Alibaba and 40 Thieves Story in Telugu Language : In this article we are providing ఆలీబాబా 40 దొంగలు కథ, Ali Baba 40 Dongalu Telugu Story for Kids.
Alibaba and 40 Thieves Story in Telugu Language : In this article we are providing "ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and 40 Thieves Story in Telugu
ఇది చాలా యేళ్ళనాటి కథ.
పర్షియా దేశంలోని పట్టణం అది. అవడానికి పట్టణమైనా పల్లెటూరి మాదిరి వుంటుంది. ఆ ఊరిలోని తోళ్ళు విక్రయిస్తూ వ్యాపారం సాగించుకుంటూ కాలం గడుపుతున్నాడు మహమ్మదీయు బే4నేవాడు. అతనికి ఆలీబాబా అని కాశిం అని ఇద్దరు మగపిల్లలున్నారు. ఆ ఇద్దరిలోనూ కాశిం పెద్దవాడు స్వార్థపరుడు.
బేగ్ వృద్దుడు అవడంతో తను సంపాదించిన ఆస్థిలో ఖర్చు పెట్టిందిపోగా మిగిలింది కొడుకులు యిద్దరికీ సమంగా పంచి కన్నుమూశాడు.
ఒకే తల్లి కడుపున పుట్టి పెరిగినవారు అయినా పిల్లలు మనస్తత్వాలు భిన్నంగా వున్నాయి.
కాశిం స్వార్థపరుడు. ఇంట్లోని అవసరాలకే ఆచితూచి ఖర్చు పెడుతుండే వాడు. . పిల్లికి అయినా నాలుగు మెతుకులు రాల్చని ఘనుడు. యెంత సేపూ తను తన కుటుంబం.
అయితే కాశింపలుకుబడి పెరిగింది. తండ్రి యిచ్చిన ఆస్తికి రెట్టింపు సంపాదించుకున్నాడు. ధనదాహం ఎక్కువ. తండ్రి వుండగానే కాశిం సంపాదన బుద్ధి కుశలతనీ చూసి మామగారు తమ కుమార్తెను యిచ్చి వివాహం చేశాడు. కూతురుతో బాటు కొంత ఆస్తినీ కట్టబెట్టాడు.
కాశిం మామగారు కూడా ధనికుడే. అతని కుమార్తెకు కూడా ధనవంతులు బిడ్డనన్న హజం వుండేది. రూపవతి. తనముందు ఎవ్వరూ నిలవలే రన్న గర్విష్టి. ఇతరులు పచ్చగా వుంటే సహించలేని మనస్తత్వం ఆమెది.
రెండోవాడు ఆలీబాబా అన్నగారి మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. ఎదుటివాడు కష్టపడితే చూడలేనివాడు తనకున్నంతలో సహాయపడే తత్వం. అందరూ బాగుండాలన్న ఆశయం అతనిది. అన్న కాశిం అంటే ఎంతో ప్రేమ, అభిమానం. ఆ అన్నకు మాత్రం యీ తమ్ముడు అంటే ప్రేమ, అభిమానం ఆలీబాబాకు లేదు తనకున్నంతలోనే తృప్తిపడేతత్వం.
తండ్రి మరణించినా తల్లిని కాశిం చిన్న చూపుచూడటంతో తమ పోషణలోనే వుంచుకున్నాడు ఆలీబాబా.
ఆలీబాబాకు కూడా పెళ్ళయింది. ఒక పేదింటి పిల్లను పెళ్ళాడాడు. ఆమె కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నది. భర్తంటే ప్రేమ అభిమానం. ఎదుటవారిని చూసి, వాళ్ళ అవస్థలు చూసి తమకున్నదాంట్లోనే అంతో యింతో సహాయపడే గుణం ఆలీబాబా భార్యది. అన్న కాశింలాగా మాయలు మర్మాలూ చేతకానివాడు. వున్నదాంట్లోనే ఆలూమగలు తృప్తిగా కాలం గడుపుతున్నారు.
కాశిం తమ్ముడు ఏ విధంగా బ్రతుకున్నాడు. అనేది యేనాడు ఆలోచించ లేదు. అన్నగారికి అంత ఆస్తి వున్నదే అని ఆలీబాబా దంపతులు యేనాడు ఆసూయపడలేదు.
కాశిం భార్యకు మరది ఆలీబాబా అన్నా అతని భార్య అన్నా పడేది కాదు. కారణం తాము వున్న వాళ్ళమనే హజం. ఆలీబాబా పేదవాడనేచులకన. యింతకుమించి అన్నదమ్ముల మధ్య యే విరోధము లేదు. కాశిం అతని భార్య తమ్ముడు అతని భార్యతో మాట్లాడేవాళ్ళు కాదు. చూసినా చూడనట్లుండేవాడు. అన్నదమ్ములు యిద్దరి ఇళ్ళూ ఒకే వీధిలో వున్నాయి. అదే వీధిలో వారి ఇళ్ళ మధ్యన పదిళ్ళుమాత్రమే ఇతరులవి వున్నాయి.
ధనార్జనను నమ్ముకున్నాడు కాశిం. అల్లాను నమ్ముకున్నాడు ఆలీబాబా.
కొంతకాలానికి ఆలీబాబాకు కొడుకు పుట్టాడు. వాడికి పాలు యిచ్చేం దుకు తల్లికి పాలుతక్కువ, డబ్బాపాలుపోయడంతప్ప వేరేదారిలేదు. ఆడబ్బా పాలుకొనేందుకు డబ్బులేదు. యెవరినీ చెయ్యిచాచి అడగలేని మనస్తత్వం. అలాగే కాలం గడుపుతున్నారు.
కుటుంబం దరిద్రంతో బాధపడుతోంది. అందుకని ఆలీబాబా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకువచ్చి వీధుల్లో అమ్ముకొని వేడినీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లు గడుపుతూ వుండేవాడు. మంచికి చెడుకీ, కష్టానికి సుఖానికి అన్నిటికి అల్లా నే నమ్ముకున్నాడు కట్టెలు మోసుకురావడానికి ఒక గాడిద మాత్రం వుంది. అన్నది స్వంత ఇల్లు ఆలీబాబాది అద్దె యిల్లు అదీ పూరిల్లు.
COMMENTS