Childhood Friend King Vikramaditya Story in Telugu Language: In this article బాల్య స్నేహితుడు తెలుగు కథ. "Balya Snehithudu Katha in Telugu" for kids.
Childhood Friend King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "బాల్య స్నేహితుడు తెలుగు కథ". "Balya Snehithudu Katha in Telugu" for kids and Students.
Childhood Friend King Vikramaditya Story in Telugu Language
విక్రమార్కుడు సింహాసనం అలంకరించి తీర్పు చెప్పిన మరుక్షణం మహా పండితుడు అనబడేవాడు సభలో ప్రవేశించాడు విక్రమార్కుని ఎదుట నిలబడి అతని యెంతగానో స్తుతించాడు.
సభికులు ఆనందించారు. విక్రమార్కుడు మిక్కిలి ఆనందభరితుడు అయినాడు.
“బ్రాహ్మణోత్తమా ? యింతకీ తమరు ఎవరు ?” అని ప్రశ్నించాడు విక్రమార్కుడు. . ,
విక్రమార్కా నన్ను మీరు మర్చిపోయి వుంటారు. నేను మీ చిన్ననాటి స్నేహితుడని చెప్పాడు.
తమ నామధేయం? ఆశ్చర్యంగా చూసి అడిగాడు విక్రమార్కుడు.
“నా పేరు చతురంగ తజ్జి” అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు.
“పేరు వింతగా విచిత్రంగా వున్నదే” అని అనుకుంటూ రెండు క్షణాలు ఆలోచించాడు విక్రమార్కుడు.
బ్రాహ్మణుడు సమాధానం ఇవ్వలేదు. చిరునవ్వుతో విక్రమాధిత్యుని చూస్తున్నాడు. విక్రమాధిత్యుని కళ్ళు అతనిని చూస్తున్నాయి. అంతలో తేరుకున్నాడు. విక్రమాధిత్యుడు. "అయ్యా! మీరు ఘటికులు మహా పండితులు” అన్నాడు.
“అని మీరు ఎలా తెలుసుకున్నారు.” బ్రాహ్మణుడు చతురంగ తజ్జి.
బాగుబాగు మీ పేరు చతురంగ తజ్జి మొత్తం అక్షరాలు కలిసి వుంటే చతురంగ ఈ నాలుగు అంగాలు వేదవేదాంగాలు అని తజ్జి అంటే తెలిసినవాడు అని అర్ధం. మీ పేరులో మొదటి అక్షరమును తొలగించితే మిగిలింది తురంగత అంటే అశ్వశాస్త్ర ప్రతిభ కలవాడు. తర్షి అనబడే రెండు అక్షరాలు తీసి అవతల పెడితె మిగిలింది రంగతజ్ఞ. అనగా రంగముల శాస్త్రముల యందు ప్రతిభావం తులు అని, గతజ్జి అనగా జ్యోతిష్యశాస్త్ర ప్రజ్ఞావంతుడు అని అందులో 'గ' తీసివేస్తే తజ్జి మిగులుతుంది. తజ్జికి కాలతత్వం కూలంకషంగా తెలిసినవాడని నీ పేరులోనే నీ ప్రతిభా విశేషాలు మొత్తం ఇమిడ్చి ఆ పేరును సార్ధకం చేసుకున్నావు అని చెప్పాడు విక్రమార్కుడు.
సంతోషం నేను దరిద్రుడను భుక్తికి లోటు గలవాడను. నన్ను పరీక్షించి నా దరిద్రాన్ని తొలగించు రాజా అని చేతులు జోడించి నమస్కరించాడు.
మిత్రమా ! నీ చమత్కారం ప్రశంసనీయం నిన్ను ఇంక వేరుగా పరీక్షించే పని ఏముంది ? అని చిరునవ్వుతో అన్నాడు. అదిఅలాఉంచగా నువ్వు నాబాల్య స్నేహితుడివి చాలా కాలానికి కలుసుకున్నాం. మనస్నేహం ఇలాగే ఉండాలి” అనిలేచి వెళ్ళి అతనిని ఘనంగా సత్కరించాడు. అంతేగాకుండ ఆరువేల వరహాలు బహూకరించాడు.
ఈ విధంగా ఆరు వేలు ఎందుకు బహుకరించాడు అనగా పేరులోని ఒక్కొక్క అక్షరానికి వెయ్యివరహాలు చొప్పున వరహాకు నాలుగు రూపాయలు మాత్రంగా స్వీకరించి ఆ బ్రాహ్మణుడు అనగా చతురంగ తజ్జి అమితానంద భరితుడు అయినాడు. విక్రమార్కుడు వెంటవుండి ప్రేమాభిమానాలతో సాగనం పగా వెళ్ళిపోయాడు. విక్రమాధిత్యుని చాకచక్కానికి సభికులు ఆనందభరితులు అయినారు.
COMMENTS