Sunday, 6 June 2021

విక్రమార్క భేతాళుడు చెప్పిన పదవ కథ Vikram Betal Tenth Story in Telugu Language

విక్రమార్క భేతాళుడు చెప్పిన పదవ కథ : In this article, read Vikram Betal Tenth Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.

విక్రమార్క భేతాళుడు చెప్పిన పదవ కథ Vikram Betal Tenth Story in Telugu Language

విక్రమార్క భేతాళుడు చెప్పిన పదవ కథ

ఇది నిర్మిలా నాగమల్లుల కథ! మధురానగరంను విక్రమజిత్తు అనే రాజు పాలిస్తున్నాడు. ఆ రాజునకు వక్కతే కుమార్తె ఆమె పేరు నిర్మల! ఆమె అందాలరాశి! ఆమెను పొందనివాడి బ్రతుకు వృధా! అని ఎందరెందరో రాకు మారులు ప్రయత్నించి విఫలులు అయినారు. ఒకనాడు రాకుమారి చెలికత్తెలతో బయలుదేరి ఉద్యానవనానికి విహరించే నిమిత్తం వెళ్ళింది. రాజు కట్టుబాట్ల ప్రకారం ఆ ఉద్యానవనంలో పురుషులు ఎవ్వరూ ప్రవేశించరాదు. రాజ కుమారు డుకే ప్రవేశంలేదు. స్త్రీలే ఆఉద్యానవనంలో ప్రవేశించాలి. అని తెలిసినా చుట్టూ ఎత్తుగా కట్టబడిన ప్రహరీ గోడను దూకి లతాకుంజముల మధ్యన దాగుకొని వున్నాడు. ఒక విప్రుడు ఒక విప్రుడు యీ విషయం రాకుమారి నిర్మలకు కాని ఆమె చెలికత్తెలకు గాని తెలియదు.

చాలా సేపు ఆడుకున్నారు. తదుపరి రాకుమారి నిర్మల అలసట చెందింది. అక్కడే అవతలగా వున్న కొలనువద్దకు వెళ్ళి కొలను వడ్డున విశ్రాంతి తీసుకుంటోంది. చెలికత్తెలు అవతలగా వున్న పూల చెట్ల వద్దకు వెళ్ళి పూలు కోస్తున్నారు. ఆ సమయంలో అక్కడ దాగి వున్న విప్రుని చూశారు చెలికత్తెలు. అతన్ని రాకుమారి నిర్మల వద్దకు తీసుకువెళ్ళారు.

నిర్మల వస్తున్న ఆవేశాన్ని అణుచుకుంది. అతను అందగాడే రా కుమారుడా ! అవడానికి రాజులు ధరించే దుస్తులు ధరించలేదు. సామాన్యమైన దుస్తులు ధరించివున్నాడు. అతన్ని చూచి ముందు భయపడినా తదుపరి మనస్సుని అదుపులోకి తీసుకుంది. అతన్ని చూస్తూ లేచి కూర్చుంది. “ఎవరు మీరు” అని అడిగింది నిర్మల ? 

“రాకుమారీ నేను ధనవంతుని కుమారుడను. రాకుమారుడను మాత్రం కాదు. మాది అవంతీనగరం. మీ అందచందాల గురించి విని మిమ్మల్ని ఒప్పించి మీ తండ్రి గారిని అడిగి మిమ్మల్ని పెళ్ళాడాలని వచ్చాను. సాహసించి గోడదూకి వచ్చినందుకు నన్ను మన్నించండి. మీ అంగీకారం అయితే మీ నాన్నగారితో మాట్లాడుతా"నని చెప్పాడు.

పూలచెట్ల వద్ద తిరుగుతున్న చెలికత్తెలు తమవైపు రావడం గమనించి “రాకుమారీ! నేను రేపు కలుస్తాను” అని అంటూ వచ్చిన దారిన వెళ్ళిపోయాడు ఆ ధనికుడు. అతను వెళ్ళిపోవడం ఒక చెలికత్తె చూచి ఏదో అనబోయింది.

“నువ్వు అల్లరి చేయకు! అతని రూప సంపద నాకు నచ్చింది! నేను అతన్ని ప్రేమించాను. ఈ విషయం నేనే మా అమ్మగారికి చెప్పినాన్న గారితో చెప్పించి ఒప్పించుతాను” అంది. దాంతో చెలికత్తె మాట్లాడలేదు. అందరూ కలసి అంతఃపురంకు వెళ్ళారు. అదే సమయంలో అంతఃపురం కింద కోలాహలం జరుగుతోంది. నిర్మల తన గది నుండి కిటీకి ద్వారా అటు చూసింది. ఆమెను ప్రేమించానని చెప్పన తను రాగమల్లుడు. అతను వెళుతుండగా రాజభటులు అతన్ని బంధించి వేశారు.

ఆ మర్నాడు రాజ సభలో రాగమల్లుని విచారణకై ప్రవేశపెట్టారు భటులు. అతన్ని బంధించిన సేనాని అతన్ని గురించి “వీడుచూడటానికి అంద గాడు చేస్తున్న పనులనుబట్టి మహాకూరుడు వీడు వూరునకు ఒక పేరుతో, ఒక వేషంతో చలామణి అవుతున్న దుర్మార్గుడు వీడి పేరు మల్లుడు అంటారు. దేశంలో జరుగుతున్న బందిపోటు దొంగతనాలకు హత్యలకూ వీడే కారకుడు. వీడిని బంధించేటందుకు ఎంతగానో మనభటులు ప్రయత్నించి చివరకు ఈనాడు చిక్కించుకున్నారు. వీడు ఈనాడు రాజపుత్రిక విహరించే ఉద్యానవనంలో ప్రవేశించాడు. ఇతనికి తగిన శిక్షను విధించాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. 

అంతక్రితమే భార్య వలన, రాకుమారి వలన అతన్ని గురించి విన్నాడు. అతను మంచివాడు అని విన్నాడు. అటువంటి నీచుడినా రాకుమారి వరించింది అనుకున్నాడు. ఆవెంటనే ఆ రాగమల్లుని విచారించి ఉరిశిక్ష విధించాడు రాజు.

అతని శిక్ష వినిన రాకుమారి తండ్రి వద్దకు వచ్చింది. అతడు దొంగగాని ద్రోహిగాని బంధిపోటుగాని, ఎవరయినా నేను అతన్ని ప్రేమించాను! అతన్ని క్షమించండి తండ్రీ” అని వేడుకుంది. కాని మహారాజు ఆమె కోరికను తృణీ కరించాడు. ఆయనకు అవసరమైంది కూతురి క్షేమం కన్నా దేశ క్షేమమే కదా! తదుపరి రాగమల్లుని ఉరితీయించాడు. ఆ వార్త విని రాకుమారి విషం త్రాగి మరణించింది.

“విక్రమార్క భూపాళా! విన్నారుకదా కథను. ఈ నిస్వార్ధ మరణం కారణంగా స్త్రీ హత్య పాతకం ఎవరికి చుట్టుకుంటుంది. మహారాజునకా!” అని అడిగాడు భేతాళుడు.

విక్రమార్కుడు ఆలోచించి యిలాగున అన్నాడు. మహారాజునకు ఆ పాతకంచెందదు. రాజు తన రాజధర్మాన్ని పాటించాడు. న్యాయంగా యోచించిన ఆ పాతికం మహారాజునకు గానీ మరి ఎవరికైనా గానీ చెందదు. యుక్తాయుక్త ములు తెలియక ప్రేమించిన రాకుమారి నిర్మలకు భగవంతుడే శిక్షను విధించాడు గనుక ఈ పాపం ఎవరికీ చెందదు అని చెప్పాడు విక్రమార్కుడు.

ఆవెంటనే భేతాళుడు ఎప్పటిమాదిరి విక్రమార్కుడి నుండి ఎగిరి మర్రి వృక్షాన్నిచేరాడు. మళ్ళీ విక్రమార్కుడు అతన్ని పట్టి భుజాన వేసుకుని బయల్దేరాడు. 


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: