Pogaru Anigindi King Vikramaditya Story in Telugu Language : In this article, పొగరు అణిగింది తెలుగు కథ. Bhatti Vikramarka Kathalu in Telugu for kids.
Pogaru Anigindi King Vikramaditya Story in Telugu Language : In this article, we are providing "పొగరు అణిగింది తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Pogaru Anigindi King Vikramaditya Story in Telugu Language
విక్రమార్కుడు దేశపర్యటన సాగించుతూ వెడుతున్న సమయంలో మార్గ మధ్యంలోని ఒక దేశంలో ఒక వింత జరిగింది. గుర్రంను ఆపి ఆ వింతను చూస్తున్నాడు.
ఆ రాజ్యంలో మహారాజు ఉంపుడు కత్తి విలాసవతి.. ఆమె బహు చక్కనిది. ఆమె నిలువెల్లా గర్వంతోనిండివుంది. రోజూ ఆమె కలలుకంటుంది. కలలో కంటపడినవారి వద్ద వెయ్యివరహాలు వసూలు చేస్తూంటుంది. ఇది చాలాకాలంగా జరుగుతున్న పని. .
అదే విధంగా ఒకనాటి రాత్రి కలకన్నది కలలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు కంటపడ్డాడు. ఆమరుసటి దినం భటుట్ని పంపి ఆ బ్రాహ్మణుని వద్ద వెయ్యి వరహాలను పట్టుకురమ్మన్నది. భటులు వెళ్ళారు.
ఆ బ్రాహ్మణుడు నిత్యం భోజన సదుపాయానికి డబ్బులు వెత్తుక్కునేటంత పేదవాడు. భటులు వెళ్ళి అతన్ని అడిగారు. బ్రాహ్మణుడు తన స్థితిని వివరిం చాడు. భటులు ఒప్పుకోలేదు. ఆ బ్రాహ్మణుని విలాసవతి దగ్గరకు రమ్మని యీడ్చుకు వెడుతున్నారు.
దారిలో తటస్తపడిన విక్రమార్కుడు యీ విషయం విన్నాడు. భటులను ఆపి బ్రాహ్మణుని అడగ్గా విలాసవతి చేస్తున్న పనిని గురించి వివరించాడు.
పరిస్థితి బోధపడిన విక్రమాధిత్యుడు భటులను ఉద్దేశించి బ్రహ్మణుడిని వదలమన్నాడు. భటులు “మరి వెయ్యివరహాల సంగతి” అని అడిగారు.
"పేద బ్రాహ్మణుడు ఆయన ఎక్కడినుండి తెస్తాడు ? ఆ డబ్బు నేనిస్తాను. ఆ విలాసవతిని వచ్చి తీసుకువెళ్ళమనండి” అన్నాడు.
భటులు వెంటనే బ్రాహ్మణుడుని వదలి వెళ్ళారు.
బ్రాహ్మణుడు సంతోషంతో మారువేషంలో వున్న విక్రమార్కునకు నమస్కరించి వెళ్ళిపోయారు.
విక్రమాధిత్యుడు ఆ రాత్రి బ్రాహ్మణుని ఇంటి ముందు స్థంభం పాతించాడు. వేయి వరహాలు మూటకట్టి ఆ స్థంభంనకు పైన చివరిభాగంలో కట్టించాడు. స్థంభం క్రింద పెద్ద అద్దంను అమర్చాడు. విలాసవతి రాకకోసం నిరీక్షించాడు. తెల్లవారేసరికి జనంగుమిగూడారు.
విలాసవతి వచ్చింది. “యేది నా డబ్బు” అని బ్రాహ్మణుని అడిగింది.
బ్రాహ్మణుడు విక్రమాధిత్యుని చూశాడు.
“అదిగో” అంటూ అద్దంలో చూపించాడు.
“అది నీకోసమే వుంచాను నువ్వు తీసుకువెళ్ళు” అన్నాడు.
“అద్దంలో కనపడే డబ్బును ఏ విధంగా తీసుకోవాలి” అడిగింది విలాసవతి.
“అది నాకెలా తెలుస్తుంది” అన్నాడు విక్రమాధిత్యుడు.
ఆమెకు జవాబు చెప్పేటందుకు నోరు పెగలలేదు. దిక్కులు చూస్తున్నది. “మోసం” అని గొణిగింది.
“మోసానికి మోసమే విరుగుడు మంచి చెడూ లేకుండా గర్విష్టి అయి అయాచితంగా డబ్బు సంపాదించేందుకునువ్వు సిద్ధమై ప్రజల్ని యీ విధంగా పీడిస్తున్నావు! యేకారణం లేకుండా నీకు డబ్బుయివ్వాలా అందుచేత అతను ఈ విధంగా యేర్పాటు చేశాడు. చేతనయితే అద్దంలో నుండి తీసుకో లేదా కిక్కురు మనకుండా తిరిగి వెళ్ళిపో” అన్నాడు మారువేషంలో వున్న విక్రమార్కుడు.
" నీ పేరు " తిరిగి అడిగాడు. విక్రమార్కుడు
“విలాసవతి” అంది.
“చూడు కలలో వచ్చిన బ్రాహ్మణుకు నీకు డబ్బు యివ్వాలి కదా ! అద్దంలో అమర్చాడు తీసుకో” అని రెట్టించాడు విక్రమాధిత్యుడు! విలాసవతి యేం చెప్పటానికి నోరు పెగలలేదు. సిగ్గుతో తలవంచేంసింది. అక్కడ వుండలేక ఎవ్వరికీ చెప్పకుండా గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.
విక్రమార్కుడు నవ్వుకుంటూ పైన కట్టిన వరహాల మూటను వూడతీసి బ్రాహ్మణునకు యిచ్చాడు. “పేదవాడివి. ఖర్చుపెట్టుకో” అని చెప్పాడు.
బ్రాహ్మణుడు తమరు ఎవరు అని అడిగాడు.
“ఉజ్జయినీ నగరరాజు విక్రమాధిత్యుడను” అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమాధిత్యుడు.
COMMENTS