Princess Kantimati Story in Telugu Language : In this article read "రాకుమార్తె కాంతిమతి కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
Princess Kantimati Story in Telugu Language : In this article read "రాకుమార్తె కాంతిమతి కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.
రాకుమార్తె కాంతిమతి కథ Princess Kantimati Story in Telugu
రాకుమార్తె కాంతిమతియొక్క అభిప్రాయిన్ని తెలుసుకొన్నచెలికత్తె రహస్యంగా అదృష్టదీపుని వెంటాడింది. ఆతని అందచందాలను, గుణగణాలను తెలుసుకొంది. కాంతిమతికి తగినవాడని నిర్ధారించుకొంది. తిరిగివచ్చి “రాకుమారి! అతడెంత అందముగా ఉన్నాడనుకొన్నావు. చంద్రబింబములాంటి ఆయన ముఖవర్చస్సును ఎంతసేపు చూసినా తనివితీరదమ్మా ! పైగా సద్గుణ సంపన్నుడు దయాదాక్షిణ్యాలు కలిగిన ధర్మప్రభువు. ఆతడెవరోకాని జగదేకవీరుడై ఉండాలి. అతడు మారు వేషంలో తిరుగుతున్న ప్రఖ్యాత పురుషడేనమ్మా ! అని చెప్పింది.
కాంతిమతికి అతన్ని చూడాలనే ఉబలాటం పెరిగి “అతన్నెలాగైనా నాకు చూపవే! కనీసం ఆతని చిత్తరువునన్నా చూపెట్టవే” అంది అంతట చెలికత్తె ఉండమ్మా! ఆతని చిత్రానైనా చిత్రించి తీసుకువస్తాననిచెప్పి అదృష్టదీపునెట్లో ఒప్పించి అతని చిత్తరువును గీసితెచ్చి కాంతిమతికి చూపించింది. కాంతిమతి అతని సౌందర్యానికి అచ్చెరుఒందింది. ఇంతటి జగదేకసౌందర్యవంతుడుంటాడా అనుకొంది. ఇంతలో చెలికత్తె “రాకుమారీ ! సందేహం వలదు. అంతటి సౌందర్యవంతుడున్నాడు. నీ కాతనిని చూపించే అవకాశం కల్పిస్తాను” అంటూ అక్కడ నుంచి నిష్క్రమించింది.
చెలికత్తెసరాసరి అదృష్టదీపునివద్దకుపోయి “ఓ సుందరాంగా ! నీ చిత్తరువును మారాకుమార్తె చూసి ఇంతటి సుందరాంగుడుండడని నాతో పందెం కాసింది. నేనుంటా డని, ఇప్పుడే తీసుకువచ్చి చూపుతానని పదివేలవరహాలకు పందేంకాసాను. కావున నాయందు దయవుంచి మీరొక్క మారువస్తే” ఆమెకు కనపడితే, నేను పదివేల వరహాల పందేంగెలుస్తాను. ఆ పదివేలవరహాలు మీరిచ్చినట్లే స్వీకరిస్తాను. అంటూ రాకుమార్తె చిత్తరువును కూడా తెచ్చి అదృష్టదీపునికి చూపింది.
కాంతిమతి సౌందర్యానికి అదృష్టదీపుడు ముగుడై పోయాడు. చెలికత్తెవారిరువరు కలుసుకొనేందుకు అవకాశాలుకల్పించసాగింది. కాంతిమతి అదృష్టదీపులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొని గాంధర్వ వివాహం కూడా చేసు కొన్నారు. విదర్భదేశరాజుకు అంతరంగికుల ద్వారా ఈ విషయం తెలిసింది. “కాంతిమతీ! నీవు హద్దులు మీరుతున్నావు. నీవింక అంతఃపురమును విడిచి వెళ్ళరాదు. అంటూ కఠిన నిబంధనలతో ఆంక్షలు విధించాడు. అప్పటికే కాంతిమతి.
COMMENTS