Visalakshi Vinta Mogudu Kasi Majili Kathalu in Telugu : In this article విశాలాక్షివింత మొగుడు కాశీ మజిలీ కథలు, Kasi Majili Stories in Telugu for kids.
Visalakshi Vinta Mogudu Kasi Majili Kathalu in Telugu : In this article read "విశాలాక్షివింత మొగుడు కాశీ మజిలీ కథలు", " Kasi Majili Stories in Telugu" for kids and Students.
విశాలాక్షివింత మొగుడు కాశీ మజిలీ కథలు
స్వామి తన శిష్యులతో బాటు గుణసాగరుణ్ణి కూడా తన వెంటబెట్టుకుని కాశీయాత్రకు బయలుదేరాడు. పూర్వకాలంలో కాశీయాత్రకు పోవాలంటే కాలినడకనే పోవలసివచ్చేది. ప్రయాణసౌకర్యాలేమాత్రం ఉండేవికావు. పగలంతా ప్రయాణం చేస్తూ రాత్రయ్యేసరికి ఏ ఊరిలోనో మకాం వేయటం, ఆ రాత్రికి అక్కడే పడుకొని మర్నాడు మరల కాలినడకన ప్రయాణమవ్వటం ఇలా ఉండేది. మార్గమధ్యంలో కొండలు, కోనలు, అడవులు దాటుకుని వెళ్ళేవారు. కొందరు క్రూరమృగాల బారినపడి మరణించేవారు. అందుకే పూర్వంకాశీకి పోయినా కాటికిపోయినా ఒక్కటే” అనేవారు. అంటే కాశికిపోయినవారు మరల తిరిగి వచ్చేంతవరకు నమ్మకాలు పెట్టుకొనేవారుకాదు. ఎవరైనా కాశికిపోయి తిరిగివచ్చాడంటే వాడంతటి పుణ్యాత్ముడు మరొకరుండరు అనేవారు. అందుకే ప్రయాణీకులు గుంపులు, గుంపులుగా యాత్రలు చేసేవారు. యాత్రలో విసుగుదల రాకుండా ఉండేందుకు ఆయా ఊర్లలో మకాంచేసి ఎవరికి తోచిన కధలు వారు చెప్పుకునేవారు. కల్పితాలు, వాస్తవాలతో ఆ కధలుండేవి. వారు మకాం చేసి విశ్రాంతి తీసుకున్న ప్రాంతాన్ని “మజిలీ” అనేవారు. అలా మన స్వామివారు తన శిష్యులతోబాటు గుణసాగరుని కూడా వెంటబెట్టుకుని మొదటగా మజిలీచేసి విశ్రాంతి తీసుకొని చెప్పిన కధే ఈ విశాలక్షి వింతమొగుడు. -
విశాలాక్షి ఒకదేశపు రాకుమార్తె. అపురూప సౌందర్యవతి. విశాలమైన కన్నులతో, ఆకర్షణీయమైన రూపంతో విరాజిల్లుతుండేది. అందచందాలలో ఆమె కామెయే సాటి ఆమె అందాలరాశియేకాదు విద్యావంతురాలు కూడా. ప్రజా పాటవాలు, తెలివితేటలు ఆమెసొత్తు. మిక్కిలి చతురతయై మెలగుతుండేది. యుక్త వయస్సుకు వచ్చిన విశాలాక్షినిఏమమ్మా! నీకు వివాహం చేయాలనుకొంటున్నాను. నీ కెలాంటి వరుడు కావాలంటావ్" అని తండ్రి అడిగాడు.
“నాన్నగారూ ! ఏ కన్య అయినా ఏమనికోరుకుంటుంది. అపురూపలావణ్య వంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ధీరోదాత్తుడు, ఆకర్షణీయమైన రూపంతో విరాజిల్లే వీరపరాక్రమవంతుడ్నే కదా కోరుకుంటుంది. రూపలావణ్యములతో బాటు అద్భుతమైన తెలివితేటలతో విరాజిల్లే వరుడ్డేకదా ఏ కన్య అయినా వరించాలను కుంటుంది.” అని తన అభిప్రాయాన్ని చూచాయిగా తండ్రికి వెల్లడించింది.
విశాలాక్షిమనస్సును గ్రహించిన ఆమె తండ్రి "సద్గుణ సంపన్నురాలైన నా అందాల ముద్దుల కుమార్తెకు తగినవరుడ్ని తేగలనా?” అనుకుంటూ దేశదేశా లకు తనవేగులను పంపాడు. తగిన వరుణ్ణి వెదకమని ఆజ్ఞాపించాడు.” అందగాడు. అపురూపలావణ్యవంతుడు, ఆకర్షణీయమైన శరీరముతో నొప్పారువాడును, బహు ముఖ ప్రజ్ఞాశాలి, అత్యంత తెలివితేటలుగలవానిని నా కుమార్తెకు తగిన వరునిగా వెదకమన్నాడు. వేగులను వెదకమనిపంపించాడన్నమాటేకాని ఎదలో ఎక్కడో సందేహమాతనిని పట్టిపీడించసాగింది. తగినవరుణ్ణి తీసుకొని వచ్చి పెండ్లి చేసి, కన్న కూతురు కోరికను సవ్యంగా తీర్చగలనా” అని మదనపడసాగాడు.
ఇంతలో విశాలాక్షి ఒకనాడు ఊరిబయటనున్న ఆలయంలోని దేవుని పూజించి వద్దామనుకొని, తన చెలికత్తెలతో బయలుదేరింది. పూజ ముగించుకొని బయటకువస్తూ ఆలయంలో పండిత గోష్టి జరగటం చూసింది. పండితులక్కడ శాస్త్రాలపై వాదోపవాదాలు చేసుకుంటున్నారు. కొందరు విద్వాంసులు తమ పాండిత్యంతో ఆలయ విశిష్టతను గురించివివరిస్తున్నారు. విశాలాక్షికి వారి వాదనలు వినపడసాగాయి అంతే ! ఒక్క ఉదుటున సమీపానికి వెళ్ళి వీక్షించసాగింది.
శ్రద్ధగా వింటున్న విశాలాక్షికి ఆ పండితుల మధ్యలో నవయవ్వన సుంద రాంగుడైన యువకుడు కనిపించాడు. ఆతని ముగ్ధమనోహర రూపాన్ని చూడగానే విశాలక్షి చలించిపోయింది. ఆకర్షణీయమైన ఆతనికళ్ళు విశాలక్షి మనసును గిలిగింతలు పెట్టసాగాయి. ఆనందపారవశ్యంతో మైమరచి తదేకంగా ఆతనిని చూస్తూండి పోయింది. చంద్రబింబమువలె ప్రకాశిస్తున్న ఆతనిమోమును చూడగానే విశాలాక్షి ఒకింత మన్మధావకు లోనయింది. .
సుందరగంభీరవదనంతో వెలిగిపోతున్న ఆతనిని చూసిన విశాలాక్షిఎలాగైనా ఈతనినే వివాహంచేసుకొని మన్మధసుఖాలను పొందాలనుకొంది. చెలీ! నీవు వెళ్ళి ఆ సుందరాంగుని వివరాలు తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించి కోవెలలోనికి మరలపోయి” కేదారేశ్వరా! ఎలాగైనా ఆయువకుడు నాభర్తఅయ్యేటట్లు అనుగ్రహించు స్వామీ ! అని కోరుకొని బయటకు వచ్చేంతలో అప్పటికే యువకుని వివరాలతో చెలికత్తె సిద్ధంగా ఉంది.
"అమ్మా ! నేనాతనివద్దకుపోయి ప్రక్కనే నిలబడ్డానా ! అయినా అతనెంత సేపటికీ నాపై కన్నెత్తి చూడలేదమ్మా ! మాటల మధ్యలో కల్పించుకొని పండితోత్తమా! తమ నివాసమెక్కడ? "అని అడిగాను. అబ్బే ! బదులివ్వలేదు సరికదా ! నాకేం తెలియదన్నాడు. పండితులకు ఒక ఊరేమిటి? ఎక్కడ తమ పాండిత్యానికి రాణింపు కలుగుతుందో అక్కడకే కదా ! వెళుతుంటారు. వారనవసరంగా మాట్లాడరుకదా! అనుకుంటూసరిపెట్టుకుంది విశాలక్షి. అయితే ఆతన్ని అందరూ శాస్త్రి”అనిపిలుస్తుంటా రని తెలుసుకొంది. ముక్తసరిగా మాట్లాడేరకం అనుకూడా గ్రహించింది. పండితులు పండితులతోనే కదా మాట్లాడతారు ! అనుకొని అంతఃపురానికిపోయి ఆ సుంద రాంగుని మనస్సులో ముద్రించుకొని లోలోన మురిసిపో సాగింది. ఆతని ద్యాసలోనే ఉండటం వలన చెలికెత్తెలను పరిచారికలను అందరినీ విసుక్కోసాగింది.
తనకుమార్తె విశాలాక్షి మునుపెన్నడూ లేనంత పరధ్యానంలో ఉండటం, చీటికి మాటికి చికాకుపడటం ఇదంతా గ్రహించిన రాజు చెలికత్తెద్వారా విషయాన్ని తెలుసుకున్నాడు. తనకూతురు ఎవరినో వలచిందని, ఆతన్నే మనసులో తలచుకొం టోందని ఊహించాడు. వెదకబోయిన తీగ కాళ్ళకు తగిలిందన్నట్లు, తన కూతురుకె లాంటివరుని వెదకి తేవాలాయని చింతిస్తున్న రాజుకు తనపని సులువైందని సంతోషించాడు. విశాలాక్షితో “అమ్మా ! నీ మనస్సును దోచిన ఆ సుందరాంగు డెవరో నాకుచెప్పవూ ! అని అడిగాడు. “నాన్నా! నేను కోరుకున్నయువకుని మీకు చూపించక మరెవ్వరికి చూపిస్తాను” అంటూ తండ్రితో సహా ఆలయానికి వెళ్ళి పండిత గోష్టి మధ్యలోనున్నయువకుని చూపించింది.
ఆ యువకుని రూపలావణ్యములు చూసిన రాజు అచ్చెరువందాడు. అబ్బో! ఎంత అందముగా ఉన్నాడు. మా విశాలాక్షికితడు తగినవరుడే. ఉయ్యాలలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెదకినట్లు తనఊర్లోనే ఉన్న ఈతనినిచూడనేనెంత శ్రమ పడ్డాను. “స్వామీ ! కాశీ విశ్వేశ్వరా ! నీ మాయలు కడు చిత్రములుగదా ! విశాలాక్షికి వరుణ్ణి వెదికేశ్రమలేకుండా చేసావు. ధన్యుడ్ని స్వామీ ! అని ప్రార్ధించాడు.
ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోతుందని గ్రహించిన రాజు విశాలాక్షికి ఆయువకునితో రంగరంగ వైభవంగా వివాహంజరిపించాడు. శోభనంనాటి రాత్రి గదిలోనికి ప్రవేశించిన విశాలాక్షి విస్తుబోయింది. ఎందుకంటే అప్పటికే ఆతడు గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. తప్పదనుకొని గడియవేసి మంచంవద్దకువచ్చి, ఆతన్నిలేపి పాలిచ్చింది. “నాకెందుకు పాలు ! మంచినిద్ర చెడగొట్టావు” అంటూ మరల నిద్రకుపక్రమించపోయాడు. వెంటనే ఆతన్ని పట్టుకొనిలేపి నించోబెట్టి కాళ్ళకు నమస్కరించింది విశాలాక్షి .
అంతే ! ఇది రాజుల ఆచారమనుకొన్నాడో ఏమోగాని, ఆ యువకుడుకూడా విశాలాక్షి కాళ్ళకు నమస్కరించాడు. ఇదేమిటని ఆశ్చర్యపోయింది విశాలాక్షి ! పండ్లు తీపి పదార్ధాలు పెట్టింది. అన్నీ తిన్న ఆ యువకుడు బ్రేవ్' మని త్రేన్చి మరల నిద్రించబోయాడు. “స్వామీ ఈ రోజు మనశోభనమండీ ! అని సిగ్గువిడిచి చెప్పింది. అయినా ఆతనిలో ఏచలనములేదు సరికదా! శోభనమంటేఏమిటీ? అని విశాలాక్షిని ఎదురు ప్రశ్నించాడు. అవాక్కయిపోయింది. అప్పటికప్పుడే గ్రహించింది ఆతడొక అమాయకుడని, ఏమీ తెలియని వెర్రిబాగులవాడని గ్రహించింది. బాహ్య సౌందర్యం నన్నెంత మోసగించింది. అనుకొని బాధపడింది. అయితే ఆతను స్వయంగా వలచిన వరుడు. ఎవరినేమనగలదు. అందుకే విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. తన భర్త బుద్ధిహీనుడనీ, తెలివిలేని అమాయకుడనీ, జ్ఞానశూన్యుడని, వివాహమంటే ఏమిటోకూడా తెలియని అవివేకియని ఎవరితో చెప్పుకొనగలదు.
విశాలాక్షి విద్యావంతురాలు, సకలశాస్త్రములను అధ్యయనం చేసినదిట్ట అంతటి ప్రజ్ఞావంతురాలుకూడా తనభర్త ఎంపికవిషయంలో పొరబడింది. పొర బాట్లనేవి పండిత పాపమరులకందరికి తప్పవుగదా ! అనుకొంది. అంతా విధి లిఖితం. విధి వ్రాతను మార్చగలవారెవ్వరు ? జరిగినదీ మనమంచికే ! జరుగు తున్నదీ మనమంచికే ! అట్లే జరుగబోయేదికూడా మనమంచికే అను కోవాలని సరిపెట్టుకొంది. పరిస్థితులతో రాజీపడి ఈ విషయం ఎవరికీ తెలియ కుండా జాగ్రత్తపడాలనుకొంది. తండ్రికి తెలిస్తే బాధపడతాడనుకొని తండ్రికి కూడా తెలియ నివ్వకుండా జాగ్రత్తపడింది. నిత్యము భర్తవెంటే ఉండి ఆతని బుద్దిహీనత బయట పడకుండా జీవితాన్నే ఎదుర్కొంటూ వస్తున్నది.
కాలగమనం .కడువిచిత్రమైనది. అది ఎవరికోసం ఆగదు. దానినెవరూ ఆపలేరు కూడా మరికొంతకాలానికి రాజుకూడా కాలగమనంలో కలిసిపోయాడు. విశాలాక్షికి అన్నదమ్ములెవరూ లేని కారణంగా ఆమె భర్త కింశకు శాస్త్రినే రాజుగా నియమించారు. భర్తబుద్దిహీనతను భార్యమాత్రం ఎంతకాలం దాచగలదు. అనతికాలంలో రాజు అమాయకుడనీ, బుద్దిహీనుడనీ, అందరికీ తెలియసాగింది. ఇంతకు ముందు విశాలాక్షిని వివాహమాడాలనుకొని భంగపడిన శతృరాజులకు కూడా ఈ విషయం తెలిసి ఎట్లాగైనా పగదీర్చుకోవాలనుకొన్నారు. వెంటనే శత్రురాజులు సమావేశమై, అందరూ ఏకమై ఒక్కసారిగా దండెత్తారు.
హఠాత్తుగా శతృరాజులందరూ ఏకమై దండెత్తేసరికి, విశాలాక్షికి భయం పట్టుకున్నది. అందర్ని ఎదిరించి నిలబడటం కష్టమనుకొని, ఎట్లాగైనా భర్తతో సహా తప్పించుకొని పారిపోవాలనుకొంది. ఎవరికీ కనపడకుండా అంతఃపురంలో నున్న రహస్య ద్వారాన్ని కనుగొని, విలువైన మణిమాణిక్యాలను, రత్నరాసులను, ఒక గుర్రంపై వేసుకొని, భర్తతో సహా అశ్వాన్నధిరోహించి పారిపోసాగింది. తన భర్త అసలే బ్రాహ్మణుడు, సౌందర్యమే తప్ప స్వారీచేయటం ఏం తెలుసు? కనీసం గుర్రంపై ఎలాకూర్చోవాలో కూడా తెలియనివాడు. వేగంగా గుర్రంపోతూఉంటే భయంతో అరచేవాడు. అతనికి ధైర్యం చెబుతూ సొరంగమార్గంగుండా బయట అడవిలోనికి ప్రవేశించింది. భర్తను జాగ్రత్తగా పడిపోకుండా కాపాడుకొంటూ మొత్తానికొక కొండ శిఖరాగ్రానికి చేరుకుంది విశాలాక్షి.
చుట్టూ చిమ్మచీకటి, పైగా కొండశిఖరం, అంతా చెట్లతోను, దుబ్బలతోను, దట్టమైన అడవిలా ఉంది. కింశుకశాస్త్రి భయంతో గజగజవణికిపోతున్నాడు. రాళ్ళు, రప్పలలో నెమ్మదిగా పోతూఉన్న విశాలాక్షికి ఎక్కడనుండియో హఠాత్తుగా ఒక సింహగర్జన వినిపించింది. అంతే ! ఆ సింహనాదానికి గుర్రంబెదిరిపోయింది. పరుగులంకించుకుంది. విశాలాక్షి వెనుకనున్న కింశుకశాస్త్రి దబాలున క్రింద పడిపోయాడు. గుర్రాన్ని అపుదామని కళ్ళెములు గట్టిగాలాగింది. అయినా సింహ గర్జనకు భయపడిన ఆగుర్రం ఆగలేదు. చివరకి ఎక్కడో కొన్ని యోజనాలు పోయిన తర్వాత అతికష్టంమీద గుర్రాన్నాపింది. అప్పటికే చాలా దూరం వచ్చే సిందేమో ! ఆమెకు దుఃఖం ఆగలేదు. కోరుకున్న భర్తక్రిందపడి చనిపోయాడు. లేదులేదు ! తానే చంపేసింది. పండిత సభలో ఉండే ఆతన్ని తనే వలచి వరించింది. ఆతడమాయకుడు. ఆతనికేం తెలియదు. అన్యాయంగా ఆతని జీవితాన్ని బలితీసు కొంది. తననే చేసుకుంటానని ఆతడేమన్నాపట్టు పట్టాడా ! లేదే ! శాస్త్రాధ్యయనం చేసేవానినీ అన్యాయంగా పెండ్లాడి ఇలా చంపేశానే” అని పరిపరివిదాల దుఖిం చింది. నన్ను పెండ్లి చేసుకోవటం వల్లనే ఆయన చనిపోయారు. ఆయనకి ఏ పాపం తెలియదు. తనే ఆయనతో పెండ్లి అయ్యేంతవరకు నిద్రపోలేదు. పాపమాయన ఇప్పుడు శాశ్వత నిద్రపోతున్నారు. దీనంతటికి కారణం నేనే. నా పాపానికి నిష్కృతి లేదు. నాకింక సుఖపడేయోగంలేదు. నేనెందుకింక బ్రతకటం మరణమే శరణ్య మనుకొన్న విశాలాక్షి ఒకచెట్టుకి ఉరిపోసుకొని చనిపోదామనుకొంది.
ఇంతలో విశాలాక్షికి చెట్టుబొర్రలోనున్న పక్షులు వాటి పిల్లలకు ఆహారం తెచ్చి తమనోటితో పిల్లలనోట్లో పెడుతున్న దృశ్యంకనిపించింది. తదేకంగా ఆదృశ్యాన్నే చూస్తున్న విశాలాక్షికి" దిక్కుమొక్కులేని పక్షులే పిల్లలను చక్కగా పోషించుకుంటుంటే అన్నీ ఉండిపైగా తెలివితేటలు ఉండి నేనెందుకు ఆత్మహత్య చేసుకోవాలి ? జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొవటంలోనే జీవితం ఉంది. చచ్చిసాధించేదే ముంది? బ్రతికుంటేనే ఏదైనా చేయవచ్చు. ననుకొన్నవిశాలాక్ష్మి ఆప్రయత్నం విర మించి ఏదెలా జరగాలో అలాగే జరుగుతుందిలే అనుకొని నెమ్మదిగా తన ప్రయా ణాన్ని సాగించింది. అలాపోయిపోయి ఒకచెట్టుక్రింద విశ్రమించింది. అడవిలో దొరికిన పండ్లుతిన్నది. దగ్గరలో ఉన్న ఒక కొలనులోని మంచినీరు త్రాగింది. బాగా అలసిపోయిందేమో వెంటనే నిద్రపట్టేసింది.
ఆ నిద్రలో ఆమెకొక చక్కటి కలవచ్చింది. ఆకలలో ఆమెకొకదేవతకనిపించి” “విశాలాక్షీ ! భయపడకు ! ధైర్యంగా ఉండు నీకంతా మేలే జరుగగలదు” అంటూ దీవించింది. లేచి చూసేసరికి ఆమె ఒక ఉద్యానవనంలో పడుకొని ఉంది. ఆశ్చర్య పోయింది. అడవిలోనున్న తానిక్కడకెలా రాగలిగింది. ఇదికలా ! నిజమా! నేను విశాలాక్షినేనా ! నన్నేవరైనా ఇక్కడకు తీసుకువచ్చారాఏమిటి? అనుకుంటూ ఆ ఉద్యానవనమంతా కలియతిరిగింది.
ఆ ఉద్యానవనము సువాసనలు వెదజల్లు పలుపరిమళభరితపూల మొక్కల తోను, కన్నులకుకనువిందుకలిగించు మనోహర దృశ్యములతోను నిండి ఉంది. చల్లనిగాలులు వీస్తుంటే అలాఅలా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉండి అలాగే విహరించసాగింది. పండ్లచెట్లనుండి పండ్లు కోసుకొనితింటూ “అబ్బా ! ఈ ఫలములెంత మధురముగా ఉన్నాయి. ఇందలి ఫలకుసుమజాలములును మహా నందమును కలిగించుతున్నవే ! కోయలలెంతో మధురముగా పాడుతున్నాయి. ఇంతలో ఆమెకొక మధురఫలవృక్ష మొకటి కనిపించగా ఒకపండుకోసుకొనితిన్నది. ఆశ్చర్యం ! ఆ ఫలమెంతో మధురంగాను, ఆకలిదప్పులను పోగొట్టేదిగాను ఉంది. వెంటనే మరొక పండును కోసుకొని తనవద్దేదాచుకొంది. అలా తిరుగుతున్నామెకు ఎక్కడినుండియో పరిమళసువాసనలు రాసాగాయి. ఆహా! ఎంతసువాసన వస్తోందో ! ఇది ఏపుష్పమహిమో కదా! అనుకుంటూ సువాసనలువస్తున్న దిక్కుకు వెళ్ళింది. అక్కడామెకొక అందమైన పరిమళసువాసనలు వెదజల్లే పుష్పరాజవృక్షమొకటి కనిపించింది. ఒక పువ్వునుకోసుకొని తలలోముడుచుకొని, మరొకపువ్వును భద్ర పరచుకొంది. అలా తనువుమరచి విహరిస్తున్న విశాలాక్షికి ఎక్కిడినుండియో మృధుమధుర వీణాధ్వని వినిపించి అటువైపు వెళ్ళింది. ,
ఆ మార్గము ఆమెనుతిన్నగా ఒక దేవాలయానికి తీసుకొని వెళ్ళింది మణ మయరత్నఖచితకాంతులతో శోభిల్లుతున్న ఆ దేవాలయము అత్యంత సుందరము గాను, చూడముచ్చటగాను ఉన్నది. ఆ ఆలయంలోనికి ప్రవేశించిన విశాలాక్షికి ఆలయపంటముపై ఒద్దికగా కూర్చొని వీణాగానంచేస్తున్న ఒక సుందరాంగి కన పడింది. ఆమెగానం వీనులవిందుగా ఉంది. విశాలాక్షి సంగీత ప్రావీణ్యురాలు కూడా కావటంవల్ల ఆమె పాడిన సంగీతస్వరాలు విశాలాక్షి మనసును ఉర్రూత లూగించాయి. ఆమె అద్భుత సంగీతానికి విశాలాక్షి పరవశించిపోయింది.
విశాలాక్షి తిన్నగా ఆమె వద్దకు వెళ్ళింది. మృధుమధురగానంతో మమ్మల్ని పరవశింపచేస్తున్న మీరెవరు? ఎందుకు పాడుతున్నారు? అని అడిగింది. దానికామె బదులిస్తూ తన పేరు వీణావతియని, నిత్యము అక్కడ దేవుని కీర్తనలు పాడతానని చెప్పి మరలా తన వీణను శృతిచేసుకుంటూ దేవునిపై మధురకీర్తన ఆలాపించ సాగింది. శ్రావ్యంగాపాడుతున్న ఆమెగానమాధుర్యానికి విశాలాక్షి పరవశించిపోయి మెల్లగా నిద్రలోకి జారుకుంది.
అంతే ! మెలకువ వచ్చి చూసేసరికామె మరలా యధాస్థానంలో తన గుర్రంతో సహా చెట్టు క్రిందఉంది. ఆశ్చర్యపోయింది. విశాలాక్షి ! అరే ! ఇదంతా కలా ! ఈ కల నిజమైతే ఎంత బాగుండును. స్వప్నంలో వచ్చినవి నిజమవుతాంటారు పెద్దలు. ఈ కల ఎంత ఆహ్లాదభరితంగా ఉంది. తన మనస్సును ఉల్లాసపరుస్తోంది. హాయిగా ఉందిగదా ! అనుకొని తన చీరకొంగుతో ముఖంపై పట్టిన చెమటను తుడుచుకో బోయినామెకు చీరకొంగుకు ముడి ఉండటం చూసి విప్పింది. ఆశ్చర్యం! ఆ ముడి లో ఇంతకుముందు కలలోచూసిన ఫలం, పుష్పం ఉన్నాయి. ఆపుష్పం యొక్క మహిమ ఏమిటోగాని అదెన్నాళ్ళకు వాడిపోకుండా ఉంటోంది. ఏమిటీవింత అనుకుంటూ ఆశ్చర్యపోయింది. విశాలాక్షి పండును, పువ్వునూ చూస్తూ అలాగే ఉండిపోయింది. ఏమిటిదంతా! కలా! నిజమా! లేక కాశివిశాలా క్షిమహిమా! ఔను! ఇది తప్పకుండా అమ్మవారి మహిమే. ఇందులో సందేహం లేదు. లేనిచో కలలోకనిపించిన ఫలపుష్పాలు చీరకొంగుకుఉండటమేమిటి ! అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది.
ఇదంతా కాశీవిశాలాక్షి మహిమ అనుకొన్నవెంటనే ఆమెకు ఏదో తెలియని ఆశ, తను వంటరిదానిని కాదని, తనభర్త మరల తిరిగి వస్తాడని, చావలేదని నిశ్చయించుకొంది. బ్రతుకుపై ఆశలు పెంచుకొంది. ఫలపుష్పాలతో ప్రయాణం కొనసాగించింది. చీకటిపడేవేళకు ఏదైనా పట్నంచేరుకొని విశ్రాంతి తీసుకోవాలను కొంది. గుర్రాన్ని వేగంగా పరుగెత్తించింది. ఆదారిక్రమేపీ దక్షిణం వైపు మళ్ళింది. సాయంకాలమవసాగింది.
విశాలాక్షి కొంతసేపటికి ఒక అగ్రహారం పొలిమేరలకు చేరుకుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమెకొక విషాదదృశ్యం కనిపించింది. అక్కడొక వయసుమీరిన బ్రహ్మచారొకడు చెట్టుకొమ్మకు ఉరివేసుకోబోతూ కనిపించాడు. తక్షణమే గుర్రం దిగి అతని చెయ్యిపట్టుకొనివారించి అయ్యా తమరెవరు! ఎందుకీ అఘాయిత్యం చేస్తున్నారు? మీకొచ్చిన కష్టం ఏమిటి? అంటూ ప్రశ్నించింది. అప్పటికే చీకటి క్రమ్ముకొనగా అతడు "అయ్యా! నన్నువదలండి. నేనెవరికీ ఏమీకానివాడిని, ఇంక నేను ఏకష్టాలు పడలేను. విద్యాహీనుడూ, దరిద్రుడూ బ్రతకటంతకంటే చావటమే మేలు. నన్నుచావనీయండి” అంటూ దుఃఖంతో విలపించసాగాడు.
విశాలాక్షి ఆ విప్రుణ్ణివారించి” ఓయీ ! వెర్రిబాపడా ! బలవన్మరణం పాప హేతువు కదా! చావుపుట్టుకలు లిఖించేదివిధాత కాని మనంకాదు. గతజన్మలో ఏపుణ్యంచేసావోగాని బ్రాహ్మణుడవై జన్మించావు. అదిచాలు. ఇంక దరిద్రమంటావా! దాన్ని రూపుమాపటం మన చేతుల్లోనే ఉంది. అన్నీ తెలిసినవాడివి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో పుట్టించినవాడు బ్రతికించకమానడు. గిట్టించకమానడు గదా! ఈ మధ్యలో వచ్చే కష్టసుఖాలు మధ్యలోనే సమసిపోతాయి. దానికింతగా బాధపడి అత్మహత్య చేసుకోవాలా ! తప్పు ! నీ వృత్తాంతం చెప్పు ! తగినసాయంచేసి నీ బాధానివృత్తికి తోడ్పడతాను” అంది విశాలాక్షి. ఆవిప్రుడు తనదీనస్థితిని వివరిం చాడు. విశాలాక్షి మనసుద్రవించి “ఓ బ్రాహ్మణుడా ! నా వద్ద ఒక వింతఫలము ఉన్నది. అది తిన్నవారికి ఆకలి, దాహము కలుగదు. నీవీ ఫలమును మీ రాజు గారికిస్తే ఆయన నీకు కావలసినంతధనమును బహుమతిగా ఇస్తాడు. ఆ ధనముతో నీవు సుఖముగా జీవించవచ్చు. ఇదిగో ఈ పండుతీసుకోమంటూ ఆ విప్రునికిచ్చింది విశాలాక్షి ఆ బ్రాహ్మణుడు ఆ ఫలాన్నందుకొని మనోవాంఛాఫలసిద్ధిరస్తు” అంటూ దీవించి, కృతజ్ఞతలు చెప్పుకొని నిష్క్రమించాడు. విశాలాక్షి ఆనాడచ్చటనే విశ్రాంతి తీసుకొని తెల్లవారుతుండగానే మరల తన ప్రయాణాన్ని కొనసాగించింది. విశాలాక్షి మధ్యాహ్నం వరకు అలుపెరుగని ప్రయాణం సాగించి ఎండతీవ్రతకు ఒకింత విశ్ర మించాలనుకొంది. ఒక చెట్టునీడలో గుర్రాన్ని కట్టివేసింది. చుట్టూ కలియ చూసిం ది. ఆప్రాంతమంతా ఫలవృక్షజాతులతో సుమనోహరంగా ఉంది. వెంట తెచ్చుకొన్న మంచినీళ్ళను త్రాగింది. క్రిందపచ్చికబయలుపై ఒక దుప్పటి పరచి విశ్రమించింది. ఇంతలో అటువైపుగా కొంతమంది పిల్లలతో ఒక ముదుసలి బ్రాహ్మణుడు వస్తూ కనిపించాడు.. ఆతడు కడు దిగులుతో, ఏదోగొణుక్కుంటూ పడుతూ, లేస్తూ భారంగా బ్రతుకునీడుస్తున్నవానివలెనున్నాడు. అతిదీనంగా తన పదుగురు పిల్లలతో వెడుతున్న ఆ బ్రాహ్మణుని చూడగానే విశాలాక్షి మనస్సు ద్రవించి “అయ్యా ! బ్రాహ్మణోత్తమా! తమరెందుకు అంత దిగులుగా ఉన్నారు. ఎక్కడినుండి వస్తున్నారు ? ఈ పిల్లలంతా ఎవరు ? ఎక్కడికి వెళుతున్నారు.” అంటూ ప్రశ్నించింది. ఏం చెప్పమంటావమ్మా ! వీళ్ళమ్మకాలంచేసి చాలాకాలమైంది. నాటినుండి ఈ పిల్లలతో తెగబాధపడిపోతున్నాను. ఇప్పటివరకు భిక్షాటనతో పిల్లలను పోషించుకుంటూ వస్తున్నాను. మాగ్రామంబహుదొడ్డది. దయాదాక్షిణ్యాలకు కొదవ లేదు. అన్నపూర్ణ లాంటి మా గ్రామంలో ఇటీవల కరువు తాండవించడం మొదలు పెట్టింది. కరువు కాటకాలు తమ కరాళ నృత్యాన్ని మాపై చేస్తున్నాయి. ప్రజలందరు వర్షాలుపడక, పంటలు పండక తల్లడిల్లుతున్నారు. నేలబీడువారిపోయిది తినడానికి తిండిగాని, త్రాగడానికి గుక్కెడు నీరుకాని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు భిక్ష పెట్టేవారెవరుం టారు? ఈ పిల్లలతో కడుబాధలు పడుతూ ప్రక్క ప్రాంతంలోనైనా భిక్ష దొరకు తుందేమోనని పిల్లలతోసహా పోతున్నారు. ఈ కరువు కాటకాలను నాకర్మకొచ్చి పడ్డాయి.” అంటూ “అమ్మా! నీవు దయగల ఇల్లాలివిగా ఉన్నా మాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకోగలవాతల్లీ ” అంటూ వేడుకొన్నాడు.
బ్రాహ్మణుడి దీనాలాపములకు విశాలాక్షి హృదయం ద్రవించింది. చాలా బాధపడింది. ఎలాగైనా ఆ వృద్ధ బ్రాహ్మణుడికి సాయం చేయాలనుకొంది పిల్లలతో నున్న బ్రాహ్మణునికి సాయంచేయటంకంటే మంచికృత్యం మరొకటి ఉండదని భావించింది. తనవద్దనున్నవింతపుష్పాన్ని ఆ బ్రాహ్మణునకిస్తూ “ఓ వృద్ధ బ్రాహ్మణు డా! ఇది గొప్ప మహిమాన్వితమైన పుష్పం. దీనిపరిమళం యోజనం దూరం (8 మైళ్ళు) వరకూ వ్యాపిస్తుంది. ఎన్నిరోజులైనా సరే పుష్పం వాడిపోదు. తీసుకో ! మంటూ ఇచ్చింది. అందులకా బ్రాహ్మణుడుఅమ్మాయీ ! ఈ పుష్పం తీసుకొని నేనేంచేసుకోను. నేనేమన్నా ఆడదానినా ! ప్రస్తుతము నాకు, నా పిల్లలకూ కావల సింది పూటకింత కూడు (తిండి) గాని ఈ పుష్పం ఎందుకమ్మా” అని అమాయకంగా అన్నాడు.
అంతటవిశాలాక్షి “ఓబాపడా ! ఈ పువ్వునీ సమస్యను తీర్చగలదు. యోజన పర్యంతం తనపరిమళాన్ని వెదజల్లే ఈ వాడనిపువ్వును నీ శేషజీవితాన్ని ఆదుకొనే వారెవరికైనా అమ్మివేయి. దాంతోనీకష్టాలు గట్టెక్కుతాయి. మహిమాన్వితమైన ఈ పుష్పం నీజీవితాన్ని బాగుచేయగలదు. తీసుకో !”మని ఇచ్చింది. అంతట బ్రాహ్మణుడు ఆమహిమగలపువ్వును తీసుకొని విశాలాక్షిని దీవించిశెలవు తీసుకున్నాడు.
విశాలాక్షి మరల తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఎంత సేపటికి ఏ గ్రామం రాకపోవటంతో ఆ అడవిగుండా ప్రయాణం చేస్తూ కొంతదూరంపోయేసరికి అల్లంత దూరంలో ఏదోగ్రామంఉన్నట్లు కనపడింది. అటుగా వెళ్తున్న ఆమెకు డప్పులు శబ్దాలు, వింతవింత అరుపులు వినపడసాగాయి. కాగడాలతో కొందరు కోయదొరలు, ఏదోజాతర జరుపుకుంటున్నారని గ్రహించింది. వాళ్ళంతా వింత, వింత ఆకారాలతో, పూసలదండలతో రకరకాల వాయిద్యాలతో భీకరమైన రాక్షసుల్లా ఉన్నారు. వారంతా ఒకదీపంచుట్టూ లయబద్దంగా తిరుగుతూ, కోయగీతా లాలపిస్తూ ఇనుపగజ్జెళ్ళతో నృత్యం చేస్తున్నారు. డప్పులువాయిస్తూ త్రాగుతూ, త్రుళ్ళుతూ, తూగుతూ నాట్యం చేస్తున్నారు.
ఆ భయంకరకోయజాతిమనుషులను చూడగానే విశాలాక్షిభయపడి పోయింది. ఇంకానయం వారికంటబడలేదనుకొని సరిపెట్టుకొని గుర్రాన్ని ఎవరికీ కనపడకుండా దూరంగా ఒక పొలంలో కట్టివేసింది. తను మరొకవైపుకు వెళ్ళి చూసింది. అక్కడంతా కోయజాతివారి గుడిసెలున్నాయి. ఏ ఒక్క గుడిసెలోను దీపం లేదు. అంతా చీకటే ! నక్షత్రాలు మిణుకు మిణుకు కాంతిలో ఆ ప్రదేశాన్నంతా తీక్షణంగా చూసింది. అక్కడెవరూ ఆడా,మగా అనే తేడా లేకుండా అందరూ ఉత్సవంలో మునిగితేలుతున్నారు. ప్రతిగుడెసకు మెట్లున్నాయి. ఆ విశాలాక్షి అప్పటికే చాలా అలసిపోయిందేమో ! ఎవరూలేని, ఒక గుడిసెమెట్లపై కూర్చుంది. ఆ ఉత్సవాన్ని గమనిస్తున్న విశాలాక్షి నెమ్మదిగా నిద్రలోనికి జారుకుంది. ఒక్క కునుకు తీసిందోలేదో విశాలాక్షినొక కోయజాతి ఆడమనిషి చూడనే చూసింది.
విశాలాక్షిని ఆకోయజాతి స్త్రీ, తన కోయభాషలో ఏదో అడిగింది ఏమీ అర్ధంకాని విశాలాక్షి" అమ్మా ! నేనొక బాటసారిని, పరదేశం నుండి దారితప్పి ఇటువచ్చాను. ఉదయమే వెళ్ళిపోతాను” అని చెప్పింది. విశాలాక్షి భాషవారికేం అర్ధం అవుతుంది. ఆ కోయజాతి స్త్రీ కంగారుగా” అయ్యయ్యయ్యో ! అమ్మమ్మమ్మో! ఓరేయ్ ఇలా రండిరా , ! కొండదేవత ఈడ మా గుడిసెకాడ కూకుందిరా ! బేగా రండిరా ! మతిలేనోళ్ళం తల్లీ! నీవిక్కడుంటే మేమక్కడ మొక్కుతున్నాం. క్షమించు తల్లీ” అంటూ తనవారందరికి చెప్పింది. జాతరలోనున్న కోయజాతివారంతా ఈ అరుపులు విని“పదండిరాపదండి" అంటూ విశాలాక్షి ఉన్నగుడిసె వైపు రా సాగారు. ఇదంతా గమని స్తున్న విశాలాక్షికి పై ప్రాణాలు పైనే పోయినంతపనైంది. ఇప్పు డేమిటి చేయటం? కొండదేవత కాదని తెలిసిన మరుక్షణం నన్ను వీరంతా నరికిపోగులు పెడతారు. ఏం చేయాలి అనుకుంటున్న విశాలాక్షికి చక్కటి ఆలోచనవచ్చి అమలులో పెట్టింది. ఈ
వెంటనే విశాలాక్షి తన జట్టును విప్పి విరోబోసుకుంది. మెట్లపైనున్న పసుపు, కుంకుమను ముఖానికి కాళ్ళకు పూసుకొంది. పెద్దకుంకుమ బొట్టును పెట్టుకుంది. కంటికి కాటుక పెట్టుకొని నాలుకను బయటకు చాచి ఊగిపోతూ ఉహు ఉహు అంటూ శబ్దం చేయసాగింది. .
ఆదృశ్యం చూసిన కోయజాతివారంతా ఆ శబ్దానికి అనుగుణంగా అటూ ఇటూ ఊగుతూ, త్రుళ్ళుతూ, తూగుతూ నృత్యంచేయసాగారు. దండాలమ్మవన దేవతా నీకు దండాలమ్మా ! మమ్మల్ని చల్లగా చూడుతల్లే ! అంటూ తెచ్చిన ఆహారపదార్ధాలను ప్రసాదంగా నివేదించసాగారు. కొందరు కోయజాతివారు
||కొండ దేవతా నీకు దండాలమ్మా కోరికోరి నిన్నుకొలిచేమమ్మా !
|| వనదేవతా నీకు వందనమమ్మా ! వరాలిచ్చి మమ్ము దీవించమ్మా! అంటూ పాటలు పాడుతూ లయబద్దంగా నాట్యం చేస్తూ కొలువసాగారు. విశాలాక్షి తాకి °దంతా ఏదో వింతగా తోచింది. తానేమిటి ? కొండదేవతేమిటి? వీరంతా వన దేవతని మ్రొక్కటమేమిటి? అంతా దైవలీల ! నన్నీవిధంగా రక్షించుకోమని ఆ దేవతే ప్రేరేపించిందేమో ! అనుకుంటూ ఊగిపోసాగింది.
ఆ కోయ జాతివారు కూడా అలాగే అటుఇటూ ఊగుతూ, కొమ్మలు, రెమ్మలు, ఆకులలములతో విసరుతూ” అమ్మోమ్మతల్లీ ! ఓ కొండదేవతా ! ఇకనుండి తప్పులు చేయంతల్లీ ! నీ జాతర సక్రమంగా చేస్తాంతల్లీ ! నీవు మమ్మల్ని కరుణించి మాగుడిలోనికిరాయే తల్లీ ! మమ్ము చల్లంగచూడుమాతల్లో ! గుళ్ళోకొచ్చి శాంతించు తల్లీ ! మొక్కులు తప్పక ఇస్తాతల్లీ ” అంటూ డప్పులువాయిస్తూ, నాట్యంచేస్తూ మర్రిమండలతో విసరుతూ ! పసుపూ, కుంకుమలు జల్లుతూ గీతాలు పాడసాగారు. బలులుపానకాలిస్తాంతల్లీ మమ్మల్ని చల్లంగ చూడు ఓ కొండ దేవతా” అంటూ ఒక్కతసాగారు. గుడి ఎక్కడ ఉందో తెలియని విశాలాక్షి పరుగు పరుగున, వారింతకు ముందు దీపం చుట్టూ నాట్యం చేసిన ప్రదేశానికి వచ్చి మధ్యలో దీపంవద్ద చతికిలబడింది.
వారంతా డప్పులుకొడుతూ, వాయిద్యాలు మ్రోగిస్తూ గంటలువాయిస్తూ ఆమెననుసరించారు. విశాలాక్షి వారందరిని ఆపమని సంజ్ఞ చేసింది. వారంతా శబ్దాలుచేయటం మానివేసారు. కొంతమంది ఆడవాళ్ళు మాత్రం మాట్లాడుకోవడం, ఆ నిశ్శబ్దవాతావరణంలో వినిపించింది. ఈపాలి మనమ్మోరు మంచి అందంగా తయారై వచ్చిందిరోయ్! మంచిదుస్తులు ధరించి మెరిసిపోతా ఉందికదూ" అని " కొందరు ఈయమ్మకు పిల్లలు లేరట మొగుడుమాత్రం పోతురాజటరోయ్”
అరె ! మనందరం ఆమె పిల్లలంకాదేటి ! మనమంతా ఆమె బిడ్డలమే ! అమ్మోరు భలే మెరిపిపోతావుందిరోయ్! అమ్మోరికి లోటేంటెహే! అమ్మోరు ఎంత 'సేపుంటుందో ఏమో ! ఎప్పట్లాగే తెల్లారెళ్ళిపోద్దిరా ! అనుకుంటూ ఎవరి ఇష్టమొచ్చి నట్లు వారు తమతమ అభిప్రాయాల్ని వెళ్ళబుచ్చుతున్నారు. ఈ మాటలన్నీ విశాలాక్షి శ్రద్ధగా విన్నది.
ఆ తెల్లవార్లూ ఆ కోయజాతివారంతా రకరకాల బలులు మ్రొక్కు ఇచ్చారు. అమ్మోరికి ఆహారపదార్ధాలనుప్రసాదంగానివేదించారు. పండ్లుపువ్వులు సమర్పించారు. విశాలాక్షి కొన్నింటిని తిని, మరికొన్నింటినిపారవేసి, కావలసినంత పానకం త్రాగింది. ఆమె కొరికి పారవేసిన ఫలాలను వారు మహాప్రసాదంగా స్వీకరించారు.
తెల్లవారబోతుంటే విశాలాక్షి లేచివెళ్ళబోయింది. వారంతా ఆమెను కొంత దూరం అనుసరించి వెనుదిరిగారు. విశాలాక్షి దూరంగా పొలంలో కట్టివేసిన తనగుర్రం వద్దకువచ్చి హడావిడిగా వారందరికీ చేయిఊపుతూ తలాడిస్తూ అతి వేగంమీద అశ్వంపై వెళ్ళిపోయింది. దూరం నుండి చూస్తున్నవారంతా అమ్మోరికి జేజేలు పలుకుతూ తమ గ్రామానికి వెళ్ళిపోయారు. కొంతదూరం పోయిన తర్వాత విశాలాక్షి వెనుదిరిగి చూచింది, ఎవరూ అనుసరించుటలేదని నిర్ధారించుకొని అమ్మయ్యా ! బ్రతుకుజీవుడా అనుకుంటూ దగ్గరలో ఉన్న కొలనులో నీరు త్రాగి, గుర్రానికి దాణా పెట్టి ఊపిరిపీల్చుకుని గండంగట్టెక్కిందిరా భగవంతుడా” అను కుంటూ నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగించింది.
విశాలాక్షి కొంత సేపటికి కోటీశ్వరమనే పుణ్యక్షేత్రాన్ని చేరుకుంది. ఆనాడు శివరాత్రికావటంవల్లన అక్కడున్న శివేశ్వరాలయానికి అనేకమంది భక్తులు వచ్చారు. వారందరూ కోనేటిలోస్నానంచేసి స్వామిని దర్శించుకొంటున్నారు. విశాలాక్షికూడా గుర్రాన్ని ఒక సురక్షిత ప్రదేశంలో కట్టివేసి, కోనేటిలో స్నానమాడి దేవుని దర్శించు కుందామని ఆలయంలోనికి ప్రవేశించింది. దేవుని దర్శించుకొని తిరిగివస్తుంటే ఆలయంలో ఆమెకొక స్త్రీ కనిపించింది. ఎక్కడో చూసినట్లనిపించి తదేకంగా ఆమెనే చూడసాగింది. ఇది గమనించిన ఆమె“ఏమమ్మా ! ఇంతకుముందు నన్నెక్క డైనా చూసావా ? లేక నాలాంటి వారెవరైనా తారస పడ్డారా ! అని అడిగింది. అదే ! గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నానండీ ! అందివిశాలాక్షి.
ఓసి ! నీ ఇల్లు బంగారంకానూ ! నన్నే గుర్తుపట్టలేదటే ! ఒకనాడు ఉద్యాన వనంలో నేను వీణపై వాయిస్తుంటే నీవు నావద్దకురాలేదూ! పాటయ్యాక పలకరిద్దా మనుకుంటే నీవు నిద్రలోమునిగిపోలేదూ ! గుర్తురాలేదూ ! మళ్ళీ ఇంతకాలానికి కలిశావు. ఇప్పటికైనా గురొచ్చిందా లేదా ! అంది. విశాలాక్షి విస్తుబోయింది. అవును. అప్పుడెప్పుడో నాకొక కలవచ్చింది. అందులో వీణ మీటుతూ కనిపించిన ఆవిడ ఈమెయే సందేహం లేదు. ఆహా ! ఎంతవిడూరం ! కలలో కనిపించిన ఆవిడ వాస్తవంలో కనబడటమేమిటి? ఏమిటీవింత? అంతా ఏదో మాయలాగుందే అనుకొని జ్ఞాపకమొచ్చావమ్మా!అంది. నాడు నీకు లభించిన వాడనిపువ్వు, ఆకలి దప్పులు తీర్చేఫలం ఆండింటిని జాగ్రత్తగా దాచుకున్నావుగదా ! అడిగిందామె.
లేదమ్మా! వాటిని కడుదీనావస్థలోనున్న బ్రాహ్మణులకు దానం చేశాను. అంది. అయ్యో! అవి అమ్మవారు నీకిచ్చిన ప్రసాదంకదూ ! వేరొకరికి దానం చేయతగునాతల్లీ ! సరేలే ! దేవునిదయవల్ల అవి మరల నీకందుతాయిలే” అంది.
విశాలాక్షి తనకు కనిపించిన ఉద్యానవన మహిళనుగురించి తెలుసు కోవాలనుకునేంతలో " ఇక్కడే ఉండమ్మా ! నేను దైవదర్శనం చేసుకొని ఇప్పుడే వస్తాను. అంటూ తటాలున లేచి గర్భగుడిలోనికి వెళ్ళిపోయిందావిడ.
అలా వెళ్ళినావిడ ఎంత సేపటికి తిరిగిరాలేదు. విశాలాక్షి ఆలయమంతా వెదికింది. ఎక్కడా కనిపించలేదు. ఆమె వివరాలైనా తెలుసుకోలేదే ! అనుకుంటూ వెదుకుతూ బయటికొచ్చి మరల ప్రయాణం కొనసాగించింది.
విశాలాక్షి అతి త్వరలోనే ధర్మపురి అనే నగరాన్ని చేరి అందొక సత్రములో బస చేసింది. అచ్చట సత్రపు అరుగుపై ఇద్దరు వ్యక్తులు మాట్లాడకోవటం విశాలాక్షి విన్నది. ప్రజలు గుంపులు గుంపులుగా పోతున్నారెక్కడికిరా” 'ధర్మాంగద ప్రభువుగారి కొలువులో ఈ రోజు పెద్దసభఒకటి జరుగు తుందట అక్కడికి!”
“ప్రతిరోజు సభజరుగుతుందిగా ! ఈ రోజు విశేషమేమిటో!! ధర్మాంగద మహారాజుగారి కొలువుకొక అద్భుతమైన ఫలము చేరిందట అది వడిలిపోదట, నిత్యము తాజాగా ఉంటుందట దానిని తింటే ఏమవుతుందో ఎవరికీ తెలియదట. అంతేగాదు మళయాలదేశవు రాజుగారు కూడా ఒక అద్భుతమైన పువ్వును తెచ్చి నారట దానిపరిమళంయోజనము (8 మైళ్ళు) వ్యాపిస్తోందట అది నిత్యము తాజాగా ఉండి వాడిపోవటం లేదట అదీసంగతి ఆరెండింటి పై నేడుదర్బారులో చర్చజరుగ బోతోందట. అటుపిమ్మట మదనమంజరినాట్యం కూడా ఉంటుందటఅదీ విశేషము.
విశాలాక్షికి వాటిగురించి ఏంచెబుతారో ఎలాంటి విశ్లేషణలొస్తాయో వినాలనే కోరిక గలిగింది. కాని తను స్త్రీ అందుకే విశాలాక్షి మగవేశం ధరించి రాజసభకు బయలుదేరింది.
రాజసభ రంగురంగుల దీపాలతోను, నగిషీ చెక్కబడిన చిత్తరువులరకుడ్య ములతోను, చక్కగా వ్రేలాడుతున్న తెరలతోను, అందముగా అలంకరించబడి ఉన్నది. ఇరుప్రక్కల ముఖ్యులు కూర్చునేందుకు వీలుగా అందమైన, సింహాసనం లాంటి కుర్చీలతోను, అటుఇటు పూర్వరాజుల అందమైన చిత్రపటాలతోను, వ్రేలాడు తున్న అందమైన చక్కనిదీపతోరణముతోను, ఆ రాజసభ చూడముచ్చటగా ఉంది. ఆ సభమధ్యలో విచిత్రమైన అద్భుతమహిమాన్వితమైన పండును. పుష్పాన్ని వ్రేలాడ . దీసారు. సభఅంతా కిటకిటలాడి పోతోంది. జనంతండోపతండాలుగా రాసాగారు. ఆ అద్భుత పుష్పపరిమళాన్ని అందరూ ఆఘ్రాణిస్తూ ఆనందపార వశ్యంలో మునిగి పోయారు. ఆ పుష్ప పరిమళం వారి హృదయాలను ఆహ్లాదపరుస్తోంది. వివిధ దేశాలరాజులు, ప్రముఖులు ఇరుప్రక్కల ఆసీనులైయున్నారు. అక్కడికి వచ్చిన వారందరూ ఆ వింత ఫల, పుష్పాలను గురించే మాట్లాడు కోసాగారు. ఇంతలో రాజుగారు సభకు విచ్చేసారు. అంతటా నిశ్శబ్దం. రాజుగారొక పర్యాయం సభను సభాసదులను, ప్రముఖులను ఉద్దేశించి” సభాసదులారా ! అసహజమైన, వింత వస్తువులు లభించినచో వాటి విశేషాల్ని అందరకు తెలియ బర్చటం రాజధర్మం! సభలో వ్రేలాడదీసిన వింతఫల, పుష్పముల గురించి మీకు తెలిసే ఉంటుంది. గత పదునైదు దినములనుండి అవి ఇక్కడనే ఉన్నాయి. కాని ఆ ఫలపుష్పములు పాడవనూ లేదు. వాడిపోనులేదు. యోజనపర్యంతం తన పరమళాన్ని వెదజల్లే ఆ వింతపుష్పం విశేషములుగాని, వాడని ఎండిపోని తింటే ఆకలిదప్పులుండవని చెబుతున్న ఆ ఫలాన్ని గురించిగాని మీకేమైనా తెలిసిఉంటే సభాముఖంగా విన్నవించగలరు. కొంతవరకు వీటిని గురించి తెలిసిన వారున్నారు. ముందుగా వారి అభిప్రాయాలను తెలుసుకొందాం. భీమశర్మగారు ముందుగా మీ అభిప్రాయాన్ని వెలిబుచ్చండి” అని ఆజ్ఞాపించారు.
భీమశర్మ లేచి రాజుకు, సభాసదులకు నమస్కరించి “ఆర్యులారా ! నా పేరు భీమశర్మ మాది విజయపురం నాకెక్కువగా చదువ అబ్బలేదు. విద్యావిహీనుడ వని నా బంధువులతో సహా అందరూ అవమానిస్తూ, గేలిచేస్తుంటే భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాను. అంతలో ఎక్కడినుండియో ఒక అశ్వారూఢువచ్చిఅయ్యా! తమరెవరు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య ఘోరపాప మంటూ వచ్చి నన్ను వారించి, నా ప్రయత్నాన్ని విరమింపచేసి, నా వృత్తాంతమంతా విని, జాలిపడి స్వామి! అద్భుతమహిమాన్వితమైన ఆ పండును గ్రహించండి ఇది తింటే ఆకలిదప్పులుండవు. అని చెప్పి ఫలమును ఇచ్చాడు. ఈ ఫలమును సామాన్యులకు ఇవ్వవద్దని మహారాజుగారికిచ్చి వారి దరిద్రమును పోగొట్టుకొమ్మని సెలవిచ్చింది అత్యంత దరిద్రావస్థలో మగ్గుతున్న నేను ధర్మపురికి చేరి మహారాజు గారికి ఈ ఫలమునిచ్చి బహుమానాలందుకొని నా ఆర్ధిక స్థితిని మెరుగుపర్చు కావాలని అడుగగా ఆతనికే ఇచ్చివేశాం మహాప్రభో !" అని చెప్పాడు.
వెంటనే స్వర్ణకారుని సభలో ప్రవేశపెట్టారు. “అయ్యా ! ఈ పండును రెండు, మూడు రోజులు నావద్దనే ఉంచుకొని, నా ప్రియురాలు, వేశ్యయైన తారామణికి ఆమె మెప్పు పొందాలనే తపనతో ఇచ్చాను. ఇంతకుమించి నాకేం తెలియదు ప్రభో” అంటూ ముగించాడు.
అపుడు వేశ్యయైన తారామణిలేచి మహాప్రభూ ! నేనా అద్భుతమహిమగల పండును నాఇంటి గుమ్మానికి కట్టి దానినుండి వచ్చే మధురవాసనలతో విటులనా కర్షించాలనుకొన్నాను. ఇంతలో రాజభటులు ఫలంకోసం అన్వేషిస్తున్నారని తెలిసి ఆఫలంవలన నాకేదేనా ముప్పురావచ్చుననితలంచి దానినెక్కడైనా పారవేయమని మా దాదికి ఇచ్చితిని. అంతకంటే నాకేమీ తెలియదు మహారాజా ! అంది.
వెంటనే దాదిని కూడా రాజసభలో ప్రవేశపెట్టారు. ఆమె భయకంపితురాలై రాజా! నేనాపండును కందకంలో పారవేద్దామనుకొన్నాను. దారిమధ్యలోనున్న నా విటుని పలకరించి పోదామని వెళ్ళాను. అతడా అద్భుత ఫలాన్ని చూసి నన్నూ, పండును ఎంతో మెచ్చుకొన్నాడు. ఆతడు చూపిన ప్రేమాభిమానమునకు ముగ్గు రాలనయ్యాను. ఆతనికే ఆ పండునర్పించాను” అంది.
అంతట విటుడు లేచిరాజా! దాది ఫలాన్నిచ్చిన మాట వాస్తవమే ! అయితే ఆ ఫలాన్ని తినటంవల్ల నాకొచ్చేలాభం ఏమీ ఉండదుగదా అనుకొని దానిని అంగ డికి తీసుకొనిపోయి అధిక ధరకుఅమ్మి సొమ్ము చేసుకోవాలనుకొన్నాను. అంగడికి తీసుకుపోతున్న నాఫలమునుండి అద్భుతమైన మధురవాసనలు వ్యాపిం చగా అందరూ నా చుట్టూ మూగారు. ప్రజలందరూ చుట్టుముట్టి నీవద్దనన్ను ఆ అద్భుతఫలమును చూపమని ఒత్తిడి చేయసాగారు. ఈ అలజడికి రాజభటులు వచ్చి నన్నుభందించి మీ వద్దకు తీసుకువచ్చారు. అదీ సంగతి” అని వినయంగా చెప్పి ఊరుకున్నాడు. సభ్యులందరు కరతాళధ్వనులు చేస్తూ, ఆశ్చర్యాన్ని వెలి బుచ్చుతూ అద్భుత ఫలం యొక్క మహిమను పొగడసాగారు.
అంతట మహారాజు సభనుద్దేశించి “ మీరిప్పుడు అద్భుత పుష్పం గురించి తెలుసుకొందురుగాక ఈ అద్భుత పుష్ప విశేషమేమిటో ప్రధమంగా ఆవృద్ధ విప్రోత్తముడు వివరిస్తాడు." అన్నాడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు లేచి పుష్పమహిమను ఇట్లుచెప్పసాగాడు.
COMMENTS