Devi Anugraham Story in Telugu Language : In this article దేవీ అనుగ్రహం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Devi Anugraham Story in Telugu Language : In this article, we are providing "దేవీ అనుగ్రహం తెలుగు కథ". "Bhatti Vikramarka Kathalu in Telugu" for kids and Students
Devi Anugraham Story Bhatti Vikramarka Kathalu in Telugu
ఒకనాడు విక్రమార్కుడు భట్టిని వెంటపెట్టుకొని బయల్దేరి పెద్ద అడవిలో ప్రవేశించారు వారు వెళ్ళింది వేటకి అయినా దాన్ని వదిలేసి అక్కడే వున్న శిలా ఫలకంనుచూశాడు విక్రమార్కుడు ఆఫలకం ఒక కోనేరు గట్టున యేర్పాటై వుంది.
విక్రమార్కుని కళ్ళు శిలాఫలకం మీద నిలిచాయి. యీ కోనేటి గట్టున వున్న ఆలయం, దానికి ఎదురుగా మర్రి చెట్టు వుంది. ఎవరైనా ఆ మర్రిచెట్టు పైకి ఎక్కి కోనేరులోనికి దూకాలి ఆ విధంగా దూకి ఆత్మార్పణ చేస్తారో వారిని కాళీమాత అనుగ్రహించుతుంది. వారికి మూడు లోకాలను జయించే శక్తిని కలిగించుతుంది అంతేకాకుండా వెయ్యేళ్ళు రాజ్యపాలన సాగించే ఆయుష్షును యిస్తుంది. అన్ని విధాలా అనుగ్రహించుతుంది.
యీ ప్రకటన చూశాడు. ఆలోచించలేదు యెవరినీ సలహా అడగలేదు. గబగబా మర్రిచెట్టు మీదకి ఎక్కాడు. కోనేరు వేపున్న కొమ్మమీదకు వెళ్ళి గభాల్న కోనేరు లోనికి వురికేడు. ఆ మరుక్షణంలో మహాకాళి ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే విక్రమార్కుడు చేతులు జోడించు నమస్కరించాడు. "తల్లీ తమ అను గ్రహపాత్రుడను” అన్నాడు.
కాళికాదేవి చేయిజాచి వజ్రాలు అమర్చబడిన ఖడ్గంను సృష్టించింది. “రాజా! నీసాహసానికి మెచ్చాను. వజ్రాలు పొదగబడిన యీ వజ్ర ఖడ్గం నీకు బహుమతిగాయిస్తున్నాను. దీన్ని నీనుండివదలకు. దీని సహాయంతో ప్రపంచాన్నే పరిపాలించగల శక్తివంతుడవు అవుతావు. ఈ ఖడ్గం నీ దగ్గర వున్నంతవరకూ నీకు అన్నీ విజయాలే. నిన్ను యెవ్వరూ ఎదిరించలేరు. అని ఖడ్గం విక్రమార్కుని చేతిలో పెట్టింది ఆమరుక్షణంలో అంతర్ధానమైంది.
విక్రమార్కుడు ఒడ్డుకు చేరుకున్నాడు అతను ఒడ్డుకు వచ్చేసరికే అతని కోసం ఎదురుచూస్తున్న భట్టి కంటబడ్డారు. అన్నదమ్ములు యిద్దరూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు.
చేతిలో వున్న ఖడ్గంను భట్టికి చూపించాడు. జరిగిన కధనంతను విశదీకరించాడు. “ఈ ఖడ్గం వరప్రసాదం” అన్నాడు భట్టితో
అంతా విన్న తదుపరి “సోదరా మహాకాళి నీకు రాజ్యపాలనసాగించే టందుకు కదా వేయ్యేళ్ళు ఆయుర్దాయం యిచ్చింది” అన్నాడు.
“ఔను అంతే” అన్నాడు విక్రమార్కుడు.
“నేను మరో వెయ్యేళ్ళు ఆయుద్దాయం నీకు యిస్తున్నాను” అని ఫక్కున * నవ్వాడు భట్టి.
“అదేమిటి?” అర్థంకానట్లు నొసలు చిట్లించి భట్టిని చూశాడు విక్రమార్కుడు.
“అంటే యేడాదిలో ఆరుమాసాలు రాజ్యపాలన చేస్తావు. మిగిలిన ఆరు మాసాలు దేశాలుపట్టి దిరుగుతావు అంటే యేడాదికి పాలించేది ఆరు మాసాలే కనుక వేయ్యేళ్ళకు పరిపాలన సాగించేటందుకు రెండువేల యేండ్లు కావాలికదా! కనుక నువ్వు రెండువేల యేండ్లు జీవించి వుంటావు” అని చెప్పాడు భట్టి.
విక్రమార్కుడు అతని తెలివికి మిక్కిలి ఆనందించాడు. ఆ వెంటనే రాజ్య పాలన గుర్తించి శ్రద్ధ వహించాలి అని చెప్పి తమరాజ్యానికి వచ్చారు. భట్టి పరిపాల నలో ప్రజలు సంతోషంతో గడపసాగారు. భట్టిపాలన ప్రజారంజకంగా సాగుతుంది.
విక్రమాధిత్యుని ప్రతిభ ఆ ప్రాంతం అంతటా ప్రకాశించింది. ఆయన ప్రతిభకు పాలనే అద్దంపట్టింది న్యాయం చెప్పడంలో అతనికి అతనేసాటి. అతనికి రుషికేతు అనే బావమరది వున్నాడు అతను అహర్నిశలూ బావగారు విక్రమాధిత్యుని అంతటి ఘనత్వం సంపాదించాలన్న ఆశతో వున్నాడు. అంతేకాదు రుషికేతుకి తనంతటివారు లేరన్న గర్వం వుండేది. తీర్పులు చెప్పడంలో ఎటువంటి పక్షపాతం వుండకుండా తరుచులాగానే ప్రసిద్ధి కెక్కాలన్న తలంపు వుంది. విక్రమార్కుడు తీర్పులు చెప్పేటపుడు బావమరిది రుషికేతుకూడా సభాస్థలిలో వుండేవాడు.
COMMENTS