భేతాళుని మెదటి విక్రమార్క కథ : Read King Vikramaditya and Betal Story in Telugu, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids.
భేతాళుని మెదటి విక్రమార్క కథ : In this article, read King Vikramaditya and Betal Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.
భేతాళుని మెదటి విక్రమార్క కథ Vikramarka Bethala Kathalu Telugu
ఒకప్పుడు చంద్రకూటమి అనే నగరం వుండేది. దానిని వీరవర్మఅనబడే రాజు పాలించుచున్నాడు. ఆయన భార్య మణిమాల. ఈ దంపతులు బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి బయల్దేరి వెడుతున్నారు. వారి రథం అడవి మార్గంన నడుస్తున్నది. ఆ అడవి దాటితే వాళ్ళు వెళ్ళాల్సిన ఊరువస్తుంది. అప్పటికే చీకటి పడింది. అమావాస్య చీకటి. అంతటి అంధకారంలో ప్రయాణం చేయడానికి వారు శంకించారు. ఆ రాత్రికి అక్కడ గడిపి ఆ మర్నాటి ఉదయం ప్రయాణమైవెళ్ళాలనినిర్ణయించుకున్నారు. రధంనుఆపాడు రథసారథి. అవతలగా కొంతదూరంలో పడుకున్నాడు. రాజదంపతులు ఒక చెట్టు క్రిందపడుకున్నారు. ఆ దంపతులుపడుకున్నది. ఒక రాక్షసుడు నివశిస్తున్న మర్రివృక్షం క్రింద వాళ్ళను చూసి రాక్షసుడు సహించలేకపోయాడు. ఆ వెంటనే ఆవేశపూరితుడు అయినాడు
'ఓరీ మానవా! నా నివాసం క్రింద పడుకుని భార్యతో సరససల్లాపాలు సాగించావా మూర్బుడా! చూడండి మీ ఇద్దరినీ తక్షణం యమపురికి పంపుతాను అని ఘబాల్న మీదకురకబోయాడు.
రాజదంపతులు భయపడ్డారు. అప్పుడు మహారాజు "అయ్యా! మాకు తెలియక ఈ వృక్షం క్రింద పడుకున్నాము. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతాం. మా జోలికి రాకు” అని విన్నవించుకున్నారు.
'ఒప్పుకోను' తెలిసి చేసినా తెలియక చేసినా నా నివాసాన్ని అపవితం చేశారు ' ఇందుకుమీరు నాకునరబలిని ఇవ్వాలి. ఆ నరుడు తొమ్మిదేళ్ళు నిండని బాలుడు అయివుండాలి. ఆపని చేస్తానని నీవు వాగ్దానం చేస్తే మిమ్మల్ని విడిచి పెడతాను లేదా యిప్పుడే మిమ్మల్ని చంపేస్తాను.” అని హుంకరించాడు రాక్షసుడు. రాజ దంపతులు అంగీకరించినట్లు వాగ్దానం చేశారు. రాక్షసుడు సంతోషించాడు. రాజ దంపతులు ఆ మర్నాటి ఉదయం లేచి తమ నగరానికి ప్రయాణమై వెళ్ళారు.
రాజు తలిస్తే జరగనది ఏముంది? ఆ మరునాడు ఒక పేద బ్రాహ్మణునికి ఆశలు పెట్టారు. బంగారం, వెండి, కోరినంతగా ఇస్తామని వాటితో పాటు ఒక గ్రామం కూడా ఇస్తానని ఆశ చూపారు. వాళ్ళ మాటలకు లోనై ఆ బ్రాహ్మణుడు తన ఎనిమిదేళ్ళ బాలున్నీ రాజుకప్పగించాడు. ఆ మర్నాడే రాజ దంపతులు బాలుడుని వెంటబెట్టుకొని రాక్షసుడు వున్న చెట్టుదగ్గరకు వచ్చారు.
ఆ బాలుని పేరు సదానందుడు. 'నీకున్న ఆఖరి కోరిక ఏమ'ని రాజు అడిగెను. ఆ బాలుడు జవాబు ఇవ్వకుండా తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడు. పకపకా నవ్వుతున్నాడు. ఆ బాలుని నవ్వులు రాక్షసుడు విన్నాడు. ఆ బాలుని నవ్వుతో రాక్షసుని మనస్సు మారింది.
'నువ్వు నాకు బలిఇవ్వనవసరం లేదు' మీరు హాయిగా వెళ్ళండి అని అన్నాడు రాక్షసుడు.
“కథను విన్నావుగా మహారాజా! ఆ బాలుడు నవ్విన కారణము చెప్ప గలవా అని అడిగాడు” విక్రమార్కుణ్ణి భుజానవున్న భేతాలుడు. విక్రమార్కుడు ముందుకు నడుస్తూనే ఆలోచించాడు. చిన్నవాడినైన నా శరీరం పై మీకెందుకు అంత వ్యామోహం. ఎనాటికైనా అందరూ చావవలసిందే కదా! అనుకుంటూ ఆకాశం వైపు చూసి భగవంతుణ్ణి తలచుకుంటున్నాడని చెప్పాడు విక్రమార్కుడు.
ఆ మరుఘడియలో భేతాళుడు విక్రమార్కుని భుజమునుండి మాయమై చెట్టు కొమ్మకు చేరాడు.
విక్రమార్కుడు ఆ తక్షణం వెనక్కు తిరిగి చెట్టువద్దకు చేరాడు. వెంటనే భేతాళుణ్ణి చేజిక్కించుకొని మరల ప్రయాణమై వెడుతున్నాడు. భేతాళుడు నవ్వుతూ అతని భుజం మీద వుండే “రాజా! నాకు చాలాకాలం నుండి సందేహం వుంది. ఆ సందేహానికి సమాధానం ఇస్తే ఆనందిస్తాను. నీవు సకల నీతి పారంగతుడవు! నా అనుమానం తీర్చు! అని మరో కథను వివరించ సాగాడు.
COMMENTS