమగుండం ఏర్పాటు చేశాను. ఆస్థలం ఎక్కువ భయకంపితంగావుంటుంది. నాకుసహాయకారిగా నీవువుండాలి. విశ్వామిత్రునికి రాముడు నిల్చినట్లుగా నువ్వు నాకు అండగా నిలవాలి. యజ్ఞం పూర్తిచేయించాలి. దేశసౌభాగ్యానికి నీవంటి మహారాజు అండకావాలి” అని చెప్పాడు సన్యాసి.
విక్రమార్కుడు. ఆయన ప్రార్థనను అంగీకరించాడు. “మహాత్మా! దేశ సౌభాగ్యానికి ప్రాణాన్నయినా వదలగలను. అందుచేత ఈ అభ్యర్థనను అంగీకరిస్తున్నాను.” అనిచెప్పాడు సన్యాసి ఆనందించాడు, అభినందించాడు.
ఆమరుక్షణమే తనువీరఖడ్గం ధరించి “పదండి పోదాం” అంటూ సన్యాసి వెంట బయల్దేరి వెళ్ళాడు విక్రమార్కుడు. వెడుతూ రాజ్యాధికారంను సోదరుడు భట్టికి అప్పగించాడు.
సన్యాసి భద్రకాళి ఆలయమునకు వెంటపెట్టుకుని వెళ్ళాడు. కాళీమాత విగ్రహాన్ని చూడగానే విక్రమార్కుడు ఆమెను మనస్సులోనే ప్రార్తించుకున్నాడు. అనంతరం సన్యాసి ఈ విధంగా చెప్పాడు.
మర్రిచెట్టు, దానిమీదున్న భేతాళుడు వగైరాల కథను వివరించాడు. అతను చేయాల్సిన పనిని వివరించాడు. “శవంగా వున్న భేతాళుని నీవు పట్టు కురావాలి. భేతాళుడు నీకొక కట్టుకథ వినిపిస్తాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఆభేతాళ శవంను పట్టుకొచ్చినాకు అప్పగించు” అనిఅన్నాడు సన్యాసి.
విక్రమార్కుడు అంగీకరించాడు. ఆ ప్రయత్నంమీదవెళ్ళాడు. అతను మర్రి చెట్టును తేరపారచూశాడు. చెట్టుకొమ్మన వ్రేలాడుతున్నశవాన్ని చూశాడు. వేగంగా చెట్టుమీదకుఎక్కాడు. శవాన్ని పట్టి భుజం మీద వేసుకొని సన్యాసి దగ్గరకు తిరిగి బయల్దేరాడు.
“మహారాజా! మనం చాలాదూరం వెళ్ళాలి" నీకు శ్రమలేకుండా ఒక కథ చెప్తాను. ఆ కథను విని నాకున్న సందేహానికి సమాధానం యివ్వు" అన్నాడు భేతాళశవం. 'ఏమిటా కథ' అడిగాడు నడుస్తున్న విక్రమాదిత్యుడు.
COMMENTS