Jolly Gunde King Vikramaditya Story in Telugu Language: In this article, "జాలి గుండె తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids.
Jolly Gunde King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "జాలి గుండె తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Jolly Gunde Story in Telugu జాలి గుండె తెలుగు కథ
వంగ దేశంనుండి ఒకభట్రాజు వచ్చాడు ఆయన వస్తూనే విక్రమార్కునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. “ఎవరు నువ్వు ? ఎందుకొచ్చావ్” అని అడిగాడు అర్ధమవనట్లు చూస్తూ రాజు విక్రమాధిత్యుడు.
"అయ్యా ! మా దేశం మహారాజు యెంతో ఉదారస్వభావం కలిగినవాడు మమ్మల్ని మహారాజు ఆయనే పోషిస్తూండేవారు. ఆయన వంటి జాలిగుండె కలవారు మాకు తెలిసినంతవరకూ ఎక్కడా లేరు.
ఆయన తమ కుమార్తెకు వివాహం చేయుటకు నిర్ణయించాడు. అప్పుడు మేము వెళ్ళి రాజుగారికి మా గురించి చెప్పుకున్నాము. నూతన వధూవరులను పొగిడాము. ఆ సమయములో ఆయన అనుగ్రహించి మా భట్రాజులకు పది లక్షల వరహాలు పంచి పెట్టాడు. మేము దురదృష్టవంతులం అవడంతో ఆ రోజు అకాల మరణానికి అయిన గురయ్యారు. దానితో మా బ్రతుకులు భారం అయినవి. ఉదార స్వభావము కలిగిన పెద్దలను ఆశ్రయించి రోజులు గడుపు కోలేక చాలీ చాలని వాడితో కాలం గడుపుతున్నాం. ప్రస్తుత కాలంలో మాకు వేరే దారి లేదు. బ్రతుకే భారం అయింది.
“ఆ రాజు పేరు” ఏమని విక్రమాధిత్యుడు అడిగాడు.
“జయశేనుడు” అని చెప్పాడు.
అయితే నా వద్దకు ఎందుకు వచ్చావు. అర్ధంకానట్లు చూశాడు. విక్రమాధిత్యుడు.
మీ కీర్తిని మీలో వున్న ఉదారస్వభావాన్ని గురించి తెలుసుకున్నారు మాభట్రాజులు. అందరూ తమను చూడటానికి వచ్చారు. అని చెప్పాడు. భట్రాజు
విక్రమాధిత్యుడు జాలిపడ్డాడు. అతనికి భట్రాజుల పోషణ నిమిత్తం ధనం ఇచ్చి పంపేశాడు. అంతే కాదు తదుపరి అవసరం వున్నప్పుడు వచ్చి ధనం తీసుకుంటూ కాలం గడుపుతున్నారు.
భట్రాజులు ఆనందంతో మరొకసారి విక్రమాధిత్యునకు చేతులు జోడించి నమస్కరించారు. "అయ్యా! తమ వంటి జాలి గుణశేఖరులు ఉండబట్టే మా వంటివారు బ్రతుకుతున్నాం” అన్నారు భట్రాజులు
COMMENTS