Strange Fruit King Vikramaditya Story in Telugu Language: In this article we are providing వింతపండు తెలుగు కథ. "Vinta Pandu Story in Telugu" for kids.
Strange Fruit King Vikramaditya Story in Telugu Language: In this article, we are providing "వింతపండు తెలుగు కథ". "Vinta Pandu Story in Telugu" for kids and Students
Strange Fruit King Vikramaditya Story in Telugu Language
విక్రమార్కుడు కొలువు తీరి వున్నాడు. మంత్రుడు, సామంతులు వ్యవహారాలు గురించి చర్చలు సాగిస్తున్నారు.
ఆ సమయంలో ఒక పండు వృద్ధుడు విక్రమాధిత్యుని దర్శించాలని వచ్చాడు. చర్చలు సాగుతున్నందువలన ఆయనకు రాజును దర్శించేందుకు అనుమతి దొరకలేదు. రాజును దర్శించి వెళ్ళాలన్న ఆశతో అక్కడే వుండి చర్చలు అయిపోయిన తదుపరి లోపలకి వెళ్ళి విక్రమాధిత్యుని దర్శించాడు.
. “ఎవరు మీరు ? మీ రాకకు కారణమేమిటని ?” విక్రమాధిత్యుడు ప్రశ్నించాడు.
"అయ్యా! నేను వయో వృద్దుడను బ్రతుకు భారమును భరించలేని స్థితిలో ఉన్నాను. ఎంతో అలసట. ఆ అలసట నన్ను పట్టువిడువడం లేదు. వంట్లో శక్తి సన్నగిలింది. నా బాధని, నా పరిస్థితిని అర్ధంచేసుకొని పుణ్యం కట్టుకో తండ్రీ. అని వేడుకున్నాడు.
బ్రాహ్మణుడు కోరింది వింత కోరిక. వృద్ధాప్యం పోవడం ఏమిటి? ఇది సామాన్యంగా జరిగేదేనా ! అనుకున్నాడు. ఏది ఏమైన వచ్చినవారి కోరిక తీర్చే అలవాటు ఉన్న రాజు ఆలోచనలో పడ్డాడు. “అయ్యా ! ప్రస్తుతానికి తమరు మా అతిథి భవనంలో సేద తీర్చుకోండి మీ సమస్యపరిష్కారంగురించి ఆలో చిస్తున్నాను” అని అన్నారు.
బ్రాహ్మణుడు ఆనందభరితుడైనాడు అంతలో ఒక అతను వచ్చి బ్రాహ్మ ణుడును అతిథి భవనానికి తీసుకువెళ్ళాడు. .
విక్రమార్కుడు అందుకు గురించి యోచిస్తూనే ఉన్నాడు. అదే రోజు బ్రాహ్మణుడు అతిథి భవనమునకు వెళ్ళిన కొద్ది సేపటికే ఒక సన్యాసి విక్రమాది త్యుని ఆస్తానములో అడుగుపెట్టాడు. ..
ఆయన సామాన్యమైన సన్యాసి కాదనిపించింది రాజుకు. ఆ వెంటనే అతనికి సకల మర్యాదలు చేశాడు. ఆ తదుపరి ఆ సన్యాసి సంతోషించాడు. తాను వెడుతూ “రాజా! మీ ఆతిధ్యం ఆనందమయం అయింది. ఈ సందర్భంలోనేను ఒక మహత్తరమైన శక్తి కలిగిన పండును మీకు ఇవ్వదలచాను స్వీకరించండి.” అంటూ ఆ ఫలమును చిరునవ్వుతో విక్రమార్కుని చేతికి అందించాడు.
"రాజా ! ఇది సాధారణ సామాన్యమైనఫలంకాదు. దానిని ఆరగించండి. దాన్ని ఆరగించినట్లైతే దాని శక్తి మనిషి జనన, మరణాలను పోగొడుతుంది. యవ్వనవంతులను చేస్తుంది. అనిచెప్పి రాజు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయాడు. ఆ సన్యాసి.
ఆతక్షణం సండును పరిశీలిస్తున్న రాజు ఆసమయంలో తనను ఆశ్రయించిన బ్రాహ్మణుడు స్పురణకు వచ్చాడు. వెంటనే బ్రాహ్మణుని సభకు పిలిపించాడు. “అయ్యావిత్రోత్తమా ఈ పండును మీరు ఆరగించండి. మీ కోరిక ఫలించగలదు. నాకు ఈ ఫలమును మహత్తర శక్తి గలిగిన ఒక సాధువు ఇచ్చి వెళ్ళాడు.” అని చెప్పి ఫలమును బ్రాహ్మణుడుకి ఇచ్చాడు విక్రమాధిత్యుడు.
ఆ వృద్ధుడు ఫలమును విక్రమాధిత్యుని ఎదుటనే తిన్నాడు. అంతే ఆ మరుఘడియలో వృద్ధాప్య బాధలు అన్నీ తుడిచివేసినట్లు మాయమయ్యాయి.
COMMENTS