విక్రమార్క భేతాళుడు చెప్పిన తొమ్మిదవ కథ : Read Vikram Betal Ninth Story in Telugu Language, బేతాళ కథలు, Vikramarka Bethala Kathalu Telugu for Kids.
విక్రమార్క భేతాళుడు చెప్పిన తొమ్మిదవ కథ : In this article, read Vikram Betal Ninth Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విక్రమార్క భేతాళుడు చెప్పిన తొమ్మిదవ కథ Vikram Betal Ninth Story in Telugu Language
ఆకాలంలో రాజస్రవుడు అనబడే ఋషివుండేవాడు. అతను కలనైనా అబద్దముచెప్పియెరుగడు. అతనికి సచికేతుడు అనే కొడుకున్నాడు. అన్ని విద్యల యందూ అఖండమైన కీర్తి గడించాడు. తండ్రే అతనికి గురువుగా విద్యాబోధనలు చేశాడు.
రాజస్రవుడు ఒక సమయం నందు విశ్వచిత్త అనే యాగంను చేయ నిశ్చయించుకున్నాడు. ఆయాగం చేయదలచినవారు తన సర్వస్వం యితరులకు దానం చేయాలి. చేయకుంటే యాగఫలం దక్కదు, మోక్షం లభించదు.
అతను దానం చేస్తున్న సమయంలో మంచి వస్తువులు తన కుమారు నకు వుంచుతూ, మిగిలినవి దానం చేస్తున్నాడు. గోవులలో కూడా సంవృద్ధిగా పాలు యిచ్చునవి కుమారుడికి వుంచి మిగతావి దానం చేశాడు.
తండ్రి చేస్తున్న దానములు చూసి కుమారుడు సచికేతుడు విచారించాడు. 'తన కోసం తన తండ్రి దానం చేయడంలో స్వార్ధం చూపుతున్నాడు. ఆయనకు సద్గతి లభించదే అని విచారించుచూ! బాధపడి తన తండ్రి వద్దకు వెళ్ళి అతను చూపించుతున్న స్వార్ధంను విశదీకరించి అది తప్పనిచెప్పాడు. అంతేగాకుండా తన మీదున్న మమకారంను విడిచి సర్వస్వం దానం చేయమన్నాడు.
తండ్రి తనయుని మాటలను పట్టించుకోలేదు. తన పద్దతినే తను ఆచరించుతున్నాడు. అప్పుడు కుమారుడు సహించలేక పోయాడు. ఈ గోవులను యాగ నిమిత్తం మహారాజుల వద్దనుండి తెచ్చినవి కదా! వాటిమీద మమకారంతో మీరే సంగ్రహించుట ధర్మమా!” అని అడిగాడట
తనయుని మాటలకు తండ్రి ఆగ్రహించాడు. అయినా తనయుడు సహించలేక తండ్రి చేస్తున్నది తప్పని నివాదించాడు. అంతే గాకుండా తననుకూడా ఎవరికైనా దానం ఇవ్వమని కోరాడు. 'దానాలు మీరు ఖచ్చితంగా నిస్వార్ధంగా చేసినప్పుడే మీరు సర్వస్వంగా పరిత్యాగులు అవుతారు' అన్నాడు.
“నా పనులకు అడ్డం వస్తున్నావు! నిన్ను మృత్యుదేవతకు దానం ఇస్తాను” అని అన్నాడు తండ్రి.
కొడుకు భయపడలేదు. 'అలాగే చేయ'మని ఆనందం వ్యక్త పరిచాడు.
తండ్రీ! మీకు ఆశ్రమను కలిగించకుండా నేనే ఆ యముణ్ణి దర్శించు తాను అంటూ తండ్రి అనుమతిని కోరాడు.
అప్పుడు ముని తను కోపంతో అన్న మాటల్ని ఉపసంహరించు కున్నాడు. ఎంతపని చేసితిని అని బాధపడ్డాడు. అంతలో తనయుడు తన్ను పంపకుంటే అసత్య వాదిని అవుతాను అని బాధపడుతున్నాడు! యముని వద్దకు పంపకపోతే అసత్యవాది తండ్రి అవుతాడు. పంపితే వున్న ఒక్క కుమారుడి పోగోట్టుకున్న వాడవవుతావు. ఏమి చేయాలి అని బాధ పడ్డాడు తండ్రి.
“నాన్నగారూ! మీరు అల్పులు మాదిరి అవివేకంలో మునిగిపోతున్నారు. మృత్యువు ఎవరికైనా ఎప్పటికైనా తప్పనిదే! పుట్టిన ప్రతిజీవికీ చావు తప్పనిసరి కదా! కనుక నామీద మమకారం విడిచి పెట్టండి. సత్యపరిపాలన గురించి యశస్సునుగావించు “అని ప్రార్థించాడుసచికేతుడు. “ఆలోచించాడు తండ్రి!”ఔను! నా కుమారుడు చెప్పింది సత్యమే! ఈ మమకారాలన్ని సత్యవ్రతం నాకు అడ్డములే! అని తనయుని ఆశీర్వదించాడు. ఆ తక్షణం యమలోకానికి పంపించాడు.
“విక్రమాధిత్యా! తండ్రి యొక్క మోక్షమును వాంఛించి యమలోకంనకు పయనమై వెళ్ళిన కుమారుడు సచికేతుడు గొప్పవాడా?” లేక సత్యమునకై కుమారుడిని పంపిన తండ్రి రాజస్రవుడు గొప్పవాడా? అని అడిగాడు భేతాళుడు.
“భేతాళా! సచీకేతుడే గొప్పవాడు! తండ్రికే కాదు తన వంశానికే అసత్య దోషం కలుగకుండా ప్రవర్తించాడు. అటువంటి ఉత్తమ ఆదర్శాలు కలిగిన సచీకేతుని ఆ యమధర్మరాజు ఏవిధముగా స్వీకరించుతాడు మరి!” అని విక్రమార్కుడు తన సందేశాన్ని విన్నవించాడు.
సత్యం గ్రహించావు మహారాజా! యముడు సచీకేతుని స్వీకరించలేదు. అతని ఔదార్యామునకు మెచ్చుకున్నాడు. ఆత్మ స్వరూపం. అనే ఆత్మ జిజ్ఞాసనం బోధించాడు. తిరిగి తనయుడుని తండ్రి వద్దకు పంపేశాడు యముడు.
మౌనభంగం అయింది. ఒక్క ఎగురున భేతాళుడు వెళ్ళి మర్రి వృక్షం యొక్క కొమ్మకు వ్రేలాడుతాడు.
విక్రమార్కుడు ఆ తక్షణం' ఎప్పటిమాదిరే తిరిగి మర్రి వృక్షమును చేరాడు. భేతాళుని చెట్టునుండి అందుకొని తిరిగి భుజం మీద వేసుకొని సన్యాసి ఆశ్రమానికి నడుస్తున్నాడు.
ఆ వెంటనే "విక్రమార్కా! “భూపాలా! నేను చెప్పబోయేది ఆఖరి కథ. తగు సమాధానం ఇవ్వు” అని కథను ప్రారంభించాడు.
COMMENTS