Alibaba and Forty Thieves Tenth Story in Telugu Language : In this article we are providing "మార్జియానా ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
మార్జియానా ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Tenth Story in Telugu
తన అన్నగారింట్లో నమ్మకంగా పనిచేస్తున్న దాసి మార్జియానా! ఆమెను కల్సుకోవాలి అనుకుంటుండగా ఆ పనిపిల్ల రానే వచ్చింది. ఆమె తమపట్ల విధేయురాలుగా వుంటుందన్న సంగతి తెల్సును. ఆ నమ్మకంతోనే ఆమెను వెంట తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు విషయం అంత విశదీకరించాడు ఆలీబాబా.
“మార్జియానా! నీకొక ప్రాణరహస్యం చెప్తాను. జాగ్రత్తగా విను. యీ విషయం నీ పెదవి దాటరాకూడదు. ప్రాణంపోయినా యీ విషయం వేరెవరికి తెలియకూడదు. పొరపాటున నోరుజారేవా నీకు, నాకేకాదు, యింతకాలం నువ్వు అన్నం తింటున్నావే మా అన్నకుటుంబం! వాళ్ళకు ప్రమాదం సంభ వించుతుంది. అని చెప్పాడు అలిబాబా.
“అలానే నా సంగతి తెల్పును కదా. యేమిటో చెప్పండి” అన్నది మార్జియానా. ! తెల్సును మార్జియానా ఆ నమ్మకంతోనే నిన్ను కలుసుకున్నాను. విషయం నీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అన్నాడు "మా కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నీమీద పెడుతున్నా ?” అన్నాడు మళ్ళీ.
“మీరు అంతగా చెప్పాల్నా ? చిన్నప్పటినుండి నేను కాశింగారింట్లోనే పెరిగినదాన్ని” చెప్పండి “అంది మార్జియానా.”
"అన్న కాశిం బంగారు నాణాల కోసం గాడిదల్ని తీసుకు బయల్దేరి నప్పటినుంచీ అన్నను చంపి శవంను వ్రేలాడదీసి తలను వ్రేలాడదీసినంతవరకూ వివరించాడు ఆలీబాబా.
వెళ్ళిన అన్న తిరిగిరాలేదని వదిన నన్ను చూసిరమ్మన్నది. నేను ఎప్పటి లాగే కట్టెలకు వెళ్ళినట్లుగా వెతుకుతున్నాను. అంతేకాదు ఆ గుహలో వున్నట్లు పసికట్టాను. యీ విషయం మా వదినకు ప్రస్తుతానికి తెలియనివ్వకూడదు. తెలిస్తే ఆమె గుండెలు పగిలి పడిపోతుంది. నీ మీద మరో బాధ్యతను పెడు తున్నాను. నువ్వు ఎలాగయినా మా వదినకు నచ్చచెప్పి ఆమె దుఖః మింగేలాగున ధైర్యంగా వుండేలాగున చేయాలి” అన్నాడు సమాధానంగా.
“అలాగే” అంది.
“మరో సంగతి మా అన్న యీవిధంగా చనిపోయాడు అన్న విషయం మనిద్దరిలోనే వుండాలి. యెవ్వరికీ తెలియకూడదు.” అన్నాడు. ఆ తదుపరి ఆలీబాబా కాశిం తల మొండెంలు వున్న సంచిని వుంచిన గాడిదను తోలుకుంటూ వెళ్ళింది మార్జీనియా. వెలవెల బోతున్న ఆలీబాబా మొహం చూడగానే కాశిం భార్యకు ఆందోళన అధికమైంది.” యేం మరిదీ ఏమైంది ? మీ అన్న కనిపించాడా వెంట తీసుకువచ్చావా ? యేడి” అంటూ దిక్కులు చూసింది కాశింభార్య.
ఆ సమయంలో మార్జియానా కల్పించుకొని కాశిం భార్యకు శతవిధాలా బోధించి ధైర్యం చెప్పింది.
“ఆ సంచి యేమిటి” అని అడిగింది ! గాడిదమీదున్న సంచిని చూస్తూ!
“అమ్మా మీ మరిది ఆలీబాబా అన్నగారి మీదున్న అభిమానం కొద్దీ మన అయ్యగారి కళేబరాన్ని సాహసించి తెచ్చారు. ప్రస్తుత సమయంలో మీ మరది చెప్పిన సలహాను పాటించడం అంరికీ మంచిది” అని అన్నది.
“అమ్మా దిక్కులు చూస్తూ” యేడవకండి మీరు ఏడిస్తే ఆ యేడుపు దొంగలకు వినబడితే ! కధ తెలిస్తే వాళ్ళు దుర్మార్గులు, కుటుంబం గురించి ఆరాతీస్తారు. పైగా మొండెను, తలనూ ఆలీబాబా తీసుకువచ్చారు కదా. అందరినీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. యీవిషయం తెలిస్తే” అంది మార్జియాని.
ఆలీబాబా కూడా కాశిం భార్యకు పలువిధాల చెప్పి శాంతపరిచాడు. యేమయినా మనం దుఃఖాన్ని దిగమింగాలి. అన్న చావును గురించి ఎవరికీ తెలియకూడదు ? నువ్వు జాగ్రత్తపడితే అందరం రక్షించబడతాం. లేదా అందర్నీ ఆ దొంగలు కైమాగా కొడతారు” అని అన్నాడు ఆలీబాబా.
కాశిం భార్యకు ఆలీబాబా మార్జియానాలు చెప్పింది నిజమనిపించింది. వాళ్ళు చెప్పినట్లే నడుచుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది.
మార్జియానా, ఆలీబాబా మనసులు కొంతవరకూ కుదుటపడినాయి.
“నాయనా ఆలీబాబా యేం చేస్తాను. యిదంతా నా తలరాతను కుంటాను ధనాశతో నేనే మీ అన్నచావుకి కారణం. అందుకే ఆయన్ని పోగొట్టు కున్నాను. ఇంకనువ్వుతప్ప నాకువేరేదిక్కులేరు. మా ఇంటి వ్యవహారాలు అన్ని నువ్వే చూడు. నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను” అందిభారంగా కాశింభార్య.
అనంతరం మార్జియానా ఆలీబాబాలు రహస్యం బయటపడకుండా వుండేందుకు వైద్యుని ఇంటినుండి వస్తున్నట్లుగా, అభినయించారు. ఇరుగు పొరుగు వాళ్ళకు యేదో కట్టు కధను వినిపించారు.
“కాశింకు యేదో జబ్బుచేసిందని, ఇరుగుపొరుగువారికే నమ్మకం కలిగేలా చెప్పారు.
ఎప్పుడు వ్యాపారం చేసుకునే కాశింకనబడకపోవడంతో 'యెందుకు కనబడటం లేదు' అని తెలిసినవాళ్ళు అడుగుతూనే వున్నారు.
“ఏదో గుండె జబ్బట! ప్రాణాలు తీసే జబ్బు అది. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. అంటూ కంట తడి పెట్టి చెప్పసాగారు ఆలీబాబా మార్జియానాలు.
0 comments: