Friday, 4 June 2021

భేతాళుడు చెప్పిన ఐదోకథ Vikram and Betal Story in Telugu Language

భేతాళుడు చెప్పిన ఐదోకథ : In this article, read Vikram and Betal Story in Telugu Language, "బేతాళ కథలు", "Vikramarka Bethala Kathalu Telugu" for Kids and Students.

భేతాళుడు చెప్పిన ఐదోకథ Vikram and Betal Story in Telugu Language

భేతాళుడు చెప్పిన ఐదోకథ

వెనుకటికాలంలో చిన్న గ్రామం. ఆ గ్రామంలో ధనపాలుడుఅనబడే ధన వంతుడు ఉండేవాడు. అతనుఆస్తిపరుడు ? అతన్నిమించిన ఆస్తిపరులు ఎవ్వరూ లేరని, తానే ఆగ్రామంలో అందరికన్నా ధనవంతుడనని, లోకంలోనే తనను మించిన ధనవంతుడు ఎవ్వరు ఉండరనీ, అందరూ తనముందు తలవంచాల్సి ందేనని గర్వపడుతుండేవాడు.

ధనగర్వం మదించిన అతను చిన్నా పెద్దా అనే తేడాను విస్మరించకుండా అందర్నీఅవమానపరుస్తూండేవాడు. కవులను,పండితులను, గాయకులను చులక నగా చూసేవాడు. వారుకూడా అతన్ని ఏమీ అనలేక తలవంచుకొని పోయేవారు.

ఈ ధనపాలుడుకి ఒక కాలులేదు. కర్రకాలును ఆధారం చేసుకొని నడిచేవాడు. బయటకు ఎక్కడికి వెళ్లాల్సినా పల్లకీమీద వెడుతూండేవాడు.

ఇలావుండగా ఒకనాడుధనపాలుడుపల్లకీమీద ప్రక్కగ్రామానికి బయల్దేరి వెళుతున్నడు. గ్రామం చివరనే పచ్చిక ప్రదేశంవుంది. ఆ పచ్చిక ప్రదేశంలో ఒక గొల్లపిల్లడు గొర్రెలను, మేకలను మేపుకుంటున్నాడు. అవి అతనికి దగ్గరలోనే మేస్తున్నాయి. ఆ బాలుడు మాత్రం ఒక చెట్టుకొమ్మమీద కూర్చుని లల్లాయిపదాలు పాడుకుంటున్నారు.

ఆబాలుని గొంతుపాడుతున్న విధానం ధనపాలునకు నచ్చాయి ! పల్లకీని ఆపి శ్రద్ధగా వింటున్నాడు. అనంతరం ఆబాలుని పిలిచాడు. “భలే అబ్బాయ్ ! నువ్వు బాగాపాడుతున్నావు ! నాకునచ్చావు. రేపునువ్వు మా ఇంటికి వచ్చి నీ పాటలు మావాళ్ళకు వినిపించు. నీకు మంచిబహుమతిని యిస్తాను" అని అన్నాడు ధనపాలుడు.

సరేనన్నాడు నందగోపాలుడు.

ఆ మర్నాటి ఉదయం తనకున్న దుస్తుల్లో మంచివితీసుకుని ధరించాడు. ఆగ్రామంలోని ధనపాలుని ఇంటికి వెళ్ళాడు నందగోపాలు. అప్పటికే ఆయన ఇంట్లో చాలామంది కూర్చునివున్నారు. వాళ్ళను చూసిముందు భయపడ్డాడు. అంతలోనే తేరుకున్నాడు.” తర్వాత ధైర్యం తెచ్చుకుని అందరికీ నమస్కరించాడు.

తదుపరి ఆబాలుడుని అక్కడున్నచాపమీదకూర్చోమన్నాడు ధనపాలుడు. అతను కూర్చున్నాడు. వెంటనే పాడమని చెప్పారు. నందగోపాలుడు తనకు వచ్చిన పాటలన్నీ లయబద్దంగాను, వినసొంపుగానూ పాడి వినిపించాడు.

అక్కడున్నవారి ఆనందానికి అంతులేదు. బాలునిమెచ్చుకున్నారు అదరూ. అనంతరం ఒక పళ్ళెంలో బట్టలు, రూపాయలూ మొదలైనవి వుంచి ఆ బాలునకు బహూకరించాడు ధనపాలుడు. ఆ పిల్లవాడు ఆనందంతో స్వీకరించాడు. 

“ఒరే బాలకా ! నిన్ను ఎంతగానో వరించిందిరా సరస్వతీదేవి. నిజానికి ఆ సరస్వతికి కళ్ళులేవురా, వుంటే నీవంటి నిర్భాగ్యుడిని వరించేదా” అని అన్నాడు. అలాయేదో ఒకటి అనడం ధనపాలునకు సహజగుణం.

నందగోపాలుడు ప్రాణంచివుక్కుమంది. అతను పొందిన ఆనంద మంతా చటుక్కున మాయమైది. ఆ సమయంలో కోపం ఆవరించింది. “మీరు చెప్పినది నిజమో అబద్దమో నాకు అయితే తెలియదుకానీ లక్ష్మీదేవి మాత్రం పూర్తిగా గుడ్డిది !” అన్నాడు ఆ బాలుడు. 

“ఎందుకు అలా అన్నావ్” అడిగాడు ధనపాలుడు.

“అవును దొరా ! ఆమె గుడ్డిది కనుకనే మీవంటి కుంటివారి ఇంటిలో వుంది” అన్నాడు నవ్వుతూ నందగోపాలుడు.

నందగోపాలుని మాటకు అక్కడవున్నవారంతా ఫక్కున నవ్వేశారు.

బాలుని మాటలువిని ధనపాలుడు సిగ్గుతో తలనువాల్చేశాడు. అయితే ఆనాటినుండి తననడతను మార్చుకున్నాడు. కథ అయిపోయింది మహారాజా! ధనపాలుని ఇంట పొందిన గౌరవానికి ఆనందించకుండా ధనపాలుని అందరిలో అవమానించాడు నందగోపాలుడు. అది ఆ బాలుని అవివేకం కదా రాజా” అని అడిగాడుభేతాళుడు.

“కాదు భేతాళా ! ధనగర్వంతో కన్నుమిన్ను గానక ప్రవర్తించేవారి అందరికీ కనువిప్పుకలిగించాడు నందగోపాలుడు. ఒక నీతిని బోధించాడు గొల్లపిల్లవాడైనా అభిమానంకల కుటుంబంలో పుట్టినవాడు నందగోపాలుడు.” అని చెప్పాడు .విక్రమార్కుడు.

ఆ వెంటనే భేతాళుడు అతని భుజం నుండి చటుక్కున ఎగిరి మర్రివృక్షం కొమ్మను వ్రేలాడుతున్నాడు. వికమౌర్కుడు విసుక్కోలేదు. మళ్ళీ వెళ్ళి భేతాళుని చెట్టుకొమ్మ నుండి వేరుచేసి భుజాన వేసుకుని వెళ్ళాడు.


SHARE THIS

Author:

I am writing to express my concern over the Hindi Language. I have iven my views and thoughts about Hindi Language. Hindivyakran.com contains a large number of hindi litracy articles.

0 Comments: