విక్రమార్క భేతాళుని రెండవ కథ : Read King Vikramaditya and Betal Second Story in Telugu , బేతాళ కథలు, Vikramarka Bethala Kathalu Telugu for Kids.
విక్రమార్క భేతాళుని రెండవ కథ : In this article, read King Vikramaditya and Betal Second Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుని రెండవ కథ Vikramarka Bethala Rendava Kathalu Telugu
సత్యవంతుడు అనబడే రైతు అవంతీపట్టణమున వుండేవాడు. అతనికి 'నా' అన్నవారెవరూ లేరు. కొద్దిపాటి పొలం మాత్రం వుంది. అతనికి దాని సేద్యం ఇతరులకు ఇవ్వకుండా తానే చేసుకుంటూ ఆ వచ్చిన దానితో రోజులు గడుపుతున్నాడు. సత్యవంతునికి తల్లిదండ్రులు లేరు. బంధువులు ఎవ్వరూ పట్టించుకోరు. అందువల్ల అతనికి పెండ్లి అవలేదు. అయినప్పటికీ అతనికి పెళ్ళాడి అందరి మాదిరే సంసారం చేసుకోవాలన్న తలంపు వుండేది. ఆ ఒంటరి వాడికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అందువలనే అతని కోరిక తీరలేదు. ఆ కోరికను తీర్చుకునేందుకు అతను ఆలోచిస్తున్నాడు. ఇలా కొంత కాలం గడిచింది. ఆ యేడాది తమ ప్రక్క గ్రామమైన షిష్టలాపురంలో అమ్మవారి జాతర జరిగింది. అప్పుడు ఈ సత్యవంతుడు అమ్మవారు అయిన కాళికామాత ఉత్సవానికి తరలి వెళ్ళాడు. యేటా అతను ఉత్సవానికి పోతూంటాడు. అతను జాతరను చూస్తున్న సమయంలో ఒకచోట అతనికి ఒక కన్య కనబడింది. ఆమె అందం సత్యవంతునకు ఎంతగానో నచ్చింది. ఆ కన్య కూడా సత్యవంతుని ఎంతగానో అభినందించింది. ఇది పసికట్టాడు అతను.
ఆ కన్య వెళ్ళిపోతుంటే సత్యవంతుడు తనకు తెలియకుండానే ఆమె మీదవున్న ద్యాసతో వెంబడించి ఆమె నివాసమును తెలుసుకున్నాడు.
ఆమెను భార్యగా పొందాలన్న తలంపుతో వున్న సత్యవంతుడు ఆ రాత్రి కాళికాదేవి ఆలయానికి వెళ్ళి ఆ దేవి దర్శనాన్ని చేసుకున్నాడు. .
"తల్లీ! నీవు ఎంతగా ఉగ్రరూపం దరిస్తావో అంతకంత శాంతస్వరూ పిణివి కూడా నేను ఒక కన్యను ప్రేమించాను భార్యగా చేసుకోవాలనే తలంపు కలిగింది. ఆమెను నాకు భార్యగా చేసిన నీకు నా తలను కానుకగా యిస్తాను” అని మ్రొక్కుకొని వెళ్ళిపోయాడు.
అనంతరం తన మిత్రులను ఆమె ఇంటికి పంపాడు. ఆమె తల్లి దండ్రులను కల్సుకొని ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని చెప్పమన్నాడు. వారు అలాగే వెళ్ళి సత్యవంతుని కోరికను ఆమె తండ్రుల తెలియపరిచారు.
ఆమె తండ్రి ఆనందించాడు! తన కుమార్తెను సత్యవంతునికిచ్చి పెండ్లి చేయడానికి అంగీకరించాడు. వారి వివాహము త్వరితంగానే ముగిసింది. ఆ కన్య భర్త సత్యవంతునితో సంసారం సాగించుతోంది. ఒకసారి సత్యవంతుడు అత్తవారింటికి వెళ్ళాడు. అయితే కాళికకు ఇచ్చిన మాటను మర్చిపోయాడు. అక్కడ మర్యాదలను అందుకున్నాడు. బావమరిది వీరధవళునితో షికారుకు బయల్దేరాడు. ఆ ఇద్దరూ కాళికాలయానికి చేరారు. ఆలయం చూడగానే కాళికాదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. 'ఎంత అపచారం. అనుకున్నాడు లోలోన' బావమరిది వీరధవళునితో కాళికాదేవిని దర్శించి వస్తానని వెళ్ళాడు. వీరధవళుడు అంగీకరించి అక్కడున్న బండమీద కూర్చుని వున్నాడు. సత్య వంతుడు లోనికి వెళ్ళి కాళికాదేవికి నమస్కరించాడు. తన అపరాధాన్ని మన్నించ మని కోరుతూ ఆలయం ప్రక్కనే దిమ్మ మీద వున్న కత్తిని తీసుకొని తలను నరుక్కున్నాడు. తల వెళ్ళి కాళికాదేవి పాదాలముందు పడింది.
ఎంత సేపు ఎదురు చూసినా బావగారు రానందున వీరధవళుడు యేమైందో చూసి రావడం కొరకు ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన దృశ్యంను చూసాడు. వేరువేరుగా పడివున్న బావ సత్యవంతుని మొండెంను తలను చూసాడు. చాలా బాధ పడ్డాడు. ఇంటికి వెళ్ళి ఆ దుర్వార్త తనవాళ్ళకు
యేమని చెప్పాలి? “అని బాధపడ్డాడు. అంతేగాక చెల్లెలు సుశీలకు తన మొహం చూపడానికి ఇష్టం లేకపోయింది. వెంటనే అక్కడ రక్తంతో తడిసి పడి వున్న కతిని తీసి తన బావమరిది లేకుండా తను ఇంటికి వెళ్ళలేక. తన వాళ్ళకు తన మొహంను చూపక తనను అనుగ్రహించమని తలను నరుక్కున్నాడు.
ఈవార్త భార్యకు సత్యవంతుని అత్తమామలకు తెలిసింది. సుశీల ఘోడు ఘోడున యేడుస్తూ ఆలయానికి పరుగెత్తుకొచ్చింది. ఆమెతోనే తల్లి దండ్రులూ వచ్చారు. సుశీల వలవల యేడుస్తూ మహాకాళికి నమస్కరించింది.” అమ్మా! యేమిటి దురంతం! నా భర్త లేని బ్రతుకు నాకెందుకు నేను ఎండిన మోడు మాదిరి ఏవిధంగా బ్రతుకు సాగించను? నేను దుర్భరమైన జీవితంను భరించ లేను. నేను నీకు బలిఅవుతాను. అక్కడ పడివున్న ఖడ్గంను తీసుకుని తలను నరుక్కోబోయింది సుశీల. అప్పుడు కాళీ ప్రత్యక్షమై ఆమెను శాంతించమన్నది. “అమ్మాయీ! నీ పాతివ్రత్యానికి మెచ్చాను. నీ భర్తను సోదరుడుని బ్రతికిస్తాను. ఆ కమండలంలోని నీరు తీసుకుని వాళ్ళ శిరస్సు మొండాలపై చల్లు వాళ్ళు సజీవులు అవుతారని చెప్పింది.
సుశీల ఆనందించింది. దేవి చెప్పినట్లు కమండలంలోని నీళ్ళను చల్లింది. ఆ తక్షణం భర్త, అన్నలు నిద్రనుంచి లేచినట్లు లేచారు. ఆ తక్షణం వారు దేవిని స్తుతించి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయారు. " ఇదీ కథ! రాకుమారా! ఇప్పుడు చెప్పు! బావబావమరుదులా? సత్యవంతుని భర్యయా? యెవరు చేసిన త్యాగం విలువైనది?” అని అడిగాడు భేతాళుడు.
“భేతాళా! సత్యవంతుడు దేవికి ఇచ్చిన మాటను నిలుపుకున్నాడు. అతని భార్య భర్తలేని తను బ్రతకడం అనవసరమని చనిపోబోయింది. అయితే సత్యవంతుని బావ మరిది వీరధవళుని త్యాగం గొప్పది! అతనిలోని మంచిగుణం త్యాగానికి విలువ తెచ్చింది” అని చెప్పాడు విక్రమార్కుడు.
అమరుఘడియలో భేతాళుడు భుజం మీదనుండి ఒక్క ఎగురున వెళ్ళి మర్రిచెట్టు కొమ్మకు ఎప్పటి మాదిరే వ్రేలాడుతున్నాడు!
విక్రమార్కుడు చింతించలేదు! తను మళ్ళీ వెనక్కువెళ్ళి చెట్టుమీద వున్న భేతాళశవాన్ని దింపి భుజం మీదవేసుకునిసన్యాసినివాసానికి బయల్దేరి వెళుతున్నాడు.
'విక్రమార్క భూపాలా! నీ వలన నా సందేహాలకు సమాధానం వస్తున్నది' ఇప్పుడు మరో కథను చెబుతాను విను.” అని అన్నాడు భేతాళుడు.
COMMENTS