Veta Vikram and Betal Story in Telugu Language : In this article, read వేట భేతాళ విక్రమార్క కథలు, "బేతాళ కథలు", "Veta Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
వేట భేతాళ విక్రమార్క కథలు Veta Vikram and Betal Story in Telugu
విక్రమార్కుని హయాంలో ఉజ్జయినీ నగరం ఉన్నత స్థితిలో వున్నది. మహారాజుగా విక్రమార్కుడు ధర్మం తప్పకుండా పాలించసాగాడు. తనే ప్రజలు, ప్రజలేతానుగా వాళ్ళను కాపాడుకుంటున్నాడు. వారిపాలనలో విద్యావంతుల్ని, కళాకారులను, పండితులను, కవులను ఆదరించేవాడు. వారి ఆశీస్సులను స్వీకరించేవాడు.
ప్రజలు ఈ విక్రమార్కుని రెండో ఇంద్రుడని అనుకున్నారు ! వారిపాల .. నలో సుఖశాంతులతో వుంటూ ఆర్థిక అపజయం వుండకుండా వుండేవారు.
ఒక రోజున విక్రమార్కుడు విద్యావంతులను, భట్టిని, నేర్పరులు అయిన వేటగాండ్రతోను అడవికి బయల్దేరి వెళ్ళాడు. కౄరమృగాలు ఉజ్జయినీ నగరం పరిసరాల్లోనే అధికంగా తిరుగుతుండేవి ! వీరు వేటకు బయల్దేరడానికి బలమైన కారణముంది. నగర పరిసరాల్లో తిరుగుతూన్న మృగాలకు ప్రజలు భయపడి పోతున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ! వారి బాధను నివారించేటందుకు వేటకు బయల్దేరాడు విక్రమాదిత్యుడు. కౄరమృగాలను వేటాడారు. తమప్రజలకు మాత్రమే కాకుండా అడవుల్లో నివసించుచున్న కోయ వాళ్ళకూ,గిరిజనులకూ స్వేచ్ఛగా జీవించే అవకాశంకలిగించారు. ప్రజలకు మృగ బాధనులేకుండానివారించిన విక్రమార్కుని అందరూఎంతగానో ప్రశంసించారు.
0 comments: