Alibaba and Forty Thieves Sixth Story in Telugu : In this article "కాలం తిరగబడింది ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
Alibaba and Forty Thieves Sixth Story in Telugu Language : In this article we are providing "కాలం తిరగబడింది ఆలీబాబా 40 దొంగలు కథ", "Ali Baba 40 Dongalu Telugu Story" for Kids.
కాలం తిరగబడింది ఆలీబాబా 40 దొంగలు కథ Alibaba and Forty Thieves Sixth Story in Telugu
ఆలీబాబా ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ఆలీబాబా భార్యకు నిద్రపట్టలేదు. ఆమెఆలోచనంతా బంగారు నగలమీదేవుంది. యెప్పుడు తెల్లవారు తుందా ఎప్పుడు తన భర్త నాణేలుతో పట్నం వెళ్ళి వస్తాడా అని ఆలోచిస్తుండగా ఆమెకు ఎప్పటికి నిద్ర పట్టిందో తెలియదు. నిద్రపట్టింది.
ఆ మర్నాడు ఉదయం ఆలీబాబా లేచాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. భార్య అంతక్రితమే లేచి వుండడంతో దాచిన బంగారు నాణేలులో కొన్ని తెచ్చి భర్తకు యిచ్చింది. భార్యతో చెప్పి అతను పట్నంకు వెళ్ళాడు. సంతలోకి వెళ్ళాడు. ఇంట్లోకి అవసరమైన సరుకులు దండిగా తీసుకున్నాడు. యెన్నో వింత బొమ్మలు రకరకాల వస్తువులు కొన్నాడు. పాత్ర సామానులూ కొన్నాడు. అవన్నీ బండి మీద వేసుకొని సాయంత్రానికి ఇల్లు చేరాడు.
ఆలీబాబా వుంటున్న ఇంటికి వెళ్ళాలంటే కాశిం ఇంటిముందునుంచే వెళ్ళాలి. బండినిండా సామాన్లు వేసుకొని ఆలీబాబా వెళ్ళడం కాశిం భార్య చూసింది. తుళ్ళిపడి కళ్ళార్పకుండా చూసింది. సామాన్ల బండి ముందుకు వెళ్ళినాక 'అమ్మోఅమ్మో ఆలీబాబా ఎక్కడో బంగారు గనిని కొల్లగొట్టుకు వాచ్చాడు. తమకన్నా అధికులు అయినారు! అనుకుంటూ యింట్లోకెళ్ళింది. అదే ఆలోచనలో వున్న ఆమెకు అన్నం తినబుద్దికాలేదు. యే పనీ చేయాలనిపించలేదు. భర్త కాశింకు యీ విషయం యెప్పుడు చెప్పాలాని తాపత్రయపడింది. వుండుండొక సారి భర్తరాక కోసం వీధిగుమ్మంలోకి వెళ్ళి ఎదురుతెన్నులు చూసింది. కంటి మీద కునుకు రావడంలేదు.
కాశిం ఇంటికివచ్చాడు. అప్పటికప్పుడే చెప్పాలనుకుంది. కానీ, తీరికగా చెప్పాలనుకుంది. భర్త స్నానం, భోజనం చేశాక తీరికగా వెళ్ళి అతని ప్రక్కమీద కూర్చుంది. “యేమయ్యా! యేం జరిగిందో తెలుసునా' అన్నది.
“నువ్వు చెప్తే కదా నాకు తెలియడానికి” అన్నాడు మామూలుగా.
“చెప్తాను వినండి” అంది. “నువ్వు చెప్పబోయేది నాకు తెల్సును. ఆ వివరం ముందే తెల్సింది నాకు. నా తమ్ముడు యిల్లుకకళకళ్ళాడుతూంది యీ రోజున సామాన్లు బోలెడు బండి మీద తెచ్చి యిల్లు నింపాడు. వాడి భార్య ధగ ధగ మెరిసే బట్టలు కట్టుకుంది” అన్నాడు కాశిం.
“నేను చెప్పకుండానే తెల్సుకున్నావే”
“ఇది ఊరులో చూసినవాళ్ళు చెప్పారు, నేనూ అటునుండి వస్తూ చూశాను” అని చెప్పాడు కాశిం.
అసలు విషయానికి వస్తే నిన్నటి వరకూ దరిద్రం అనుభవించిన మీ తమ్ముడు తెల్లవారేసరికి అంత ధనవంతుడు యే విధంగా అయ్యాడు? అ రహస్యం యేమిటి ? మనమూవున్నాం. మనకు బోలెడు డబ్బున్నది. ఆస్తి వుంది. యెన్నో వ్యాపారాలు చేస్తున్నారు మీరు. కానీ ఏం లాభం ? మీ తమ్ముడు కుంచాలతో బంగారంను కొలిచేటంత ధనవంతడు అయినాడు. మీ తమ్ముడు ముందు మనం దిగదూడుపే! మీ తమ్ముడు భార్యకూడా ఈక్షణం నుండి మనల్ని చులకనగా చూస్తుంది. మనమీద వాళ్ళకి చులకన భావం యేర్పడుతుంది. మనం అంటే వాళ్ళకి తేలిక భావన యేర్పడుతుంది. అన్నది భార్య.
“ఇప్పుడు నన్ను యేం చేయమంటావే?" అడిగాడు కాశిం. .
“యేం చేయాలి ? మంచిగా మెల్లగా వెళ్ళి మీ తమ్ముడుతో మాట్లాడండి. అంత ధనం వాళ్ళకు యే విధంగా వచ్చిందో తెల్చుకోండి. అతనికి మీరంటే గౌరవం వుంది. మనం మనం మాట్లాడుకోపోయినా అన్ననే గౌరవం వుంది. మీరు నోరు చేసుకొని అడిగితే చెప్తాడు. రోజూ అడవికి వెళ్ళి ఎండలో కట్టెలు తెస్తూంటాడు కదా ! అక్కడ యే లంకెబిందెలన్నా దొరికాయేమో అడగండి, కాక అల్లాయే వారికి అవసరమైన ధనం యిచ్చాడేమో అడగండి. తెలివిగా మీ తమ్ముడు నుండి అసలు విషయాన్ని రాబట్టండి. అతనంటే మీరు ప్రేమాభిమా నాలు చూపించి మాట్లాడితే అంతా చెప్తాడు. ఆ తదుపరి మీరు అడవికి వెళ్ళి మీ తమ్ముడు చేసిన పనే చేశారనుకొండి మనం కుంచంతో కొలిచే ధనం . సంపాదిస్తాము.” అంది.
కాశిం యేదో ఆలోచిస్తూ విన్నాడు. మగత నిద్రపడుతోంది. ఆమె కాశింను నిద్రపోనివ్వలేదు తనూ నిద్రపోలేదు. తెల్లవార్లూ నూరి పోస్తున్నది.
కాశింకు భార్య బోధన బాగా తలకు ఎక్కింది. సాధారణంగా తమ్ముడు అంటే ప్రేమాభినాలు లేని కాశింకు అతని అభివృద్ధికి మరీ ఈర్ష్వ చెందాడు. ఆలీబాబా తనకన్నా అధికంగా ఐశ్వర్యవంతుడు అయితే తనకూ తన భార్యకూ విలువ తగ్గిపోతుందని తలచాడు.
హఠాత్తుగా అంతటి ధనవంతుడు ఎలాగయ్యాడో, ఆ రహస్యం యేమిటో తమ్ముడుని అడిగి తెల్సుకోవాలన్న అభిప్రాయానికి వచ్చాడు కాశిం.
ఆ మర్నాడే కాశిం ఆలీబాబా యింటికి వెళ్ళాడు.
కాశింను చూసి ఆలీబాబా పొంగిపోయాడు. యెన్నడూ తన గడప తొక్కని అన్న ఆనాడు రావడంతో ఆశ్చర్యపడ్డాడు. మంచం వాల్చి కూర్చోమని చెప్పాడు. ఆలీబాబా భార్య కూడా బావగారి రాకకు మిక్కిలి ఆనందించింది. మంచినీళ్లు, టీ యిచ్చి మర్యాద చేసింది.
కాశిం ముందుగా తల్లి దగ్గరకు వెళ్ళి యోగక్షేమాలు తెల్సుకున్నాడు.
“బాగున్నావా అన్నయ్యా ? వదినగారు ఎలా వుంది ?” అని అడిగాడు అలిబాబా.
కాశిం తలూపాడు. తదుపరి వ్యాపారాలు బాగా సాగుతున్నాయని చెప్పాడు. అన్నీ బాగున్నట్లు చెప్పాడు కాశిం. పైకి ప్రేమాభిమానాలు చూపించుతూ అలిబాబాను క్షేమ సమాచారాలు అడిగాడు. ఆలీబాబా కూడా బాగున్నట్లు చెప్పాడు. తదుపరి” పనులఒత్తిడిలో నేను రాలేకపోతున్నాను. యీరోజున యేదో కొద్ది ఖాళీ దొరికితే వచ్చాను. నేను రాలేకపోయినా మీ యోగక్షేమాలు గురించి తెల్సుకుంటూనే వున్నాను. చేయడానికి చాలా వ్యాపారాలు చేస్తున్నాను. లాభ మేదీ సవ్యంగా సాగడం లేదు. సాగనందుకు అవస్థపడుతున్నాను. మొదలు పెట్టాక అవస్థపడకతప్పదుకదా ఊపిరాడనిపని. శ్రమఅధికం! ఫలితం తక్కువ! యిలావుంది నా పని.
“అవును మరి. కాలం మారిపోయింది. ప్రజలు తెలివిమీరి పోయారు. వెనకటి రోజులకీ యిప్పటికీ చాలాతేడా వుంది. యెవరి జాగ్రత్తలో వారుండాల్సిన కాలం యిది” అన్నాడు అమాయకుడు అయిన ఆలీబాబా.
అదేకదా ! నేను యిప్పుడు యిక్కడికి వచ్చిన కారణం కూడా అదే ! ఊరిలో దొంగల బాధ అధికంగా వుంది. అని అంతా చెప్పుకుంటున్నారు యీ సమయంలో నిన్ను జాగ్రత్తగా వుండమని హెచ్చరించిపోదామని వచ్చాను. అది సరే నువ్వుపట్టుకొచ్చిన బంగారం అదీ జాగ్రత్తగా రహస్యంగా దాచావుకదా! నువ్వు తెలివిహీనుడవని నీకు ఈ విషయం చెప్పాలనే వచ్చాను. యీ సందర్భంగా నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగావున్నా దెబ్బతిని తీరుతావు” కాశిం హితవు చెప్పాడు.
అన్న చెప్పినదానికి ఆలీబాబా ఆశ్చర్యపడ్డాడు. తనకు బంగారం దొరికిన సంగతి అన్నకు ఏ విధంగా తెల్సిందో అనుకున్నాడు. అదేమిటన్నా బంగారం యేమిటి ? నాకు అర్థమవలేదు. నాకు బంగారం దొరకడమా ? అన్నాడు అర్ధం” అవనట్లు చూసి. ఆ సమయంలో ఆలీబాబా మాట తడబడ్డాడు.
కాశిం అంతలోనే కోపగించుకున్నాడు. “యేరోయ్ యేమిటి నా దగ్గరే నాటకం ఆడుతున్నావ్” నాకు అంతా తెల్సునురా! నిన్న అమ్మ వచ్చి మా ఇంట్లో నుండి కుంచం తీసుకు వెళ్ళింది. ఎందుకూ నువ్వు తెచ్చిన బంగారం కొలచేటందుకే కదా? నీకు తెల్సునో లేదో కుంచం అడుగున చిల్లి పడింది. దానికి అడ్డుగా మైనం అంటించింది. మావదిన తీరా కుంచంలో చూస్తే మా ఆవిడ పెట్టిన మైనానాకి ఒక బంగారునాణెం అతుక్కుని ఉంది. మీ వదిన నాకు చెప్పించి యింతకన్నా ఎక్కువ సాక్ష్యంయింకేంకావాలిరా ? యింకనువ్వు లేదని బుకాయించకు. మొన్నటివరకు నీ ఇల్లు ఏ విధంగా ఉంది ? యీ రోజున యే విధంగా వుంది. అంత మార్పు ఈ ఒక్కరోజులో యెలా వచ్చిందంటావ్ అయినా అదంతా నాకు అనవసరం. నీకు బంగారం వస్తే ఎవరికి కావాలి రత్నాలు వస్తే ఎవరికి కావాలి. తమ్ముడివి తెలివిహీనుడవి అని యింతగా చెప్తున్నాను. బంగారం ఏ విధంగా దొరికిందో నాకైనా చెప్తే యేదో సాయపడదామని వచ్చాను. ఇష్టం వుంటేనే చెప్పు. లేకుంటే ఆ రహస్యం నాకుచెప్పకు. కాని ఒక్కవిషయం మాత్రం గుర్తుంచుకోరా. యీ విషయం దొంగలకు తెలిస్తే మాత్రం నిన్ను చంపి బంగార మును పట్టుకుపోతారన్నాడు ! బెదిరిస్తున్నట్లుగా చూపి కాశిం.
దొంగలు అనే మాట వినబడటంతో ఆలీబాబాగుండె గుభేలుమంది. అన్నకు అంతా తెలిసిపోయింది. యీస్థితిలో అన్నకాశింకుచెప్పేయడమే మంచిదని తలచాడు. కాదు అన్నయ్యా! జరిగింది నీకుగాక వేరేవరికి చెప్తాను ? నీవు అడగక పోయినా రేపోమాపో నీకు చెబ్దామనే అనుకున్నాను. మనం ఒకరికొకరు సాయ పడాలి. వేరేవరన్నా వచ్చి మనకుసాయం చేయరుకదా ! అని తను కట్టెలు కొట్టుకునేందుకు అడవికి వెళ్ళింది మొదలు తన బండిమీద సరుకు వేసుకుని వచ్చేవరకూ జరిగింది అక్షరం విడవకుండా విశదీకరించాడు ఆలీబాబా.
తలుపు తెర్చుకునేందుకు పలికిన మంత్రం మూసుకునేందుకు పలికిన మంత్రం ఒకసారి రెండుసార్లు అడిగి తెల్సుకున్నాడు. ఆ రెండు మాటల్ని నెమరు వేసుకుంటూ యింటికి వెళ్ళాడు కాశిం.
COMMENTS