Evaru Goppa Story in Telugu Language : In this article, we are providing ఎవరు గొప్ప తెలుగు కథ for kids and Students
Evaru Goppa Story in Telugu వరు గొప్ప తెలుగు కథ
ఆరోజున కార్తీకపున్నమి. దేవేంద్రుడునిండుసభలో ఆశీనులై యున్నాడు. అతని ఎదుట అందచందాలు తమ సొత్తు అయినటువంటి నాట్యగత్తెలును నృత్య ప్రదర్శన చేయమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు.
రంభ, ఊర్వశిలు సభలో ప్రవేశించారు. హావభావ ప్రకటనలతో నృత్యం చేస్తున్నారు. వారి నృత్యం సభికులందరినీ మైమరిపించినది. వాళ్ళను సభికులు అంతా మెచ్చుకున్నారు. అయితే ఇంద్రుడుకి సందేహం కలిగింది. సభికులందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు.
సభలో పండితులు, అభిమానులు ఉద్యోగస్థులు అందరూ వున్నారు. వీరిలో ఎవ్వరు నాసందేహాన్ని తీరిస్తే వారిని ఘనంగా సత్కరిస్తాను అన్నాడు.
సభికులు అప్సరసలు అర్ధంకానట్లు మొహాలు చూసుకున్నారు. అందరి దృష్టి ఇంద్రుడి మీద పండింది.
ఇప్పుడు నృత్య ప్రదర్శనను అందరూతిలకించారు. రంభ ఊర్వశిలు వారి పేర్లూ, వారూఅందరికీ తెలిసినవారే. వీరిద్దరిలో ఎవ్వరు అధికులో చెప్పండి అన్నాడు.
ఆయన అడిగిన ప్రశ్నకు ఎవ్వరూ జవాబు ఇవ్వలేకపోయారు. ఆ ఇద్దరిలో అసమర్ధులు ఎవరూ లేరు. ఆ ఇద్దరూ గొప్పవారే అని తలచి తమ అభిప్రాయమును 'ఇద్దరు గొప్పవారే' అని తెలియపరిచారు సభికులు.
సభికుల సందేశం ఇంద్రునికి నచ్చలేదు. 'ఏ విషయంలోనైనా గొప్ప ఎవరికి వుంటుంది అది ఎవరికి ఉంది. అదే చెప్పమన్నాను' అన్నాడు.
ఒకమహర్షి లేచి నిలుచున్నాడు.
మీరు చెప్తారా అని అడిగాడు ఇంద్రుడు
మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇక్కడ వారికి ఇద్దరూ గొప్పవాళ్ళేనని తోచింది తమకు చెప్పారు. అయితే నాది ఒక మనవి! ఏమిటంటే “భూలోకంలో విక్రమాధిత్యుడనే రాజు సకలశాస్త్ర పండితుడు” ఆయన తీర్పులు నిష్కర్షంగా ఉంటాయి. మీకు అభ్యంతరం లేకుంటే వారిని పిలిపించి అడగండి. మీ సందేహానికి వారు సమాధానం ఇస్తారు” అని చెప్పాడు ఆ ఋషి
“అలాంటి మేధావులు భూలోకంలో ఉన్నారా? ఇది చిత్రమైన విషయమే” అని వెంటనే “వారు ఏరాజ్యా ధిపతి” అని అడిగాడు.
ఉజ్జయిని నగరాధీశ్వరుడు అన్నాడు ఆ ఋషి
“అయితే వెంటనే వారినితో డ్కొనిరండి” అని వెంటనే రధసారధి అయిన మాతలని పిలిపించాడు. అతనికి విషయం అంతనీ విశదీకరించి చెప్పారు. అనంతరం నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళి ఉజ్జయినీ నగరాన్ని పాలించుతున్న విక్రమాధిత్యుని నేను ఆహ్వానించానని చెప్పి తీసుకురా” అని పంపెను.
మాతల తక్షణం' భూలోకానికి రధం తీసుకొని వెళ్ళాడు. ఉజ్జయిని నగరాధీశుడు విక్రమాధిత్యునికి విషయం అంతా వివరించాడు. “మహేంద్రుల వారు తమరిని స్వర్గానికి తీసుకురమ్మని పంపారు.” అని చెప్పాడు మాతలి.
ఆ వార్త విని విక్రమాధిత్యుడు ఆనందించాడు. వార్త తీసుకొని వచ్చిన మాతలను సత్కరించి బహుమానాలను యిచ్చాడు. అనంతరం ఆయన తీసుకువచ్చిన రధంమీదనే స్వర్గానికి ప్రయాణమై వెళ్ళాడు.
ఇంద్రుడు అతనిని సాదరంగా ఆహ్వానించాడు. తన ప్రక్కనే సింహాసనం వేరొకటి యేర్పాటు చేసుకొని విక్రమాధిత్యుని దానిమీద కూర్చోబెట్టాడు. తనకు వచ్చిన సందేహంను వివరంగా చెప్పి “యీ ప్రశ్నకు మీరు సమాధానం చెప్ప గలరా” అని అడిగాడు. విక్రమాధిత్యుడు చిరునవ్వుతో తలూపుతూ “చెప్పడానికి ప్రయత్నించు తాను” అని అన్నాడు. .
ఆ వెంటనే ఇంద్రుని కోరికను అనుసరించి రంభ, ఊర్వశిలు నాట్యం చేశారు. ఆ నాట్యం తిలకించారు సభికులు, విక్రమాధిత్యుడు, ఇంద్రుడు.
అనంతరం, “రాజా నువ్వు మహా పండితుడవనీ పండితుల వద్ద అన్ని విద్యలూ కూలంకషంగా నేర్చుకున్నవాడివనీ లోకోక్తి కలదు. ఇప్పుడు నృత్యం చేసిన రంభ, ఊర్వశిలలో ఎవరు గొప్పో చెప్పండి” అని అన్నాడు ఇంద్రుడు.
అట్టే సేపు ఆలోచించలేదు రెండు క్షణాలు అందర్నీ మార్చి చూశాడు. “దేవేంద్రా! నాకుతోచినది చెప్తున్నాను. నృత్యం చేసిన అప్సరసలు రంభ ఊర్వశిలు యిద్దరూ సమానమే ఒకరిని మించిన హావభావ ప్రకటనలు మరొకరు చేశారు. అయితే రంభకన్నా ఊర్వశే మిన్న. అని వూరుకోకుండా భరతనాట్యశాస్త్రాన్ని సూక్ష్మంగా వివరించాడు.
ఇంద్రుడు తదితర సభికులూకాకుండా రంభ కూడా విక్రమాధిత్యుడు చెప్పిన దానికి అంగీకరించింది. విక్రమార్కుని బుద్దిసూక్ష్మతకు అతని విజ్ఞానానికీ అందరూ మిక్కిలి ఆనందించారు. రంభ, ఊర్వశిలు విక్రమార్కునికి పాదాభి వందనం చేశారు. ఇంద్రుడు లేచి నిలబడి విక్రమార్కుని ఘనంగా సత్కరించారు. అంతేగా కుండా ముప్పది రెండు సోపానాలు, అందులో ముప్పది రెండు స్వర్ణ ప్రమిదలూ వుండి, నవరత్న ఖచితమై ప్రకాశించే సింహాసనం ఒకదానిని విక్రమార్కునకు బహూకరించాడు.
విక్రమార్కుడు దేవేంద్రునికి పాదాభివందనం చేయగా “విక్రమార్కుని “నీవు ఆ సింహాసనంపైన కూర్చుని, భట్టి అనబడే మంత్రితో వెయ్యిసంవత్సరాలు రాజ్యాన్ని పాలించు, సాటిలేని ప్రభువుగా ప్రకాశించు” అని దీవించాడు. అనంతరం సింహాసనంను రధంలోనికి ఎక్కించి, ఆ రధంతో విక్రమాధిత్యుని భూలోకానికి పంపాడు ఇంద్రుడు.
బ్రాహ్మణ పండితులు నిర్ణయించిన ఒకానొక శుభముహూర్తాన సమస్త వాయిద్యాల సందడిలో ఇంద్రునిచే బహూకరించబడిన సింహాసనంను అలంక రించాడు. దానిమీద కూర్చునే యెన్నో తీర్పులును నిష్కల్మషంగా అద్భుతంగా చెప్పాడు విక్రమాధిత్యుడు.
అప్పటినుండి కూడా విక్రమార్కుడు మహావ్యక్తిగా నిష్కల్మష ప్రభువుగా ప్రజాక్షేమ శ్రేయోభిలాషిగా ప్రకాశించసాగెను.
0 comments: