Friday, 28 May 2021

మంత్రి పదవి తెలుగు కథ Mantri Padavi Story in Telugu

Mantri Padavi Kasi Majili Story in Telugu Language : In this article read "మంత్రి పదవి తెలుగు కథ", "Kasi Majili Stories in Telugu" for kids and Students.

మంత్రి పదవి తెలుగు కథ Mantri Padavi Story in Telugu

మంత్రి పదవి పూర్వము వైశాలినగరములో వీరగుప్తుడనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి తెలివితేటలు కలవాడు. నేర్పరిబుద్ధిశాలి ఎంతటి అపాయాన్నైనా ఉపాయంతో ఎదుర్కొనగలధీశాలి అయితే ఆతడు సరైన ఉద్యోగములేక బాధపడుతుండేవాడు. తగిన ఉద్యోగంకోసం వెతుక్కుంటూ రాజధాని నగరంలో తిరుగుతుండేవాడు.

ఆ నగరాన్ని ధర్మాంగదుడనే రాజు పాలిస్తున్నాడు. కొన్నాళ్ళక్రితమే ఆతని వద్ద ఉండే మంత్రి మరణించాడు. మంత్రిపదవికోసం చాలామంది ప్రయత్నించ సాగారు. ఆ మంత్రి పదవిని తమకిమ్మని ఎందరో కోరారు. అయితే ధర్మాంగదుడు మంత్రిపదవి కోసం వచ్చినవారిని కొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తికరమైన సరైన సమాధానాలు ఇచ్చినవానికి మంత్రిపదవి నిద్దామనుకొన్నాడు. కాని వచ్చినవారె వ్వరూ సరైన సమాధానాలివ్వకపోవటంతో విసుగు చెందిన ధర్మాంగదుడు తన కోటగుమ్మంపై ఒక పెద్ద ప్రకటన పత్రికను వ్రేలాడదీయించాడు. రాజుగారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సరైన సమాధానాలిచ్చినవానికి మంత్రిపదవి ఇవ్వబడును. అని ప్రకటనసారాంశం. రాజు షరతులకు ఒప్పుకొని సరైనసమాధానాలు ఇవ్వలేక చాలా మంది అవమానపడి వెళ్ళిపోయేవారు. .

తగిన ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన వీరగుప్తునికి కోటగుమ్మంపై వ్రేలాడదీయబడిన ప్రకటన కనిపించింది. భలే మంచి అవకాశం అనుకున్నాడు. ఒక చీటి పై తనపేరు, ఊరు, చిరునామా వ్రాసి “రాజా ! మీ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వగలను నాకొక అవకాశం ఇవ్వండి అని వ్రాశి దానిని రాజు గారి వద్దకుపంపాడు. అప్పటికే రాజు అనేకమందినిపరీక్షచేయటం, వారువిఫలం చెంది వెనుదిరిగిపోవటంతో విసుగుచెంది, ఉద్యానవనంలో విశ్రమిస్తున్న రాజు! అయిష్టంగానే సరేలోపలికి పంపండి అని ఆజ్ఞాపించాడు.

వీరగుప్తుడు రాజ సభలో ప్రవేశించి రాజా ! మీ ప్రశ్నలకు సరైన సమా ధానాలు చెప్పి మిమ్ముమెప్పించిగలవాడను, అందరికీ వందనములు అంటూ తనకు చూపించిన ఆసనంపై ఆసీనుడయ్యాడు వీరగుప్తుని ధీర గంభీర వర్చస్సును, నడకను, ఆతని వినయవిధేయతలను పరిశీలించినరాజు ఎంతగానో సంతో షించాడు. తన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగిన వ్యక్తి ఈతడే ! వీరగుప్తడు అన్నివిధాలా మంత్రిపదవికి అర్హుడే” అనుకుంటూవీ రగుప్తా ! పన్నెండులో నాలుగుపోతే ఎంత? అని ప్రశ్నించాడు.

వీరగుప్తుడు వెంటనే “సున్న” అని జవాబిచ్చాడు.

సభలోనివారంతా ఒక్కసారిగా గొల్లున నవ్వసాగారు. రాజుగారే అతితేలికైన ప్రశ్న వేస్తే వీడేమిటి? పన్నెండులో నాలుగుపోతే సున్నాఅంటాడు. అని సభికులు ముచ్చటించుకోసాగారు. మంత్రిపదవికొచ్చిన వానినిఎవరైనా ఇంతతేలికైన ప్రశ్న వేస్తారా అనుకున్నారు. అయినను ఈబడుద్దాయి దానికి కూడాసరైన సమాధానం చెప్పలేక పోయాడు. మరి వీడెందుకొచ్చినట్లో అనుకుంటూ నవ్వుకోసాగారు. ఇలా అందరూ తలోక విధంగా అనుకొని నవ్వుకోసాగారు.

ఇంతలో ధర్మాంగదమహారాజు తన సింహాసనంపైనుండి లేచి, సభికుల నుద్దేశించి” సభికులారా! ఇంతకాలానికి నాకు తగిన మంత్రి ఈ వీరగుప్తుని రూపం లో వచ్చాడు ! శభాష్ వీరగుప్తా ! సరైన సమాధానమిచ్చి నన్ను సంతృప్తుని చేసావు. నీ అంతటి బుద్ది చతురత కలిగిన వారెవరూ నాకింత వరకూ తారసపడ లేదు. నీవు నాకెంతో నచ్చావు. నేడెంతో సుదినము రా! ఇదిగో ఈ మంత్రిత్వముద్రి కను తీసుకొనిమంత్రిపదవినలంకరించు.సభాసదులారా ! నేటి నుండి ఈ వీరగుప్తుడే మన ప్రధానమంత్రి” అంటూ అప్పటికప్పుడే వీరగుప్తునికి మంత్రిపదవినికట్టబెట్టాడు.

అంతవరకు విమర్శించుకొని నవ్వుకుంటున్నవారంతా ఒక్కసారిగా అవా క్కయిపోయారు. పరీక్షలుచేసి,చేసి రాజుగారికిమతేమైనా చలించలేదుగదా ! రాజెంత మూర్చుడు. పన్నెండులో నాలుగుపోతే సున్నా అవుతుందా ! ఇదేమి చోద్యం ఇంతకు ముందు ఎందరినో కఠినంగా పరీక్షించి, వారిని కాదనిపొమ్మన్నారు. మరి అతి తేలికయిన ప్రశ్నవేసి, దానికి కూడా సరైన సమాధానముచెప్పని ఈ వీరగుప్తుని మెచ్చు కొంటున్నారేమిటి? ఇంతతేలికయిన ప్రశ్నకుకూడా సరైన జవాబు చెప్పని ఈతనిని మంత్రిగాచెయ్యటం అన్యాయం, అక్రమం అంటూ “రాజా! సరైనజవాబివ్వని ఈతనిని మంత్రిగా చేయటంలోగల ఔచిత్యమేమిటో సెలవిస్తారా ? అని అడిగారు.

అంతట ధర్మాంగదుడు “సభికులారా ! వీరగుప్తుడు మంత్రిపదవికి ఎలా అర్హుడు? పన్నెండులో నాలుగుపోతే సున్నా ఎలాఅవుతుందని కదా మీ సందేహం! వినండి ! ఇదొక బుద్దిచతురతకు సంబందించిన ప్రశ్న. భౌతికంగా పన్నెండులో నాలుగుపోతే ఎనిమిది అని అందరికీ తెలుసు కాని నా అభిప్రాయంప్రకారం పన్నెండునెలల్లోను ముఖ్యమైన నాలుగు వర్షాకాలపునెలలుపోతే, అంటే వర్షాకాలమే లేకుంటే ఏం మిగులుతుంది అని అడిగాను. వర్షాలు పడకపోతే మన బ్రతుకంతా శూన్యమేగదా! నా ప్రశ్నకు అర్ధవంతమైన జవాబు చెప్పిన ఈ వీరగుప్తుడే మంత్రి పదవికి అర్హుడు. ఈతని బుద్ధికుశలత శ్లాఘనీయమైనది. వీరగుప్తుని, మంత్రిత్వంతో మనరాజ్యం సుభిక్షంగా ఉండగలదని నమ్ముతున్నాను.” అంటూ ముగించాడు.

అంతవరకు పలురకాల విమర్శలు చేసిన వారందరూ తమ తెలివితక్కువ తనానికి తలలుదించుకొన్నారు.

నాటినుండి వీరగుప్తుడు ఆ రాజ్యానికి ప్రధానమంత్రియై, సుభిక్షణంగా రాజ్యాన్ని పరిపాలింపజేసాడు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: