Alibaba and Forty Thieves Ninth Story in Telugu Language : In this article we are providing "కాశిం శవాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కాశిం శవాన్ని స్వాధీనం చేసుకున్నాడు - ఆలీబాబా 40 దొంగలు కథ
అన్న తలలేని మొండెం వ్రేలాడుతోంది. తల అవతలగా పడివుంది. ఆ రెండు చూసి అదిరిపడ్డాడు. అక్కడ అట్టేసేపు వుండటం ప్రమాదమనిపించింది. అతను బంగారం కోసం పట్టుకెళ్ళిన ఖాళీ సంచులు అక్కడనే పడి వుండటం చూశాడు ఆ సంచులలో అన్న కాశిం మొండెంను తలను చేర్చి ఆ సంచులుని గుహ బయటకి యీడ్చుకువచ్చాడు. గాడిదల మీదకు ఎక్కించాడు. ఆ తక్షణం గుహ ద్వారం మూశాడు. గాడిదలను తోలుకొని సాయంత్రంనకు ఇంటికి చేరాడు. తర్వాత చేయవలసిన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాడు. అన్నగారి దుర్మరణం గురించి బయటకు యేమాత్రం పొక్కినా ప్రమాదం తప్పదనిపించింది. యీ విషయం అంతనీ రహస్యంగా భార్యకు చెప్పాడు జరిగాల్సిన తంతును గురించి అందరూ ఆలోచించారు. ఒక నిర్ణయం తీసుకున్నారు.