Vidyasagar Kutumbam Vikram and Betal Story in Telugu Language : In this article, read విద్యాసాగర్ కుటుంబం తెలుగు కథ, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
విద్యాసాగర్ కుటుంబం తెలుగు కథ Vidyasagar Kutumbam Vikram and Betal Telugu Story
విద్యాసాగరుడు భార్యలతో అన్యోన్యంగావుంటున్నాడు. నలుగురు భార్యలూ కూడా ఐకమత్యంతో వుంటున్నారు. ఈ సందర్భంగా వారి నలుగురుకీ నలుగురు కుమారులు పుట్టారు. వారలకు యీ విధంగా నామకరణం చేశారు. బ్రాహ్మణ యువతికి పుట్టిన కుమారునకు 'పరరుచి' అనీ, రాజపుత్రికకు పుట్టిన కుమారునికి 'విక్రమార్కుడు' అనీ, వైశ్యకులం నుండి పెండ్లాడిన ఆమెకు పుట్టిన వాడి పేరు 'భట్టి' యనీ, చంద్రరేఖకు పుట్టినవాడికి 'భర్తృహరి' అని పేర్లు పెట్టి అందర్నీ ఒకేతీరున ప్రాణప్రదంగా పెంచసాగాడు.
పెరుగుతున్న వయస్సులో ఆ కుమారులను క్రమపద్ధతిన పెంచుతున్నాడు విద్యాసాగరుడు, ఆయన భార్యలూను! వారికి యుక్తవయస్సు వచ్చింది. సకల విద్యాపారంగతులుగా తీర్చిదిద్దారు వారు.
విద్యాసాగరుడు బహుకొద్దికాలం మాత్రం రాజ్యపాలనగురించి అజమాయిషీ చేశాడు. తదుపరి రాకుమార్తెకు పుట్టిన విక్రమార్కునకు సింహాసనంను అలంకరింపచేశాడు. తాతగారి పేరు కలుపుకొని విక్రమార్క • ఆదిత్యుడు అనబడే పేరుతో ఆయన పరిపాలన సాగించాడు. బ్రాహ్మణ స్త్రీకి పుట్టిన పరరుచి మహా పండితుడు అయినాడు. వైశ్య కన్యకు పుట్టిన 'భట్టి' విక్రమార్కుని కొలువులో మహామంత్రిగా నియమించబడ్డాడు. వేశ్యవనితకు పుట్టిన భర్తృహరి సర్వ సైన్యాధిపతి అయినాడు. వీరిలో ఇతను భార్యా వియోగం సంభవించడంతో అనేకములైన సుభాషితాలు వ్రాసి లోక ప్రసిద్ది చెందినాడు.
0 comments: